logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో రెండో రోజు వైభవంగా హోళీ సంబురాలు...రంగులతో ఆడిపాడిన జనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు వైభవంగా హోళీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.‌ నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి.

6 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
6 hrs ago

కరీంనగర్ లో రెండో రోజు వైభవంగా హోళీ సంబురాలు...రంగులతో ఆడిపాడిన జనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు వైభవంగా హోళీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష

వయోభేదం లేకుండా జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్

సత్తు మల్లేశం అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.‌ నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా

లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి.

More news from తెలంగాణ and nearby areas
  • Post by వేణు విలేకరి
    1
    Post by వేణు విలేకరి
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా  హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు.  చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • హైదరాబాదు నుండి కలకత్తా కు వెళ్లవలసిన ట్రైన్ లో పింకీ సహా అనే మహిళకి తీవ్ర కడుపునొప్పి తో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంవల్ల 108 కాల్ చేయగానే తక్షణమే బయలుదేరి బాధితురాలని ఆంబులెన్స్ లోకి తీసుకొని ఫ్రీ హాస్పిటల్ కేర్ లో భాగంగా హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ఆర్ సి పి డాక్టర్ మౌనిక మేడం సూచనల మేరకు MGM హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది టిఎంటి చైతన్య పైలట్ కుమారస్వామి కాజీపేట అంబులెన్స్
    8
    హైదరాబాదు నుండి కలకత్తా కు వెళ్లవలసిన ట్రైన్ లో పింకీ సహా అనే  మహిళకి తీవ్ర కడుపునొప్పి తో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంవల్ల 108 కాల్ చేయగానే తక్షణమే బయలుదేరి బాధితురాలని ఆంబులెన్స్ లోకి తీసుకొని ఫ్రీ హాస్పిటల్ కేర్ లో భాగంగా హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ఆర్ సి పి డాక్టర్ మౌనిక మేడం సూచనల మేరకు MGM హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది టిఎంటి చైతన్య పైలట్ కుమారస్వామి కాజీపేట అంబులెన్స్
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల : దేశంలో జాతీయ స్థాయిలో చేపట్టబోతున్న జనగణనలో కుల గణన చేపట్ట కలిగినచో కులాలవారీగా నిర్దిష్ట జనాభా లెక్కలతో జనాభాను పరిగణలోకి తీసుకొంటు రిజర్వేషన్ల  కల్పనతోబాటు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు, తగు ప్రణాళిక చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన స్వగృహం ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేక రాస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... భారతదేశ జనాభా లెక్కలు తేల్చేందుకు కేంద్ర గణాంక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుండి చేపట్టబోతున్న జనగణనతో పాటు కుల గణన కూడ చేపట్టబోతున్నామని, గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనగణనలో కుల గణన సైతం చేపట్టి కులాలవారీగా జనాభాను గుర్తించి విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యతను ఇచ్చే విధంగా Reservotionల కల్పనతోపాటు, నిధులు కేటాయింపులో కూడా కుల వృత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు. ఇప్పట్టివరకు భారతదేశంలో Reservation లు జాతీయ స్థాయిలో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%,ఓబీసీ-27%, ఈడబ్ల్యూఎస్ -10% , 2-15%, 2-10%,໖໓-25%, BC's in Muslim Reservation 4%, ఈడబ్ల్యూఎస్-10% అమలు చేస్తున్నప్పటికి బీసీల జనాభాను పరిగణకు తీసుకొంటు, విద్యా, ఉద్యోగాలతోపాటు, స్థానిక సంస్థలలో 42% Reservation రాష్ట్రంలో అమలు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో 42% Reservation ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏకగ్రీవంగా తీర్మాణం చేసినప్పటికి కూడ న్యాయస్థానంలో 50% ఆంక్షలతో Reservation అమలు నోచుకోకపోవటంతో బీసీలు ఆశించిన మేరకు Reservation ల ఫలాలు పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. జనగణనతోపాటు కుల గణన చేపట్టడంతో భారత దేశంలో కులాలవారీగా బీసీల స్థితిగతులు, వారి జనాభా నిర్ధిష్టమైన లెక్కలు తేలడంతో సాంకేతికంగా, చట్టబద్దంగా వారి సమాజానికి Reservation లు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధుల కేటాయింపుతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకు కూడ దోహదపడుతుందని చెప్పకతప్పదు. వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, వారి జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకొంటు Reservation విద్యా, ఉద్యోగాల్లో Reservationల కల్పనతోపాటుగా, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధులు కేటాయింపు చేయాలని తీర్మాణాలు చేస్తున్నప్పటికి, Reservationలపై ఆంక్షలతో అచరణలోకి రాకపోవటంతో BCలు ఆశించిన మేరకు ప్రయోజనం పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. భారతదేశంలో జనగణనతోపాటు కుల గణన చేపట్టి, OBCల జనాభా ప్రాతిపదికన చట్టబద్దంగా Reservation లు అమలు చేయటంతోపాటు, ఆయా కులాల కులవృత్తులను ప్రోత్సహించేందుకు, విద్యా ఉద్యోగాలతో పాటు ఉపాధి, రాజకీయ రంగాల్లోసైతం OBCలకు Reservation లు కల్పించాలని భావిస్తున్న నేపథ్యంలో 2026 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 30 వరకు జాతీయ స్ధాయిలో చేపట్టబోయే జనగణనలో కుల గణనను కూడ చేర్చి, అమలు చేయబడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే శాసన సభసమావేశాల్లో తీర్మాణంతో, కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు చేపట్టగలరని మనవి అంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జీవన్ రెడ్డి లేఖ రాశారు.
    1
    జగిత్యాల :
