Shuru
Apke Nagar Ki App…
ప్రియ స్నేహితుడా ప్రభు ఏసుక్రీస్తు నామమున శుభములు సన్నిధి సమాధానం తోడైయుండును గాక
T. Raja simha
ప్రియ స్నేహితుడా ప్రభు ఏసుక్రీస్తు నామమున శుభములు సన్నిధి సమాధానం తోడైయుండును గాక
More news from తెలంగాణ and nearby areas
- సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లపై వరంగల్ సిపి శ్వేతతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ హనుమకొండ జిల్లా పరకాలలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం పరకాలలో సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపాదిత హెలిప్యాడ్, సభా వేదిక, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ప్రతిపాదిత హెలిప్యాడ్ కోసం లలితా కన్వెన్షన్ హాల్ సమీపంలోని స్థలాన్ని, సభా వేదిక, వాహనాల పార్కింగ్ కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంగడి స్థలాలను పరిశీలించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాల రాకపోకలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, సీఎం పర్యటనలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ నుంచి సీఎం ప్రయాణించే మార్గం, ఆసుపత్రి ప్రారంభోత్సవం, సభా వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, రహదారులు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ, సీఎం భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ హెలిప్యాడ్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన భద్రతా ప్రణాళిక అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.అనంతరం సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ ప్రణాళికపై కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్ బాబు, ఈఈ దేవిక, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్ కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, పరకాల మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పవన్, ఏసీపీ సతీష్ బాబు, పరకాల సీఐ క్రాంతి కుమార్, కౌన్సిలర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలకు వేములవాడ దేవాలయంలో విస్తృత ఏర్పాట్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాస ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణమాస ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం నాలుగు సోమవారాలు ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే మూడవ సోమవారం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే ఐదవ శుక్రవారంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చేనెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణమాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్ర హోమం ఉంటుందని వివరించారు.2
- తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.2
- కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.2
- మావోయిస్టు ప్రభావం నుంచి పర్యాటక ప్రాంతంగా కరిగుట్ట.. డీజీపీ కీలక ప్రకటన ములుగు జిల్లా కరిగుట్టలో శాంతి వాతావరణం నెలకొంటోంది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కరిగుట్టలో పర్యటించి రోడ్డు పనులను పరిశీలించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా తెల్ల పావురాలను విడుదల చేశారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణ పోలీస్, గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఛత్తీస్‌గఢ్ పోలీసుల సమన్వయాన్ని డీజీపీ ప్రశంసించారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కరిగుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రోడ్లు, విద్యుత్, మొబైల్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పామూరు–చలమాదవ రహదారి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.1
- ప్రియ స్నేహితుడా ప్రభు ఏసుక్రీస్తు నామమున శుభములు సన్నిధి సమాధానం తోడైయుండును గాక1