logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోలీసులను తప్పించుకుంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పరుగు.. సోషల్ మీడియాలో వైరల్ డీఎస్సీ అవకతవకలపై వైసీపీతో బహిరంగ చర్చకు సిద్ధమైన ఆదోని కూటమి ఎమ్మెల్యే ను శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన పోలీసులను తప్పించుకుంటూ రోడ్డుపై పరుగు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య మాల్లో వైరల్గా మారాయి. కేవలం పబ్లిసిటీ, ఫేమస్ కోసమే ఎమ్మెల్యే ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు

23 hrs ago
user_LOHITH
LOHITH
ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
23 hrs ago

పోలీసులను తప్పించుకుంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పరుగు.. సోషల్ మీడియాలో వైరల్ డీఎస్సీ అవకతవకలపై వైసీపీతో బహిరంగ చర్చకు సిద్ధమైన ఆదోని కూటమి ఎమ్మెల్యే ను శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆయన పోలీసులను తప్పించుకుంటూ రోడ్డుపై పరుగు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య మాల్లో వైరల్గా మారాయి. కేవలం పబ్లిసిటీ, ఫేమస్ కోసమే ఎమ్మెల్యే ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు

More news from Kurnool and nearby areas
  • కోడుమూరు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ భరో.. *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ బరో* కోడుమూరు : ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్షాల నాయకులు రాజు, శేషుకుమార్, గఫుర్ మియ్యా, మోహన్ లు మాట్లాడుతూ గత నెలలో విద్యార్ధి, యువత చేపట్టిన ఉద్యమం మోదీ ప్రభుత్వానికి చెమటలు పట్టించ్చిందాన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత తో మోదీ ప్రభుత్వం చేస్తోన్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలన్నారు. అమెరికతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దుచెయ్యాలని, 4 లేబర్ కొడ్లను,విబి జిరాంజీ చట్టాలను రద్దుచెయ్యాలని, అసంగటిత కార్మికులందరికి రు 31/వేలు వేతనం ఇవ్వాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దూల్ల భాస్కర్, బుగిడే మాధవస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు కిషోర్, రాము, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాముడు, జి, రామాంజనేయులు, తిమ్మప్ప, ఢిల్లీ వెంకటేశ్వర్లు,బోయ రామాంజనేయులు, ఆటో యూనియన్ నాయకులు మధు, కాటన్న గారి రామకృష్ణ, హమాలీసంగం నాయకులు వెంకటస్వామి, బజారి, అనిల్, మధు, మణి, మహిళా సంఘం నాయకులు సులోచనమ్మ సీపీయం నాయకులు కామర్తి రాజు, ఈరన్న, లక్ష్మన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    కోడుమూరు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ భరో..
*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా జైల్ బరో* కోడుమూరు : ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా సోమవారం వామపక్షాల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వామపక్షాల నాయకులు రాజు, శేషుకుమార్, గఫుర్ మియ్యా, మోహన్ లు మాట్లాడుతూ గత నెలలో విద్యార్ధి, యువత చేపట్టిన ఉద్యమం మోదీ ప్రభుత్వానికి చెమటలు పట్టించ్చిందాన్నారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యత తో మోదీ ప్రభుత్వం చేస్తోన్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలన్నారు. అమెరికతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దుచెయ్యాలని, 4 లేబర్ కొడ్లను,విబి జిరాంజీ చట్టాలను రద్దుచెయ్యాలని, అసంగటిత కార్మికులందరికి రు 31/వేలు వేతనం ఇవ్వాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దూల్ల భాస్కర్, బుగిడే మాధవస్వామి, ఏఐవైఎఫ్ నాయకులు కిషోర్, రాము, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాముడు, జి, రామాంజనేయులు, తిమ్మప్ప, ఢిల్లీ వెంకటేశ్వర్లు,బోయ రామాంజనేయులు, ఆటో యూనియన్ నాయకులు మధు, కాటన్న గారి రామకృష్ణ, హమాలీసంగం నాయకులు వెంకటస్వామి, బజారి, అనిల్, మధు, మణి, మహిళా సంఘం నాయకులు సులోచనమ్మ సీపీయం నాయకులు కామర్తి రాజు, ఈరన్న, లక్ష్మన్న, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Ex AISF veera
    Ex AISF veera
    Kodumur, Kurnool•
    3 hrs ago
  • * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._* విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..