దేశంలో జాతీయ స్థాయిలో చేపట్టబోతున్న జనగణనలో కుల గణన చేపట్ట కలిగినచో కులాలవారీగా నిర్దిష్ట జనాభా లెక్కలతో జనాభాను పరిగణలోకి తీసుకొంటు రిజర్వేషన్ల  కల్పనతోబాటు, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేందుకు, తగు ప్రణాళిక చేపట్టాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన స్వగృహం ఇందిరాభవన్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేక రాస్తున్నానని ఆయన వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...
భారతదేశ జనాభా లెక్కలు తేల్చేందుకు కేంద్ర గణాంక సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుండి చేపట్టబోతున్న జనగణనతో పాటు కుల గణన కూడ చేపట్టబోతున్నామని, గతంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనగణనలో కుల గణన సైతం చేపట్టి కులాలవారీగా జనాభాను గుర్తించి విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యతను ఇచ్చే విధంగా Reservotionల కల్పనతోపాటు, నిధులు కేటాయింపులో కూడా కుల వృత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని చెప్పకతప్పదు.
ఇప్పట్టివరకు భారతదేశంలో Reservation లు జాతీయ స్థాయిలో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%,ఓబీసీ-27%, ఈడబ్ల్యూఎస్ -10% , 2-15%, 2-10%,໖໓-25%, BC's in Muslim Reservation 4%, ఈడబ్ల్యూఎస్-10% అమలు చేస్తున్నప్పటికి బీసీల జనాభాను పరిగణకు తీసుకొంటు, విద్యా, ఉద్యోగాలతోపాటు, స్థానిక సంస్థలలో 42% Reservation రాష్ట్రంలో అమలు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో 42% Reservation ల పెంపుకోసం రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఏకగ్రీవంగా తీర్మాణం చేసినప్పటికి కూడ న్యాయస్థానంలో 50% ఆంక్షలతో Reservation అమలు నోచుకోకపోవటంతో బీసీలు ఆశించిన మేరకు Reservation ల ఫలాలు పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు. జనగణనతోపాటు కుల గణన చేపట్టడంతో భారత దేశంలో కులాలవారీగా బీసీల స్థితిగతులు, వారి జనాభా నిర్ధిష్టమైన లెక్కలు తేలడంతో సాంకేతికంగా, చట్టబద్దంగా వారి సమాజానికి Reservation లు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధుల కేటాయింపుతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసేందుకు కూడ దోహదపడుతుందని చెప్పకతప్పదు.
వివిధ రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని, వారి జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకొంటు Reservation విద్యా, ఉద్యోగాల్లో Reservationల కల్పనతోపాటుగా, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తగిన నిధులు కేటాయింపు చేయాలని తీర్మాణాలు చేస్తున్నప్పటికి, Reservationలపై ఆంక్షలతో అచరణలోకి రాకపోవటంతో BCలు ఆశించిన మేరకు ప్రయోజనం పొందలేకపోతున్నారని చెప్పకతప్పదు.
భారతదేశంలో జనగణనతోపాటు కుల గణన చేపట్టి, OBCల జనాభా ప్రాతిపదికన చట్టబద్దంగా Reservation లు అమలు చేయటంతోపాటు, ఆయా కులాల కులవృత్తులను ప్రోత్సహించేందుకు, విద్యా ఉద్యోగాలతో పాటు ఉపాధి, రాజకీయ రంగాల్లోసైతం OBCలకు Reservation లు కల్పించాలని భావిస్తున్న నేపథ్యంలో 2026 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 30 వరకు జాతీయ స్ధాయిలో చేపట్టబోయే జనగణనలో కుల గణనను కూడ చేర్చి, అమలు చేయబడే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే శాసన సభసమావేశాల్లో తీర్మాణంతో, కేంద్ర ప్రభుత్వానికి నివేదించి తగు చర్యలు చేపట్టగలరని మనవి అంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జీవన్ రెడ్డి లేఖ రాశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    20 min ago
  • వరంగల్ గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో రాజకీయ ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన డాన్స్ గ్రూపులు జాతర ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతుల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    1
    వరంగల్ గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో రాజకీయ ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన డాన్స్ గ్రూపులు జాతర ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతుల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి  హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది కూలీలకు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఉదయం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం 21 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వారందరూ తలో దిక్కున పరుగులు తీశారని బాధితులు తెలిపారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది కూలీలకు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఉదయం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం 21 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వారందరూ తలో దిక్కున పరుగులు తీశారని బాధితులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • Post by వేణు విలేకరి
    1
    Post by వేణు విలేకరి
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • చంద్ర గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి, అనుబంధ ఆలయాలు నిన్న ఉదయం ఏడు గంటలకు అర్చకులు మూసివేశారు.ఆలయంలో స్వామి వారికి మహానువేదన మంగళ నీరాజనం భజన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు చేసి ద్వార బంధనం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, శుద్ధి పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు, అర్జిత సేవలు యథావిధిగా కొనసాగించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు
    2
    చంద్ర గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి, అనుబంధ ఆలయాలు నిన్న ఉదయం ఏడు గంటలకు అర్చకులు మూసివేశారు.ఆలయంలో స్వామి వారికి మహానువేదన మంగళ నీరాజనం భజన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు చేసి ద్వార బంధనం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, శుద్ధి పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు, అర్జిత సేవలు యథావిధిగా కొనసాగించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.