Shuru
Apke Nagar Ki App…
What is Ganja? Cannabis (Ganja) is a psychoactive substance that affects the brain, behavior, and decision-making ability.
Daatha Foundation Trust
What is Ganja? Cannabis (Ganja) is a psychoactive substance that affects the brain, behavior, and decision-making ability.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1
- చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్యే స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్.. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే - మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. కడ పిడి సహకారంతో ధైర్యే స్పర్శ కార్యమాన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది.. గంజాయి, మహిళల పై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటి పై ప్రజలకు అవగాహన కపించడం జరుగుతుంది.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..2
- కోవూరు అన్న క్యాంటీన్ లో ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు - ఆకలి లేని సమాజాన్ని నిర్మించాలన్న సిఎం చంద్రబాబు నాయుడులక్ష్యం. - చంద్రన్న జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్ల పేదలు ఒక రోజు ఉచితంగా భోజనం చేసేందుకై నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. - నాయకులు అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూల మాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వండి. - విడవలూరు మండలంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించిన విపిఆర్ నేత్ర బస్సు మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ సిఎం చంద్రబాబు జన్మదిన కానుకగా అందిస్తున్నాం. - కోవూరు అన్నా క్యాంటీన్‌లో సామాన్యులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా అన్న క్యాంటీన్లో భోజనం చేసే పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఆయన సతీమణినారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు అన్న క్యాంటీన్ లో సిఎం చంద్రబాబు నాయుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పేదవాడి ఆకలి తీర్చడమే పరమావధిగా భావించే నాయకుడు చంద్రబాబు ఆలోచనల నుంచి పుట్టిన అన్నా క్యాంటీన్లు నేడు లక్షలాది మందికి ఆకలి తీరుస్తున్నాయని కొనియాడారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అభిమానంతో తీసుకొచ్చే బొకేలు, పూలమాలలకు బదులు నారా భువనేశ్వరి స్ఫూర్తిగా ఆ డబ్బులు అన్న క్యాంటీన్లకు విరాళంగా యివ్వాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నాయకులకు హితోపదేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన కానుకగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విడవలూరు మండలంలో ఈరోజు ప్రారంభించిన విపిఆర్ నేత్ర గురించి ప్రస్తావించారు. అలాగే బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సిఎం చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పి4 ద్వారా నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కూడా జన్మదిన కానుకగా అందివ్వనున్నట్టు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల తెలుగుదేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.4
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు సోమవారం నంద్యాలలో మహానంది జూవెలర్ దుకాణంలో తనిఖీలు చేశారు. ఆల్ మార్కు లేని 3 కేజీల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి నంద్యాలలో ఉన్న అన్ని బంగారు దుకాణాలు మూసివేశారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.1
- చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఏఎంసీ చైర్మన్ లలితా మురుగేశ్, వైసీపీ నాయకులు భాస్కర్ నాయక్, చెంగప్ప.. కుప్పంలో దళితుల పై దాడులు ఎక్కువయ్యాయి.. దళితుల పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు.. శాంతిపురం మండలంలోని నంజంపేట గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో జరిగిన చిన్నపాటి గొడవలో భాగంగా దళిత కుటుంబం పై మూకుమ్మడిగా అగ్రకులాలకు చెందిన వారు దాడి చేశారు.. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.. ఈ ఘటన పై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి.. దళిత కుటుంబం పై దాడి చేసిన వారందరి పై కఠిన చర్యలు తీసుకోవాలి.. దళితుల పై దాడులు చేయడం సమంజసం కాదు.. కుప్పంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయకుండా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయండి.. దళితులకు న్యాయం చేయాలని అడిగిన రామకుప్పం మండలానికి చెందిన మురుగేష్ పై అక్రమంగా కేసు పెట్టారు.. బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరుడుతాం..1
- అమరావతి నిర్మాత, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్ ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ కటౌట్‌కు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. డ్రోన్ సహాయంతో కటౌట్‌పై పుష్ఫాభిషేకం నిర్వహించారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో లక్ష్మీపురం గ్రామం దద్ధరిల్లింది. చంద్రబాబు నాయుడు అంటే కేవలం పేరు కాదని, అదొక అభివృద్ధి బ్రాండ్ అని నినదించారు. ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సుపరిపాలనను కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధికి ఆటంకం కలగకుండా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్న నవ్యాంధ్ర నిర్మాతకు ప్రజలందరూ అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.4