Shuru
Apke Nagar Ki App…
ఓటరు సవరణ ప్రక్రియపై దృష్టి.. ఎస్‌ఐఆర్ క్యాంపును పరిశీలించిన సాజిద్‌ఖాన్ ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి క్యాంపును నిర్వహించారు. వార్డు నంబర్ 16, 17 పరిధిలోని బూత్ నంబర్ 220, 221ల్లో నిర్వహించిన ఈ క్యాంపులో బీఎల్‌ఓలు పాల్గొని ఓటరు వివరాల పరిశీలన, సవరణ ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌ఓలతో వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
AlluriMahesh
ఓటరు సవరణ ప్రక్రియపై దృష్టి.. ఎస్‌ఐఆర్ క్యాంపును పరిశీలించిన సాజిద్‌ఖాన్ ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి క్యాంపును నిర్వహించారు. వార్డు నంబర్ 16, 17 పరిధిలోని బూత్ నంబర్ 220, 221ల్లో నిర్వహించిన ఈ క్యాంపులో బీఎల్‌ఓలు పాల్గొని ఓటరు వివరాల పరిశీలన, సవరణ ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌ఓలతో వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- *భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.* *తర్నం జాతీయ రహదారి-353Bతో పాటు ఐదు మండలాల్లో పర్యటించి పరిస్థితులపై సమీక్ష.* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా జూలై 30 :- *ప్రజల ప్రాణ భద్రతే ప్రథమ ప్రాధాన్యత – అవసరమైతేనే బయటకు రావాలని సూచన.* *కల్వర్టులు, బ్రిడ్జిలపై నీరు ప్రవహిస్తే ప్రజలను దాటనీయకుండా పోలీసు, గ్రామపంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు.* *కుంటాల జలపాతం వద్ద పరిస్థితి పరిశీలన* *జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతలో... 24/7 డిడిఆర్ఎఫ్ (DDRF) బృందం అందుబాటులో.* ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. జైనథ్ మండలం తర్నం గ్రామం సమీపంలోని నేషనల్ హైవే-353B, తలమడుగు మండలం సుంకిడి, మత్తడి వాగు ప్రాజెక్టు, ఇచ్చోడ మండలం గేర్జం, నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతంతో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జైనథ్ మండలం తర్నం గ్రామం వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరడంతో నిలిచిపోయిన వాహనాల పరిస్థితిని పరిశీలించిన జిల్లా ఎస్పీ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాలను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైతే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని వాగులు, వంకలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు, లోతట్టు ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగించాలని, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్ర వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. నూతన అత్యాధునిక పరికరాలతో కూడిన డిడిఆర్ఎఫ్ (DDRF) బృందం 24 గంటలూ అందుబాటులో ఉండి ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని, కల్వర్టులు, బ్రిడ్జిలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. యువత అత్యుత్సాహంతో జలపాతాలు, వాగులు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లరాదన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో రైతులు విద్యుత్ మోటార్ల వద్ద, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్ల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద నిలవవద్దని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వాహనదారులు వర్షాల సమయంలో అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని, నీటి ప్రవాహం లేదా గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వేగాన్ని నియంత్రిస్తూ ప్రయాణించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్, ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్. రమేష్, ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్, ఎస్‌ఐ పి. గౌతమ్తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.2
- ఓటరు సవరణ ప్రక్రియపై దృష్టి.. ఎస్‌ఐఆర్ క్యాంపును పరిశీలించిన సాజిద్‌ఖాన్ ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి క్యాంపును నిర్వహించారు. వార్డు నంబర్ 16, 17 పరిధిలోని బూత్ నంబర్ 220, 221ల్లో నిర్వహించిన ఈ క్యాంపులో బీఎల్‌ఓలు పాల్గొని ఓటరు వివరాల పరిశీలన, సవరణ ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బీఎల్‌ఓలతో వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- భీమన్న, మత్తడి వాగు ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ భారీ వర్షాల నేపథ్యంలో తాంసి మండలం భీమన్న వాగు కల్వర్టును, మత్తడి వాగు ప్రాజెక్ట్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం పరిశీలించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అధికారులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు గణేష్, రాజ్ మోహన్, నీటిపారుదల శాఖ ఈఈ నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- భారీ వర్షాలకు నీట మునిగిన సోయాబీన్ పంట.. రైతుకు తీవ్ర నష్టం గుడిహత్నూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు హుల్గుండే జనార్ధన్కు చెందిన 5 ఎకరాల సోయాబీన్ పంట పూర్తిగా నీట మునిగింది. పొలంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన నేపథ్యంలో వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షాల కారణంగా పంటలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.1
- సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు. నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి 9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.2
- *శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా కొట్టె శేఖర్ ప్రమాణ స్వీకారం* నిర్మల్ పట్టణంలోని శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన కొట్టె శేఖర్ గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు నూతన చైర్మన్ కొట్టె శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఆలయ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతూ, ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి ఆలయ అభివృద్ధికి సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేశారని, ఆయన సహకారాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్లాలని నూతనంగా నియమితులైన శేఖర్ కు శ్రీహరి రావు ఈ సందర్భంగా సూచించారు. కాగా చైర్మన్ తో పాటు ఆలయ డైరెక్టర్లుగా ఉప్పుల నందు, నర్సయ్య లు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- 2026_ఆదిలాబాదు: *పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: జిల్లా కలెక్టర్ రాజర్షిషా పత్రికా ప్రకటన జూలై 30, * ప్రభుత్వ సంక్షేమ, పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యంత పారదర్శకంగా, లాటరీ పద్ధతి ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన గిరిజన మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించస్తామన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మంజూరైన లబ్ధిదారులు వారి వినియోగంతో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు, ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల తీవ్రతను గమనిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. రీల్స్, చేపల వేట కోసమని సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అపారమైన నీటి ప్రవాహాలు ఉన్న చోట అజాగ్రత్తగా ఉంటే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశముందని గుర్తుచేశారు. ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా రీల్స్, ఫొటోలు, సరదాల కోసం ప్రమాదకర స్థాయిలో నిండిన చెరువులు, పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ లక్కీ డ్రా లో జిల్లా మత్స్య శాఖ అధికారి సాంబశివ రావు, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఎల్డియం ఉత్పల్ కుమార్, మత్స్య సంఘాల నాయకులు, మత్స్యకారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- భీంపూర్ మండలంలోని ధనోరా వాగు లో-లెవల్ వత్తేనపై నుండి వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆవు భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ధనోరా వాగు ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీటి వల్ల స్థానిక లో-లెవెల్ వంతెన పూర్తిగా మునిగిపోయింది. దీంతో వంతెనకు ఇరువైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వంతెన దాటడానికి ప్రయత్నించిన ఒక ఆవు, నీటి ప్రవాహ వేగానికి తట్టుకోలేక వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని సమీక్షించారు. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలెవరూ వంతెన దాటే సాహసం చేయవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.1