    1
    * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._*

విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    1
    ప్రజలు ఇక్కట్లు..  అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..!
బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చాలి సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు.. దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్ ను కనెక్టివిటీ చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. కోడుమూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కై సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారిన ప్రజా సమస్యలు తీరడం లేదని నేటికీ కోడుమూరు పట్టణంలో పదిరోజులకు ఒకసారి త్రాగునీరు కుళాయిల ద్వారా వదులుతున్నారని త్రాగునీటి కొరత తో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పట్టణంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై నడవడానికి కూడా రావడంలేదని ఆయన అన్నారు. కోడుమూరు మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించలేదని తక్షణమే మార్కెట్ యార్డ్ ను ప్రారంభించి ఈ సంవత్సరం నుంచే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక కోడుమూరు చుట్టుపక్కల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల ఆశ్రయించాల్సి వస్తున్నదని ముఖ్యంగా బాలికలకు కర్నూలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందిగా మారి మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుందని వెనుకబడినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే సి. బెళగల్ మండలంలో గుండ్రేవుల దగ్గర గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కోడుమూరు పట్టణంలో పాతబడిన గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా జూనియర్ సివిల్ కోర్టు మరియు ట్రెజరీ లను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పై సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు బి రాజు, శేషు కుమార్, సిపిఐ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మండల కార్యదర్శి అల్తాఫ్ నాయకులు మునిస్వామి ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి, గొల్లరంగడు మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు,మహేష్ సురేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.
    1
    కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర
కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర 
పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చాలి
సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి 
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు..
దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్ ను కనెక్టివిటీ చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు.
కోడుమూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కై సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పాలకులు మారిన ప్రజా సమస్యలు తీరడం లేదని నేటికీ కోడుమూరు పట్టణంలో పదిరోజులకు ఒకసారి త్రాగునీరు కుళాయిల ద్వారా వదులుతున్నారని త్రాగునీటి కొరత తో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
పట్టణంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై నడవడానికి కూడా రావడంలేదని ఆయన అన్నారు.
కోడుమూరు మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించలేదని తక్షణమే మార్కెట్ యార్డ్ ను ప్రారంభించి ఈ సంవత్సరం నుంచే 
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక కోడుమూరు చుట్టుపక్కల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల ఆశ్రయించాల్సి వస్తున్నదని ముఖ్యంగా బాలికలకు కర్నూలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందిగా మారి మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుందని వెనుకబడినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే సి. బెళగల్ మండలంలో గుండ్రేవుల దగ్గర గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కోడుమూరు పట్టణంలో పాతబడిన గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా జూనియర్ సివిల్ కోర్టు మరియు ట్రెజరీ లను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
పై సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి 
సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు బి రాజు, శేషు కుమార్, సిపిఐ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మండల కార్యదర్శి అల్తాఫ్ నాయకులు మునిస్వామి 
ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్ కుమార్ 
వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి, గొల్లరంగడు
మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు,మహేష్ 
సురేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.
