ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 8 :– *మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం* *200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు* *న్యూరో, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ నిపుణులచే వైద్య పరీక్షలు* *పత్రికా ప్రకటన* *కాటరాక్ట్ సమస్య ఉన్నవారికి ఉచిత కంటి వైద్య చికిత్సకు ఏర్పాట్లు* *రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీటీవీ కెమెరాలపై అవగాహన కల్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండలం మేడిగూడ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆదివాసీ సంప్రదాయాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వైద్యులు, పాఠశాల విద్యార్థులచే వైద్య శిబిరాన్ని ప్రారంభించి, నిపుణులైన వైద్యులచే గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. న్యూరో ఫిజీషియన్, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సుమారు 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత చదువులు ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, విద్య ద్వారా సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని, నకిలీ బాబాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య శిబిరంలో భాగంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన వారికి వాహన సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వ్యసనానికి గురైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఎస్సై పి. గౌతమ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ నౌసర్, వైద్యులు నవీన్ రెడ్డి, సిద్ధార్థ్, భాగ్యలక్ష్మి, ఆనంద్, రామకృష్ణ, ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- *బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వరం కాలనీ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పరిశీలించారు. *మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ గారి* ఆదేశాల మేరకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ దొనకంటి వెంకట్,భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 8 :– *మేడిగూడలో పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం* *200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు* *న్యూరో, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ నిపుణులచే వైద్య పరీక్షలు* *పత్రికా ప్రకటన* *కాటరాక్ట్ సమస్య ఉన్నవారికి ఉచిత కంటి వైద్య చికిత్సకు ఏర్పాట్లు* *రోడ్డు భద్రత, మహిళల భద్రత, సీసీటీవీ కెమెరాలపై అవగాహన కల్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండలం మేడిగూడ గ్రామంలో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆదివాసీ సంప్రదాయాలతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వైద్యులు, పాఠశాల విద్యార్థులచే వైద్య శిబిరాన్ని ప్రారంభించి, నిపుణులైన వైద్యులచే గ్రామస్తులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. న్యూరో ఫిజీషియన్, గైనకాలజీ, డెంటల్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సుమారు 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత చదువులు ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, విద్య ద్వారా సమాజం, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని, నకిలీ బాబాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య శిబిరంలో భాగంగా కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అవసరమైన వారికి వాహన సౌకర్యం కల్పించి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే వ్యసనానికి గురైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఎస్సై పి. గౌతమ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ నౌసర్, వైద్యులు నవీన్ రెడ్డి, సిద్ధార్థ్, భాగ్యలక్ష్మి, ఆనంద్, రామకృష్ణ, ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది, గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి : లంక రాఘవులు ఆదిలాబాద్: జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదిలాబాద్‌ను వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లంక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపి, కరువు ప్రాంతంగా ప్రకటించేలా తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వ్యవసాయ కూలీలకు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు సైతం పంటలు పండక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి కూలీలకు నిరంతరం పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 9, 12, 13 తేదీల్లో మండల కేంద్రాల వద్ద నిర్వహించే ధర్నాల్లో ఉపాధి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల స్వామి, సంతోష్ స్వామి, జి.రామన్న, కామలే విఠల్, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.1
- Hyderabad1
- ఆసిఫాబాద్‌లో క్రీడా మైదానాల కొరత..అధికారులు వెంటనే స్పందించాలి: డీవైఎఫ్‌ఐ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సరైన క్రీడా మైదానం లేక ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గేడెం టీకానాం తెలిపారు. జనకాపూర్ గ్రౌండ్‌లో పిచ్చి మొక్కలు పెరిగి, పగిలిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయన్నారు. రన్నింగ్‌కు ట్రాక్ లేక అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు వెంటనే మైదానాన్ని శుభ్రం చేసి రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు.1
- సంవిధానం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా లోక్ భవన్ ముట్టడి: కాంగ్రెస్, వామపక్ష హైదరాబాద్ / న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువులను పరిరక్షించాలంటూ 'సేవ్ డెమోక్రసీ' నినాదంతో విపక్షాలు కదంతొక్కాయి. లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త వాతావరణం మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగింది. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్షాలైన వామపక్షాల (CPI, CPM) నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కదిలివచ్చి తమ నిరసన గళాన్ని వినిపించారు. భారీ సమీకరణ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వందలాది మంది కాంగ్రెస్, వామపక్ష శ్రేణులు లోక్ భవన్ ముట్టడిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసుల మోహరింపు: ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోక్ భవన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు: ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీస్యం చేస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజ్యాంగ హక్కులను హరించే కుట్రలను ఎంతమాత్రం సహించేది లేదు." — నిరసనలో పాల్గొన్న ప్రముఖ విపక్ష నేతలు ఈ ఉమ్మడి నిరసన కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై ఇలాగే కలిసి పోరాడతామని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.1
- తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ గారీనీ పరామర్శించిన బాన్సువాడ శాసనసభ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గౌస్ గారి తండ్రి స్వర్గస్తులు అయ్యారు అని తెలుసుకొని కో ఆప్షన్ సుల్తానా గౌస్ గారి ఇంటికి వెళ్ళి ఓదార్చి మనోధైర్యం చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వారితో పాటు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి గారు బాన్సువాడ టౌన్ సీఐ తుల శ్రీధర్ గారు సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారు అలీముద్దీన్ బాబా గారు బోర్లం శ్రీనివాస్ రెడ్డి గారు నాయకులు తదితరులు పరామర్శించడం జరిగింది1