*రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని* *ఆళ్ల నాని కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటాం* *ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్* *ఏలూరు:* ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్థివదేహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. గురువారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న లోకేష్.. ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. "ఆళ్ల నాని మృతి బాధాకరం. ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. నాని అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సభలో అనేక అంశాలపై ఆయనతో చర్చించేవాడిని. అయితే ఏనాడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హుందాతనంగా ఆయన వ్యవహరించేవారు" అని లోకేష్ తెలిపారు. "రాజకీయాల్లో రాజనీతి ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి ఆళ్ల నాని అన్న. వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు, ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకే ఉపయోగించాలనే భావనతో ఆయన ఉండేవారు" అని చెప్పారు. "ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఆళ్ల నాని సమాజానికి చేసిన సేవలు చరస్మరణీయం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజలకు సేవ చేయాలని, నమ్ముకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి నాని అన్న" అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆళ్ల నాని చేరిన సమయంలో తాను ఆయనతో చెప్పిన విషయాలను మంత్రి గుర్తుచేశారు. "ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిని. మీరు ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటే వ్యక్తి కాదు. క్రమశిక్షణ అనే పాఠశాల మీది. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నడుచుకునే తీరును చూసి మాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పాను" అని లోకేష్ తెలిపారు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు తమ మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆళ్ల నాని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి అక్కడే ఉండి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్ల నానికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డా. నిమ్మల రామానాయుడు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకటరాజు, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏపీ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
*రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని* *ఆళ్ల నాని కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటాం* *ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మంత్రి నారా లోకేష్* *ఏలూరు:* ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్థివదేహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. గురువారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న లోకేష్.. ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. "ఆళ్ల నాని మృతి బాధాకరం. ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. నాని అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సభలో అనేక అంశాలపై ఆయనతో చర్చించేవాడిని. అయితే ఏనాడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హుందాతనంగా ఆయన వ్యవహరించేవారు" అని లోకేష్ తెలిపారు. "రాజకీయాల్లో రాజనీతి ఉండాలని బలంగా
నమ్మిన వ్యక్తి ఆళ్ల నాని అన్న. వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉండేవారు, ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకే ఉపయోగించాలనే భావనతో ఆయన ఉండేవారు" అని చెప్పారు. "ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఆళ్ల నాని సమాజానికి చేసిన సేవలు చరస్మరణీయం. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ప్రజలకు సేవ చేయాలని, నమ్ముకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి నాని అన్న" అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆళ్ల నాని చేరిన సమయంలో తాను ఆయనతో చెప్పిన విషయాలను మంత్రి గుర్తుచేశారు. "ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గరుండి చూసిన వ్యక్తిని. మీరు ఎప్పుడూ లక్ష్మణ రేఖ దాటే వ్యక్తి కాదు. క్రమశిక్షణ అనే పాఠశాల మీది. మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో నడుచుకునే తీరును చూసి మాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పాను" అని లోకేష్ తెలిపారు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు తమ మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
ఆళ్ల నాని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్ల నాని అంత్యక్రియలు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి అక్కడే ఉండి అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తరపున ఆళ్ల నానికి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, డా. నిమ్మల రామానాయుడు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకటరాజు, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీఎస్‌ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏపీ భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్పొరేషన్ చైర్మన్ వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.1
- ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్స్ యు కృప సమాధానం తోడైయులను గాక1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4
- దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు4
- బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి1
- అలంపూర్: జాతీయ జెండాను ఎగరవేసిన ఎమ్మార్వో ప్రభాకర్ నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా స్థానిక ఎమ్మార్వో మహనీయులైన చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయం ఆర్ ఐ లు, జిపిఓలు ,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.1