Shuru
Apke Nagar Ki App…
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే పై సీఎం రేవంత్ తీవ్ర అగ్రహం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారిని బెదిరిస్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Journalist Prem
మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే పై సీఎం రేవంత్ తీవ్ర అగ్రహం మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారిని బెదిరిస్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
More news from తెలంగాణ and nearby areas
- మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.1
- #BreakingNews: తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. మిర్యాలగూడ వేదికగా రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అర్హులైన రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తామని ప్రకటించారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JTV9!1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జగదేవపూర్ వెళ్ళే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ,మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్,స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మానం చేయడం అభినందనీయమని అన్నారు, అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచికమని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్కుమార స్వామి, రాం పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్,సంతోష్,నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ,సుజాత,స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.2
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కుత్బుల్లాపూర్ ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు ఆయన వెల్లడించారు.చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన సుశీలమ్మ (85) అనే వృద్ధురాలి హత్య కేసులో కీలక నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీలమ్మ ఇంట్లో పని చేసే పని మనిషి కవిత (36) బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయాన్ని గమనించిన కవిత, ఆమె తలపై బండరాయితో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న కమ్మలు, ఉంగరం (రింగ్)తో పాటు సెల్‌ఫోన్‌ను కూడా తీసుకుని పరారైనట్లు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన దుండిగల్ పోలీసులు, ఎస్‌ఓటీ కుత్బుల్లాపూర్, సీసీఎస్ పోలీసులను ఏసీపీ శంకర్ రెడ్డి అభినందించారు.5
- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ – XII కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. 2026 జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి మొత్తం 38 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని, వారిలో 33 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు. వీరిలో 14 సంవత్సరాల లోపు 4 మంది, 14 సంవత్సరాల పైబడిన 34 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై మొత్తం 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.1
- మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అగ్రహారం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన వారిని బెదిరిస్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.1