    user_Ex AISF veera
    Ex AISF veera
    Kodumur, Kurnool•
    13 hrs ago
  • గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు 
మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • గిరిజనుల సంక్షేమం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, గృహ వసతి, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు గిరిజన యువత ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధితో స్వయం సాధికారత సాధించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల, ఆగస్టు 09: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 46 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయం, కొత్త ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పాత పాఠశాల భవనాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయుల జీవితాలను తెలుసుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఆటలు, పాటలు, పుస్తక పఠనం, లైఫ్‌ స్కిల్స్‌ వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జిల్లాలోని 9 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, డెప్యుటేషన్ల రద్దు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాలల వారీగా గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అన్ని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రాధాన్యత ఇచ్చామని, అనేక చోట్ల పనులు పూర్తయ్యాయని లేదా తుది దశలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల వైపు దృష్టి మళ్లించకుండా విద్య, ఉద్యోగం, స్వయం సాధికారతపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటికి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరం కలిగిన వరి వంటి పంటల సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సుమారు 40 గ్రామాలను గుర్తించి, నీటి ఎద్దడి నివారణ పనులకు ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్.కె. తండా, సుగాలి మెట్ట తదితర ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన భవన్‌కు స్థల పరిశీలన జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలన్న గిరిజన సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నంద్యాల పట్టణ పరిధిలో ప్రభుత్వ భూమి లభ్యత పరిమితంగా ఉండటం, అందుబాటులో ఉన్న కొన్ని భూములు నీటి వనరులకు సంబంధించినవి కావడంతో న్యాయస్థానాల మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉందని తెలిపారు. అందువల్ల నంద్యాల రూరల్, పాణ్యం రూరల్, మహానంది తదితర పట్టణానికి సమీప ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించి గిరిజన భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైలంలోని మూసివేసిన ఎస్టీ హాస్టల్ భవనాన్ని స్వయంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి నిబంధనల మేరకు తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు గిరిజన మహిళలు తయారు చేసే వెదురు బుట్టలు, ఆభరణాలు, ఆకులతో తయారు చేసే విస్తరాకులు, కప్పులు, తేనె తదితర ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద వెదురుతో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించి నేరుగా విక్రయించడంతో పాటు బల్క్‌ ఆర్డర్లు పొందేలా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. చెంచు, పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రోత్సాహం ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగల (PVTG) కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మెరుగైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద బైర్లూటీ, పాణ్యం కాలనీ, శ్రీశైలం మేకలబండ తదితర ప్రాంతాల్లో సుమారు 570 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందుతుందని, మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు రీ-సర్వే, డాటెడ్ ల్యాండ్స్‌, 22-ఏ తదితర భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ప్రతి చిన్న సమస్య కోసం జిల్లా స్థాయి అధికారుల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆర్‌డీఓ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ROFR పట్టాలు, పాస్‌బుక్‌లకు సంబంధించి వారసులకు ఎదురవుతున్న సమస్యలను ఐటీడీఏ ద్వారా పరిష్కరించి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెంచు లక్ష్మిగూడెం వద్ద మిగిలిన 17 ఎకరాల భూమికి ROFR పట్టాలు, బోర్లు మంజూరు చేసి ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందించినట్లు వివరించారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అటవీ సంరక్షణకు సంబంధించిన నిబంధనలను ప్రజలు, అధికారులు సమష్టిగా పాటించాలని సూచించారు. చెంచు, ఇతర గిరిజన కుటుంబాలకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయం, మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్‌ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్మశాన వాటికలకు స్థల సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, హిల్‌ పొరంబోకు భూములను పరిశీలించి అవసరమైన చోట్ల స్థానిక సంస్థలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో వాగులు దాటాల్సి వస్తున్న ప్రాంతాల్లో అవసరమైన వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్ వెల్ఫేర్ డిడి, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    గిరిజనుల సంక్షేమం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత
గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, గృహ వసతి, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్యలు
