Shuru
Apke Nagar Ki App…
కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు,చిన్నారులు కోలాటలు ఓడి చెఱువు మండలం లో నందివారి పల్లి గ్రామసమీపం లో శ్రావణ మాసంలో చివరి శనివారం నాడు కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతర0వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వద్ద చిన్నారులు కోలాటలు పలువురని ఆకట్టుకున్నాయి.
మల్లెల రమేష్
కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు,చిన్నారులు కోలాటలు ఓడి చెఱువు మండలం లో నందివారి పల్లి గ్రామసమీపం లో శ్రావణ మాసంలో చివరి శనివారం నాడు కనుమ శ్రీ అంజినేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతర0వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వద్ద చిన్నారులు కోలాటలు పలువురని ఆకట్టుకున్నాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు1
- పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.1
- హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం. . హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.1
- నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.1
- వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.1
- పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.1
- వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1
- న్యామద్దెల గ్రామానికి చెందిన దాత కదిరోళ్ల నాగిరెడ్డి కంచు గుర్రం భైరవేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని భైరవేశ్వర స్వామి ఆలయ పూజారి పెద్దలకు అందజేశారు చెన్నేకొత్తపల్లి సెప్టెంబర్:: రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో వెలిసిన భైరవేశ్వర స్వామి ఆలయంకు న్యామద్దల గ్రామానికి చెందిన దాత కదిరోళ్ల నాగిరెడ్డి కాంశ్య గుర్రంపై భైరవ స్వామి, ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ పెద్దలకు అందజేశారు. ఆలయ పూజారి కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో మేడాపురంలో ఘనంగా ఊరేగింపు చేశారు మేడాపురంలోని బైరవ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో ఉంచారు. అక్కడ 41 రోజులు పూజలు గావించి అనంతరం న్యామద్దల గ్రామం చివర్లలోని పంట పొలాలలో వెలసిన భైరవ స్వామి ఆలయంలో ఏర్పాటు చేస్తారు పర్వదినాల సందర్భంగా ఈ ఉత్సవ విగ్రహాన్ని న్యామద్దల గ్రామంలో ఊరేగింపు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి, కమిటీ పెద్దలు తెలిపారు1