Shuru
Apke Nagar Ki App…
తిరుచానూరు: శివ్ నాట్య కళానిలయం విద్యార్థులు పరమేశ్వరుని సన్నిధిలో భరతనాట్య నృత్య నివేదన చేసి ఆకట్టుకున్నారు. నృత్య గురువు సంధ్య ఆధ్వర్యంలో శాస్త్రీయంగా అభ్యసించిన అడుగులు, అభినయంతో భక్తి భావాన్ని ప్రతిబింబించారు. కార్యక్రమంలో తిరుణామలి రూపేష్ బాబు (శాలివాహన ట్రస్ట్ చైర్మన్) పాల్గొని అభినందించారు. భవిష్య రెడ్డి, భాను కార్తికేయ, చాతుర్య, నిక్షిత, వందిత, యక్షిత, రేణుశ్రీ, చైత్రిక, హిమవర్షిణి, ధన్విక, రుత్వికతో పాటు విజయ్ కుమార్, నాగరాజు రెడ్డి, భూపాల్ ఆచారి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
RAVI KUMAR
తిరుచానూరు: శివ్ నాట్య కళానిలయం విద్యార్థులు పరమేశ్వరుని సన్నిధిలో భరతనాట్య నృత్య నివేదన చేసి ఆకట్టుకున్నారు. నృత్య గురువు సంధ్య ఆధ్వర్యంలో శాస్త్రీయంగా అభ్యసించిన అడుగులు, అభినయంతో భక్తి భావాన్ని ప్రతిబింబించారు. కార్యక్రమంలో తిరుణామలి రూపేష్ బాబు (శాలివాహన ట్రస్ట్ చైర్మన్) పాల్గొని అభినందించారు. భవిష్య రెడ్డి, భాను కార్తికేయ, చాతుర్య, నిక్షిత, వందిత, యక్షిత, రేణుశ్రీ, చైత్రిక, హిమవర్షిణి, ధన్విక, రుత్వికతో పాటు విజయ్ కుమార్, నాగరాజు రెడ్డి, భూపాల్ ఆచారి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం - నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడును విజయవంతం చేయండి.. - త్వరలోనే కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలంలోని తాటాకుల దిన్నె గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా స్మశానానికి సరైన దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 5 లక్షల ఎంపీ లార్డ్స్ నిధులతో స్మశాన వాటికకు వెళ్లే రహదారిని నిర్మించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ మార్గాన్ని పూర్తిస్థాయి సిసి రోడ్డుగా మారుస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. స్మశానానికి దారి కోసం స్థలాన్ని కేటాయించిన స్థల దాత ఉయ్యాల దేశయ్యను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.గ్రామ పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేయిస్తామని గ్రామంలో అవసరమైన మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెబుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె కొనియాడారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.4
- Post by T. Raja simha1
- బద్వేలు :బద్వేలు పట్టణం ఎస్ కే డి నగర్ 2 నందు డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.. అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్ అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.1
- *పోలీసు అధికారిపై అత్యాచార యత్నం ఆరోపణలు: న్యాయం కోరుతున్న బాధితురాలు* చిలకలూరిపేట పట్టణంలో ధనలక్ష్మి అనే మహిళ మీడియాతో మాట్లాడారు వినుకొండ మండలం ధనలక్ష్మి అనే ఓ మహిళపై పోలీసు అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలు ధనలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, తాము బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నామని, ఆ ఇంటిని లీజుకు తీసుకుని ఐదు నెలలుగా అక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు. నిందితుడైన **సి.హెచ్. చిన్న మల్లయ్య అనే సి.ఐ గతంలో విధి నిర్వహణలో భాగంగా శని, ఆదివారాల్లో అక్కడే ఉండేవారని, ప్రస్తుతం సస్పెండ్ అయిన తర్వాత పూర్తిగా అక్కడే ఉంటున్నారని ఆమె తెలిపారు. ఒక రోజు ఉదయం తన భర్త పని మీద బయటకు వెళ్లిన సమయంలో, నిందితుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గదికి తాళం వేసి బలవంతం చేశారని, తాను ఎంత ప్రతిఘటించినా వదల్లేదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తన కొడుకు ద్వారా తనకు బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పోలీసు పదవిలో ఉండి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడం దారుణమని, తనకు న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మరియు అధికారులను వేడుకున్నారు.1
- ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు1
- ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.1
- Post by Bondhu Suresh1
- బద్వేలు, ఏప్రిల్ 30: బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం బద్వేలు కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు . స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు1
- కుప్పం మున్సిపాలిటీ పరిధిలో. మే డే సంబరాలు చేపట్టిన టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మే ఒకటో తేదీన. మే డే కార్మికుల దినోత్సవం గా ఘనంగా చేపట్టారు ప్రభుత్వం ద్వారా కార్మికులకు. అండగా ఉంటారని తెలిపారు.2