పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన
వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- పొట్ట దశలోని ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పొట్ట దశలోనే ఎండుతున్న వరి పంటలు అన్నదాతను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి నిజామాబాద్ రూరల్, అక్టోబర్ 08 వర్షాభావ పరిస్థితులు, విద్యుత్ కోతల కారణంగా డిచ్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆయా గ్రామాల్లో ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించి, ఆందోళనలో ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో పాటు, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా బోర్ల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం అవసరమైన సమయంలో నీరు అందడం లేదని రైతులు దినేష్ కులచారికి వివరించారు. పంటలు చేతికందే దశలో ఎండిపోతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులచారి మాట్లాడుతూ.. అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ఆపదలో ఉన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆధారంగా తీసుకుని, ప్రస్తుతం ఎండిపోయిన పంటలకు క్వింటాలుకు రూ.3,400 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేసి ఉంటే, ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో ఊరట కలిగేదని అన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.2
- బోధన్ ఏఎంసీ నూతన చైర్మన్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం.. చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. బోధన్, :(అక్టోబర్ 8): నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్:. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్‌గా ఎన్నికైన. నాగేశ్వరరావును బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం లయన్స్ భవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమన్ బసవేశ్వరరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఏఎంసీ చైర్మన్‌గా ఎన్నిక కావడం బోధన్ ప్రాంతానికి గర్వకారణమన్నారు. ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అనుభవం వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నాగేశ్వరరావు గతంలో పెంటఖుర్డు సర్పంచ్‌గా, పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిగా, బోధన్ మండల కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. లయన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. నాగేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి బోధన్ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో ముందుకు సాగుతూ బోధన్ ప్రాంత ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని నూతన ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.4
- वरकरी संप्रदाय के प्रतिनिधि *सद्गुरु श्रीचंद्रशेखरमहाराज देगलुरकर* को महाराष्ट्र सरकार का बहुत प्रतिष्ठित *"प्राचीन संस्कृत पंडित अवॉर्ड"* देने की घोषणा के लिए। श्रीक्षेत्र पंढरपुर में सद्गुरु का सम्मान और पूजा की गई।1
- తాళం వేసిన గదిలో విద్యార్థి.. హెచ్ఏం సస్పెన్షన్, స్కావేంజర్ తొలగింపు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి స్టూడెంట్ పాఠశాల సమయం ముగిసిన తర్వాత తరగతి గదిలోనే ఉండిపోగా ఈ విషయాన్ని సిబ్బంది గమనించకుండా గదికి తాళం వేసిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల భద్రత, విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్కూల్ హెచ్.ఎం. డి. స్వప్నను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన స్కావెంజర్ ను విధుల నుంచి తొలగిస్తూ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.1
- जुक्कल में कांग्रेस! राहुल गांधी की गिरफ्तारी के विरोध में एनएच-161 जुक्कल चौराहे पर विशाल धरना प्रदर्शन किया गया.1
- చెరువు కట్టపై యుద్ధ ప్రాతిపదికన మరమత్తు పనులు( వీడియో) మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండ గ్రామంలో బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి, గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం చెరువు కట్టపై మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. చెరువు కట్టపై మొలచిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. బతుకమ్మలను మహిళలు చెరువులో వేసుకునే విధంగా గాట్లను శుభ్రపరచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు1
- క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి 2030 నాటికి టీబీ రహిత భారత్ సాధనే లక్ష్యం-జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ క్షయ వ్యాధి నిర్మూలనకు అందరం సమిష్టిగా కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అన్నారు. గురువారo సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో టి.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ ..2030 నాటికి దేశంలో టి.బి. (క్షయవ్యాధి)ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి. ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా వార్డు, మండల స్థాయిలో జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటికే 13 టి.బి. ముక్త్ గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగిందని తెలిపారు. టి.బి. వ్యాధి బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా ఇతరులకు సోకే అవకాశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళల్లో జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా షుగర్, బి.పి. ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేసి, అనుమానితులు పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 215 యాక్టివ్ టి.బి. కేసులు ఉన్నాయని, టి బి. రోగులకు ప్రతి నెలా వైద్య సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా క్షయ వ్యాధి రోగులకు పోషకాహారం కోసం నిక్షయ్ పోషణ యోజన క్రింద నెలకు 1 వేయి రూపాయలు పోషణ భత్యం పూర్తి చికిత్స కాలం అందించడం జరుగుతుందని తెలిపారు. నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా క్షయ రోగులను దత్తత తీసుకుని వారికి అవసరమైన పోషకాహారాన్ని అందించాలని, క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా వైద్యుల సూచన మేరకు నిర్దేశిత కాలం పాటు మందులను క్రమం తప్పకుండా వినియోగించాలని సూచించారు. టి.బి. రోగులను దూరం పెట్టకుండా వారికి మానసిక ధైర్యం కల్పించాలని, వ్యాధి నియంత్రణకు పాటించవలసిన జాగ్రత్తలు, నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు ఒక టి.బి. రోగిని దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా టి.బి. ముక్త్ భారత్ అభియాన్ ద్వారా జోష్ టీమ్‌లను ఏర్పాటు చేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచులు, పంచాయతీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు సమన్వయంతో పని చేసి టి.బి. నిర్మూలనకు కృషి చేయాలని, రోగులను దూరంగా ఉంచకుండా వారికి అవసరమైన సహకారం, మానసిక ధైర్యం అందించాలని సూచించారు. టి.బి. నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు మీడియా సహకారం తీసుకోవాలని తెలిపారు. టిబి నివారణ సంబంధించిన సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-6666 ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం టి.బి. ముక్త్ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసి, టి.బి. నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎన్.సి.సి., మై భారత్ క్యాడెట్లు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.1
- కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు, INDIA కూటమి ఎంపీల అక్రమ అరెస్టును ఖండిస్తూ.2