logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళ నేతలు రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా నేతలు హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డికి పలువురు మహిళా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి సోదరాభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మితో పాటు కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మలక్పేట్లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు కూడా ముఖ్యమంత్రిని కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి విద్యార్థినులకు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన మహిళలు, విద్యార్థినులతో సీఎం రేవంత్రెడ్డి ఆప్యాయంగా ముచ్చటించారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. తెలంగాణ హైదరాబాద్

1 hr ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
1 hr ago

రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళ నేతలు రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా నేతలు హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డికి పలువురు మహిళా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి సోదరాభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మితో పాటు కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మలక్పేట్లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు కూడా ముఖ్యమంత్రిని కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి విద్యార్థినులకు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన మహిళలు, విద్యార్థినులతో సీఎం రేవంత్రెడ్డి ఆప్యాయంగా ముచ్చటించారు. రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. తెలంగాణ హైదరాబాద్

More news from తెలంగాణ and nearby areas
  • యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు. 🌸🤝 అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆనందాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలు, ఐకమత్యం చిరకాలం నిలవాలని ఆకాంక్షిస్తూ… రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🙏🌹 ఇట్లు, మీ ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీ బూడిద బిక్షమయ్య గారు #budidabikshamaiahgoud #brsparty #kcronceagain
    1
    యావత్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు. 🌸🤝

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రక్షాబంధన్ సందర్భంగా ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆనందాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అందరి జీవితాల్లో ప్రేమ, ఆప్యాయతలు, ఐకమత్యం చిరకాలం నిలవాలని ఆకాంక్షిస్తూ…

రక్షాబంధన్ శుభాకాంక్షలు! 🙏🌹

ఇట్లు,
మీ ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే
శ్రీ బూడిద బిక్షమయ్య గారు
#budidabikshamaiahgoud 
#brsparty 
#kcronceagain
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు... బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు...
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం
వ్యక్తం చేస్తున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    2
    సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    20 hrs ago
  • పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు జనగామ జిల్లా : పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాల లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి గోవులకు దీపహారతి ఇచ్చారు. స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఇచ్చారు. గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు చేశారు.మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న ఆ కుటుంబం. సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు జరిగాయి.పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు.
    1
    పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు
జనగామ జిల్లా :
పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాల లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి గోవులకు దీపహారతి ఇచ్చారు. స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఇచ్చారు. గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు చేశారు.మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న ఆ కుటుంబం. సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు జరిగాయి.పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.
    1
    జగిత్యాల జిల్లాలో CMR ధాన్యం దుర్వినియోగం కేసులో  నలుగురు అరెస్ట్... మరో నలుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సీఎంఆర్ ధాన్యం దుర్వినియోగం చేసిన రెండు రైస్ మిల్లులకు చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం శ్రీరాములపల్లిలోని అమృత ఆగ్రో ఇండస్ట్రీస్, హరిహర ఆగ్రో ఇండస్ట్రీస్‌లలో సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు సివిల్ సప్లైస్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్థారించారు. సివిల్ సప్లై  అధికారుల ఫిర్యాదుతో కోడిమ్యాల పోలీస్ స్టేషన్‌లో మిల్లు యజమానులు 8 మందిపై కేసు నమోదు చేశారు.
కేసులో నిందితులుగా ఉన్న ముక్క గంగాధర్, ముక్క గోదావరి, సామ వజ్రమ్మ, సామ మారుతిలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకుని పనులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 min ago
  • రాఖీ పౌర్ణమి వేళ జంజిరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా.. శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు హనుమకొండ జిల్లా, కమలాపూర్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంజిరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాల్లో గ్రామస్థులు, పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞోపవీత ధారణ, హోమ పూజలు, రక్షాబంధన్‌ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంజిరాల పౌర్ణమి విశిష్టతను గుర్తుచేసుకుంటూ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం కమలాపూర్‌లోని గ్రామ దేవతల ఆలయాలతో పాటు స్థానిక శివాలయాలు, హనుమాన్‌ ఆలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లోని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జంజిరాల పౌర్ణమి వేడుకలతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
    1
    రాఖీ పౌర్ణమి వేళ జంజిరాల పౌర్ణమి వేడుకలు ఘనంగా.. శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు
హనుమకొండ జిల్లా, కమలాపూర్: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కమలాపూర్ మండలం శ్రీరాములపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జంజిరాల పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాల్లో గ్రామస్థులు, పద్మశాలి సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వేద మంత్రోచ్ఛారణల మధ్య యజ్ఞోపవీత ధారణ, హోమ పూజలు, రక్షాబంధన్‌ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జంజిరాల పౌర్ణమి విశిష్టతను గుర్తుచేసుకుంటూ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం కమలాపూర్‌లోని గ్రామ దేవతల ఆలయాలతో పాటు స్థానిక శివాలయాలు, హనుమాన్‌ ఆలయం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లోని దేవతామూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన జంజిరాల పౌర్ణమి వేడుకలతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • *📰 సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు* *📰 బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్* *📰 సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్* *కోదాడ | ప్రజా న్యూస్ నెట్‌వర్క్ | ఆగష్టు 28* కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్‌ ఆందోళనకారుడు మందల ఉపేందర్‌పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు* బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్* సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్* *కోదాడ | ప్రజా న్యూస్ నెట్‌వర్క్ | ఆగష్టు 28* కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్‌ ఆందోళనకారుడు మందల ఉపేందర్‌పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    *📰 సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు*

*📰 బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్*

*📰 సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్*

*కోదాడ | ప్రజా న్యూస్ నెట్‌వర్క్ | ఆగష్టు 28*

కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్‌ ఆందోళనకారుడు మందల ఉపేందర్‌పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి ఆరోపణలు*
బాధితులు, మహిళలపై దురుసు వ్యవహారం.. వీడియోలు వైరల్*
సీఐ తీరుపై విమర్శలు.. చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్*
*కోదాడ | ప్రజా న్యూస్ నెట్‌వర్క్ | ఆగష్టు 28*
కోదాడ పట్టణంలో డబ్బా కొట్టు తొలగింపు వ్యవహారంపై బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమాచారం లేకుండా డబ్బా కొట్టు తొలగించారని ఆరోపిస్తూ బాధితులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రజా న్యూస్ నెట్‌వర్క్ సమాచారం ప్రకారం ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శివశంకర్‌ ఆందోళనకారుడు మందల ఉపేందర్‌పై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను కూడా తోసివేసినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 30 ఏళ్లుగా డబ్బా కొట్టుపైనే ఆధారపడి జీవిస్తున్నామని, ప్రత్యామ్నాయం చూపకుండా తొలగించడంతో తమ జీవనోపాధి దెబ్బతిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    44 min ago
  • అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి
10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    21 hrs ago
  • ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో నుండి కొండా సురేఖ ఫోటో ఔట్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో. ఈ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.
    1
    ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో నుండి కొండా సురేఖ ఫోటో ఔట్
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో. ఈ 
కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.