Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from తెలంగాణ and nearby areas
- Post by Ravi Poreddy1
- శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.1
- సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లింపు ఆసిఫాబాద్, జనవరి 1: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్కలకు పలువురు భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు.తమ ఎత్తు బంగారాన్ని అమ్మ వార్ల కు సమర్పించి పూజా కార్యక్రమాల అనంతరం బంగారాన్ని పలువురికీ పంచిపెట్టారు. మేడారంలో సమ్మక్క సారక్కల జాతర కొనసాగుతుండగా జిల్లావ్యాప్తంగా పలువురు భక్తులు నిలువెత్తు బంగారాన్ని పంచుతూతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యాయయనోత్సవాలు రెండవ రోజు శ్రీకృష్ణ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు..1
- నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.1
- చిన్నపిల్లల గొడవ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసింది! మునిపల్లి మం. మల్లికార్జునపల్లిలో రాత్రి సుమారు 12గం.కు నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి చేసింది. వారు ఒకరినొకరు కొట్టుకోగా పాండు (40) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మునిపల్లె 108 అంబులెన్స్ క్షతగాత్రునికి ప్రధమ చికిత్సనందిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. <2
- Post by FIROZANSARI FIROZ1
- న్యూఇయర్ వేడుకల వేళ కాగజ్ నగర్ లో డ్రంక్ అండ్ డైవ్. కాగజ్ నగర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షణలో ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ చౌరస్తాలలో తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1