*కొండపల్లి ఖిల్లా పూర్వ వైభవం కోసమే ‘బొమ్మల పండుగ’: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్* *ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 18, (గళం న్యూస్)* ఆనాటి రాజుల కళావైభవాన్ని,కొండపల్లి ఖిల్లా ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ ఆధ్వర్యంలో ‘కొండపల్లి బొమ్మల పండుగ’ను ఘనంగా ఏర్పాటు చేశామని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు.శనివారం కొండపల్లి ఖిల్లా వద్ద జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన పర్వత అధిరోహణ (ట్రెకింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.అంతర్జాతీయ గుర్తింపు,కొండపల్లి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, ఆ ఖ్యాతిని మరింత పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం,2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో ఖిల్లాను అభివృద్ధి చేస్తే,ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.నేటి ఖిల్లా దుస్థితికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.అభివృద్ధి ప్రణాళిక,2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఖిల్లా పునరుద్ధరణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.పర్యాటకుల సౌకర్యార్థం ఖిల్లాకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- Post by SHOT NEWS1
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.3
- మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.1
- అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.1
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1