గిరిజన యువత ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధితో స్వయం సాధికారత సాధించాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, ఆగస్టు 09: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజనుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా 46 గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేయడంతో పాటు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనుల విజ్ఞప్తి మేరకు అమ్మవారి ఆలయం, కొత్త ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పాత పాఠశాల భవనాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అందించే పథకాలు, సేవలు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత
గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలను చదవడమే కాకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, కొమరం భీమ్, బిర్సా ముండా వంటి మహనీయుల జీవితాలను తెలుసుకుని వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. ఆటలు, పాటలు, పుస్తక పఠనం, లైఫ్‌ స్కిల్స్‌ వంటి పాఠ్యేతర కార్యకలాపాల్లోనూ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, తద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
జిల్లాలోని 9 ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, డెప్యుటేషన్ల రద్దు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తరగతి గదులు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాఠశాలల వారీగా గుర్తించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. అన్ని ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు గతంలోనే ప్రాధాన్యత ఇచ్చామని, అనేక చోట్ల పనులు పూర్తయ్యాయని లేదా తుది దశలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని, బాల్య వివాహాల వైపు దృష్టి మళ్లించకుండా విద్య, ఉద్యోగం, స్వయం సాధికారతపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రతరం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటికి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీటి అవసరం కలిగిన వరి వంటి పంటల సాగుకు దూరంగా ఉండాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సుమారు 40 గ్రామాలను గుర్తించి, నీటి ఎద్దడి నివారణ పనులకు ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎల్.కె. తండా, సుగాలి మెట్ట తదితర ప్రాంతాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
గిరిజన భవన్‌కు స్థల పరిశీలన
జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలన్న గిరిజన సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నంద్యాల పట్టణ పరిధిలో ప్రభుత్వ భూమి లభ్యత పరిమితంగా ఉండటం, అందుబాటులో ఉన్న కొన్ని భూములు నీటి వనరులకు సంబంధించినవి కావడంతో న్యాయస్థానాల మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉందని తెలిపారు. అందువల్ల నంద్యాల రూరల్, పాణ్యం రూరల్, మహానంది తదితర పట్టణానికి సమీప ప్రాంతాల్లో అనువైన స్థలాన్ని పరిశీలించి గిరిజన భవన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. శ్రీశైలంలోని మూసివేసిన ఎస్టీ హాస్టల్ భవనాన్ని స్వయంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టి నిబంధనల మేరకు తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు
గిరిజన మహిళలు తయారు చేసే వెదురు బుట్టలు, ఆభరణాలు, ఆకులతో తయారు చేసే విస్తరాకులు, కప్పులు, తేనె తదితర ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ వద్ద వెదురుతో ప్రత్యేకంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, గిరిజన మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించి నేరుగా విక్రయించడంతో పాటు బల్క్‌ ఆర్డర్లు పొందేలా అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
చెంచు, పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రోత్సాహం
ప్రత్యేకంగా బలహీన గిరిజన తెగల (PVTG) కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మెరుగైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. పీఎం జన్మన్ పథకం కింద బైర్లూటీ, పాణ్యం కాలనీ, శ్రీశైలం మేకలబండ తదితర ప్రాంతాల్లో సుమారు 570 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన పీవీటీజీ కుటుంబాలకు గృహ నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆర్థిక సహాయం అందుతుందని, మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా అధికారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
రీ-సర్వే, డాటెడ్ ల్యాండ్స్‌, 22-ఏ తదితర భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ప్రతి చిన్న సమస్య కోసం జిల్లా స్థాయి అధికారుల వరకు రావాల్సిన అవసరం లేకుండా ఆర్‌డీఓ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ROFR పట్టాలు, పాస్‌బుక్‌లకు సంబంధించి వారసులకు ఎదురవుతున్న సమస్యలను ఐటీడీఏ ద్వారా పరిష్కరించి పట్టాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెంచు లక్ష్మిగూడెం వద్ద మిగిలిన 17 ఎకరాల భూమికి ROFR పట్టాలు, బోర్లు మంజూరు చేసి ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందించినట్లు వివరించారు.
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అటవీ సంరక్షణకు సంబంధించిన నిబంధనలను ప్రజలు, అధికారులు సమష్టిగా పాటించాలని సూచించారు. చెంచు, ఇతర గిరిజన కుటుంబాలకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, ఐటీడీఏ ద్వారా అవసరమైన సహాయం, మార్గదర్శకాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్‌ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో స్మశాన వాటికలకు స్థల సమస్యను పరిష్కరించేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి, హిల్‌ పొరంబోకు భూములను పరిశీలించి అవసరమైన చోట్ల స్థానిక సంస్థలకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్మశాన వాటికలకు వెళ్లే మార్గంలో వాగులు దాటాల్సి వస్తున్న ప్రాంతాల్లో అవసరమైన వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్ వెల్ఫేర్ డిడి, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు
మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    35 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.