Shuru
Apke Nagar Ki App…
ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పులు… ఎకరం మొక్కజొన్న పంట దగ్ధం బైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన రైతు టేకుల దశరత్‌కు చెందిన ఒక ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చేనిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అకస్మాత్తుగా నిప్పులు ఎగసిపడడంతో పక్కనే ఉన్న పొలంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి రైతు దశరత్‌కు చెందిన మొక్కజొన్న పంటను పూర్తిగా కాల్చివేశాయి. ఈ ఘటనతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధిత రైతు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తనకు తగిన పరిహారం అందించాలని కోరుతున్నాడు.
Solanke Ravi
ట్రాన్స్‌ఫార్మర్ నుంచి నిప్పులు… ఎకరం మొక్కజొన్న పంట దగ్ధం బైంసా మండలం కామోల్ గ్రామానికి చెందిన రైతు టేకుల దశరత్‌కు చెందిన ఒక ఎకరం మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చేనిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి అకస్మాత్తుగా నిప్పులు ఎగసిపడడంతో పక్కనే ఉన్న పొలంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు వేగంగా వ్యాపించి రైతు దశరత్‌కు చెందిన మొక్కజొన్న పంటను పూర్తిగా కాల్చివేశాయి. ఈ ఘటనతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధిత రైతు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తనకు తగిన పరిహారం అందించాలని కోరుతున్నాడు.
More news from Telangana and nearby areas
- బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..4
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నడిమితండాలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గ్రామానికి చెందిన భూక్యా పద్మ నివాసపు పూరి గుడిసె పూర్తిగా కాలి దగ్ధమైంది. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆరిపివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణామాన్ని జరగలేదు. అలాగే సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.1
- విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయాత్ర ఆత్మ హిందూ బంధువులకు ఆహ్వానం ధైర్యం శక్తిసామర్థ్యాల ప్రతీక హనుమంతుడు తన అనంతబల పరాగ్రామాలతో రామ కార్యం సులభతరం చేసిన వీర హనుమాన్ శక్తులు అపారం తున్న విదర్మీల ఆకృత్యాలు ఎదుర్కోవడానికి హిందూ సమాజం నిలవాలంటే ప్రతి ఒక్కరు అనుమంతుని ఆదర్శంగా తీసుకొని ఐక్యత ప్రదర్శించాలన్నారు హిందూ సమాజ పరిరక్షణకు పూనుకోవాలన్నారు. మెదక్ పట్టణంలోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వెల్కమ్బోడు వద్ద సాయంత్రం ఐదు గంటలకు విజయ యాత్ర ప్రారంభమవుతుందని సంయోజక్ మహేంద్ర పృథ్వీరాజ్ పిలుపునిచ్చారు ఈ యాత్రలో హిందూ బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు మీయొక్క వ్యాపారాలను రెండు గంటల పాటు వదిలి విజయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు.1
- సదాశివపేటలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే తమ్ముడు అక్రమాలు చేశాడు: సదాశివపేటలో మీడియాతో మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.1
- Post by Solanke Ravi1
- *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను రైతు బిడ్డనని పేర్కొంటూ సంఘ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.సంఘానికి దశలవారీగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామస్తులు మరియు సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.4
- దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహణ 📅 తేదీ : 03.04.2026 📍 స్థలం : IDOC, కామాహరెడ్డి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (LB) శ్రీ మధు మోహన్ గారు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, “దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమర వీరుడని, రెండు పదుల వయసు నిండకుండానే భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల కోసం రైతాంగ పోరాటం చేసి అమరుడైన మహా వీరుడని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని, ఆయన ధైర్యసాహసాలు మరియు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.” అలాగే బహుజన సంఘాల నాయకులు, కుర్మ సంఘం నాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సహాయ బీసీ అభివృద్ధి అధికారి శ్రీ చక్రధర్ గారు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, శివరాములు, గణేష్ నాయక్, విఠల్, నాగరాజు, కుర్మ సంఘం నాయకులు భూమయ్య, సంజీవ్ స్వామి, అశ్వక్, నరేష్, స్వప్న, సునీత, పవన్ మరియు జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.1