Shuru
Apke Nagar Ki App…
ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఇనుచున్న ప్రియ సహోదరి సహోదరుడా స్నేహితుడా దేవుని ఒక కృప క్షేమము సంతోష సమాధానము సకల మేలులు మీ చేతి పనులు నిచ్చులో విపతి అడుగులో ఆలోచనలో మాటలో నడకలో పడకలో ప్రవర్తనలో దైవిక పరిశుద్ధత దైవిక కృప క్షేమము సకల ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్స్ యు ఆమెన్
T. Raja simha
ప్రైస్ ది లార్డ్ టు ఆల్ ఇనుచున్న ప్రియ సహోదరి సహోదరుడా స్నేహితుడా దేవుని ఒక కృప క్షేమము సంతోష సమాధానము సకల మేలులు మీ చేతి పనులు నిచ్చులో విపతి అడుగులో ఆలోచనలో మాటలో నడకలో పడకలో ప్రవర్తనలో దైవిక పరిశుద్ధత దైవిక కృప క్షేమము సకల ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహించును గాక గాడ్ బ్లెస్స్ యు ఆమెన్
More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు సందర్భంగా కూల్ డ్రింక్స్ పంపిణీ నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హోస్పేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము కమిటీ సభ్యులు వాయుగుండ్ల బ్రహ్మయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్ళి పాద చారులకు ఆటో వాహనదారులకు 100 పుచ్చకాయలు 300 కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమాన్ని వాయుగుండ్ల బ్రహ్మయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇటువంటి జన్మదిన వేడుకలు భవిష్యత్తులో మరి ఎన్నో జరుపుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సిబ్బంది స్థానిక వ్యాపారస్తులు బంధుమిత్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం - నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడును విజయవంతం చేయండి.. - త్వరలోనే కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలంలోని తాటాకుల దిన్నె గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా స్మశానానికి సరైన దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 5 లక్షల ఎంపీ లార్డ్స్ నిధులతో స్మశాన వాటికకు వెళ్లే రహదారిని నిర్మించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ మార్గాన్ని పూర్తిస్థాయి సిసి రోడ్డుగా మారుస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. స్మశానానికి దారి కోసం స్థలాన్ని కేటాయించిన స్థల దాత ఉయ్యాల దేశయ్యను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.గ్రామ పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేయిస్తామని గ్రామంలో అవసరమైన మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెబుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె కొనియాడారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.4
- చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.1
- Post by RAVI KUMAR1
- ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు1
- బద్వేలు, ఏప్రిల్ 30: నియోజకవర్గం లోని గోపవరం మండలం పి పి కుంట గ్రామ పొలంలో దళితవాడకు అనుకొని ఉన్న సర్వే నెంబరు 16 16, 1621,1605 ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది భూ బకాసురుడలు దర్జాగా కబ్జా చేసి కంచెలు వేసుకున్నప్పటికీ రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) ఆధ్వర్యంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ బంజర భూమిని పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఏరియా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గం లోని గోపవరం మండలంలో ప్రభుత్వ బంజరు భూములు అడ్డు అదుపు లేకుండా కబ్జా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కల్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నారని మండల రెవెన్యూ కార్యాలయం మొదలుకొని పి పి కుంట వరకు జాతీయ రహదారి దగ్గరలో ఇప్పటికే అనేక భూములను గత పాలకులు నేటి అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అన్యక్రాంతం చేస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించే బాధ్యత అధికారులు తీసుకోవడం లేదని దీని ఆసరా చేసుకున్న పి పి కుంట కేంద్రం వద్ద సర్వే నెంబర్ 1613,1614 ఒకరికి కేవలం రెండు ఎకరాల మాత్రమే పట్టా ఉండగా వారు మాత్రం వారి భూమి చుట్టూ వైపు ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం ఆక్రమించి ఇంటి స్థలాల పేరుతో అమ్ముకుంటున్న, ఆ ప్రభుత్వ భూమిలో చుట్టూ కంచెలు వేసి మోటర్లు తో పంటలు పండిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని కొంతమంది ఏకంగా పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించుకున్నారని పేరుకు మాత్రమే హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ ఆక్రమణలు ఆగడం లేదని తక్షణమే ప్రభుత్వ భూమిని తమ భూమిగా భావించి ఎల్లపాటుగా అమ్ముకుంటున్న వారి పైన సివిల్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వ భూములకు హద్దులు వేసి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాట నిర్వహించి అక్కడ స్థానికంగా ఉంటున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారికి ఆ భూమిని పంచి పెడతామని వారు హెచ్చరించారు ఈ పర్యటన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బద్వేల్ ఏరియా ఇన్చార్జి పడిగ వెంకటరమణ మండల కార్యదర్శి ఖాదర్ భాష మండల అధ్యక్షులు పెంచలయ్య వెంకటయ్య పవన్ పాల్గొన్నారు1
- Post by Bondhu Suresh1
- తిరుచానూరులో వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు… మే 1న స్వర్ణరథోత్సవం తిరుపతి, ఏప్రిల్ 30 తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణరథోత్సవం భక్తులకు కన్నులపండువగా నిర్వహించనున్నారు.ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులను శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. సాయంత్రం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.శుక్రవారపు తోటను శేషాచలం అడవిని తలపించేలా పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులతో అలంకరించారు. ఆవు, దూడ, కోతి, నెమలి, హంస, చిలుకల రూపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1