Shuru
Apke Nagar Ki App…
హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు HYD: హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Ram Thotapally
హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు HYD: హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
More news from Hyderabad and nearby areas
- ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు రాసే ముందు జాగ్రత్త: మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ABN బాధాకృష్ణ.. మా మీద నీతిమాలిన రాతలు రాసే ముందు జాగ్రత్త నీ కాళ్ళు మొక్కినోడు, నీ దోస్తుకు శిష్యుడు సీఎం అయితే ఆయనకు డప్పు కొట్టుకో కానీ మా మీద నీతి మాలిన రాతలు రాయకు ABN బాధాకృష్ణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో నాకు 47 ఎకరాలు ఉందని అన్నాడు, నిన్న నా ప్రాంతానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ అనలేదు కానీ బాధాకృష్ణ ఏమో ఒక దగ్గర 110 ఎకరాలు, ఇంకో దగ్గర 80 ఎకరాలు ఉందని రాస్తున్నాడు నాకు 110 ఎకరాలు, 80 ఎకరాలు ఉన్నాయని అన్నావుగా, చూపించు రాధాకృష్ణ ఎక్కడున్నాయో? నేను రైతులను కలిసేది, ఎండిపోయిన పొలాల దగ్గరికి పోయేది ఒక్కనాడు కూడా ABN పేపర్లో రాదు ఎందుకంత కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ బాధ పడుతావు రాధాకృష్ణ ఈ రాధాకృష్ణ రాసే స్క్రిప్ట్ కాంగ్రెస్ సన్నాసులకు చదవడానికి రావడం లేదని, ఆయనే తిరిగి పేపర్‌లో రాస్తున్నాడు * మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి1
- కేశంపేట:భక్తిశ్రద్ధల నడుమ కాకునూరులో గణనాథుడికి ఘన వీడ్కోలు కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. చిన్నారులు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా నిమజ్జనం నిర్వహించారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు గణనాథుడిని ప్రార్థించారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.1
- రైతుల పంటలు ఎండిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా? *ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం* రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జూరాల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాగునీటిని విడుదల చేయించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావును అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.జూరాల ప్రాజెక్టు పరిధిలో మొక్కజొన్న, వరి, పత్తి తదితర పంటలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి సమస్యలను ప్రశ్నిస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రైతులకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.పోలీసుల వ్యవహారశైలిని కూడా ఆయన తప్పుబట్టారు.అరెస్టులు, నిర్బంధాలతో రైతుల సమస్యలను అణచివేయలేరని అన్నారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.1
- 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని చచ్చినా.. బతికినా ఇక్కడి నుంచి కదిలేది లేదని ఖమ్మం శ్రీనివాస్ నగర్ భూ నిర్వాసిత బాధితురాలు వాపోయింది. ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం లాభమని, పేదలను ఏడిపిస్తున్నారని.. వాళ్లు బాగుపడరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడుంటున్న ఇళ్లను కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలని చెప్పింది. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని పేర్కొన్నారు.1
- వరంగల్ ఎంజీఎం(Mgm) ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు... ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు.1
- మిట్ట గణపయ్య...వెళ్లి రావయ్యా. . పెదకూరపాడు మిట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన గణనాథుడి ఊరేగింపు మహోత్సవం మంగళవారం రాత్రి కన్నుల పండుగగా సాగింది.. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడిని వివిధ రకాల పుష్ప జాతులతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చాడు. తీన్మార్ డబ్బులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మేళతాళాలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా కాల్పుల నడుమ గణనాథుడు గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తరలారు. శోభయాత్రను గ్రామ పెద్దలు అర్థిమళ్ళ రమేష్, ఏటుకూరి బ్రహ్మయ్య, ఏటుకూరి రత్నకుమార్, గళ్ళ బాబు, భాష్యం ఆంజనేయులు, అండ్ర ప్రసాద్ గుడిపూడి చిన్నరాజు, మక్కెన సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా ప్రదర్శించిన నృత్య ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున యువత, పెద్దలు తరలివచ్చి సందడి చేశారు3
- ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు ఖమ్మం మమత హాస్పిటల్లో జరిగిన డాక్టర్ జగదీశ్ సంస్మరణ సభలో డాక్టర్ చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. చివరిసారిగా ఓ పేషెంట్కు చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ, ఆయన మందుల ఖర్చును కూడా తానే భరిస్తానని జగదీశ్ చెప్పారని తెలిపారు. ఎంతోమంది పేదలకు సహాయం చేశారని, రోజుకు 3–4 సర్జరీలు చేసేవారని పేర్కొన్నారు. అలాంటి డాక్టర్ మళ్లీ పుట్టరని, ఆయన లేని లోటు తీరనిదని కన్నీటిపర్యంతమయ్యారు.1
- బూర్గంపహాడ్: దయ్యం పట్టిందని వృద్ధురాలికి చిత్రహింసలు.. బూర్గంపాడు మండలంలోని జింకలగూడెంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి దయ్యం పట్టిందని కొందరు ఆమెను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితురాలిని చెట్టుకు ఎక్కించి కిందకి జారకుండా మేకులు కొట్టి, ఆపై ఆమెను తాడుతో కొట్టారని పేర్కొన్నారు. ఈ ఘటన రెండు నెలల క్రితం జరగగా సోమవారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.1
- పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి. పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి. పెదకూరపాడు. బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్ వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.2