Shuru
Apke Nagar Ki App…
నరసన్నపేట: డంపింగ్ యార్డును తలపిస్తున్న ఎన్బీసీ మెయిన్ కెనాల్ నరసన్నపేట మండలం జమ్ము కూడలి వద్ద ఉన్న నరసన్నపేట బ్రాంచ్ కెనాల్ కాలువ గట్లపై వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. ఈ కాలువ గట్టును డంపింగ్ యార్డుల మార్చేశారని స్థానికులు వాపోయారు. ఈ కాలువకు ఆనుకుని ఉన్న హోటల్స్తో పాటు వంశధార కాలనీకి పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఈ వ్యర్ధాలను వారంతా కలిసి కాలువ గట్లపై పడి వేస్తున్నారన్నారు. ఈ వ్యర్ధాలు కాలువలో కలిసిపోతుండడంతో సాగు నీరు కలుషితం అవుతుందని రైతులు తెలిపారు.
Raji
నరసన్నపేట: డంపింగ్ యార్డును తలపిస్తున్న ఎన్బీసీ మెయిన్ కెనాల్ నరసన్నపేట మండలం జమ్ము కూడలి వద్ద ఉన్న నరసన్నపేట బ్రాంచ్ కెనాల్ కాలువ గట్లపై వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. ఈ కాలువ గట్టును డంపింగ్ యార్డుల మార్చేశారని స్థానికులు వాపోయారు. ఈ కాలువకు ఆనుకుని ఉన్న హోటల్స్తో పాటు వంశధార కాలనీకి పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఈ వ్యర్ధాలను వారంతా కలిసి కాలువ గట్లపై పడి వేస్తున్నారన్నారు. ఈ వ్యర్ధాలు కాలువలో కలిసిపోతుండడంతో సాగు నీరు కలుషితం అవుతుందని రైతులు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి పట్టణంలో నేడు ఆర్డీవో కృష్ణమూర్తి టెక్కలి జిల్లా ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టుమార్టం గది పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు పరిశీలించి వెంటనే వారికి నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు4
- ఆదానీ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తిరస్కరించండి - సిపిఎం ---------------------------------------------------------------- గతంలో వైసిపి ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఒప్పందాన్ని వ్యతిరేకించండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అవే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు అన్నారు. కరెంటు చార్జీలు భారీగా పెరిగే ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలి అని పిలుపునిచ్చారు. షాపులకి బిగించిన స్మార్ట్ మీటర్లు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, యూనిట్ కి ఎంత రేటు పడుతుందో తెలియదు. ఈ స్మార్ట్ మీటరు ప్రజలకు ఎటువంటి సమాచారం చూపించదు వాడిన కరెంటుకు విపరీతంగా చార్జీలు పెంచి ప్రజలపై మోయలేనిభారం పడుతుందని అన్నారు. షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్ల వలన షాపుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో స్మార్ట్ మీటరు 10250/- ఆదానికి ప్రజలు కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తీవ్రంగా నష్టం చేసే విద్యుత్తు ప్రైవేటీకరణ ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటరు బిగించడానికి వస్తున్నారు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బలవంతంగా బిగించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాలు పెన్షనర్స్ సంఘం నాయకులు వి. శేషగిరి పాల్గొన్నారు.2
- న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ ద్వారా ఉచిత వైద్య శిబిరం - సేవలు పొందిన మంది గ్రామ ప్రజలు న్యూమెన్ చారిటబుల్ సొసైటీ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వందలాది గ్రామ ప్రజలు ఈ సేవలు వినియోగించుకొని లబ్ది పొందారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం బేతాళ స్వామి గుడి ప్రాంగణంలో, న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గౌతమీ నేత్రాలయం అనుబంధ సంస్థ శ్రీ చరణ్ కంటి ఆసుపత్రి (జగ్గంపేట) మెడ్ వే సంజీవని హాస్పటల్ (కాకినాడ) వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో వేట్లపాలెం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పేషెంట్లు సేవలు పొందారు. వారిలో సుమారు 40 మందికి కళ్లజోళ్ళు అవసరం ఉన్నట్లు గుర్తించబడింది. వయోభారంతో శుక్లాలు (క్యాటరాక్ట్) కారణంగా చూపు తగ్గిన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సకు బదిలీ చేయడం జరిగింది. అలాగే మెడ్ వే సంజీవని హాస్పటల్ కాకినాడ వైద్య బృందం ద్వారా ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నవారిని తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి సిఫార్సు చేయడం జరిగింది. అవసరమైన వారికి కంటి చుక్కల మందులు ఉచితంగా అందించడమే కాక, కార్నియా (నల్ల గుడ్డు) మరియు రెటీనా (కంటి నరం) సంబంధిత సమస్యలను గుర్తించి ఆయా వైద్య నిపుణులకు రిఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు సంవత్సరానికి కనీసం ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే పిల్లల్లో మొబైల్ ఫోన్ అధిక వినియోగం వల్ల కళ్లకు కలిగే నష్టాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడసత్తిబాబు వేట్లపాలెం సర్పంచ్ గోలి శ్రీరామ్ చిల్లీ మోహన్ రావు విజయ దుర్గ ల్యాబ్ సతీష్ వేట్లపాలెం హై స్కూల్ హెచ్ఎం అనురాధ నెంబర్ వన్ స్కూల్ బలరామ్ , చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహకారం అందించారు. ఈ ఉచిత వైద్య శిబిరం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామ పెద్దలు, ప్రజలు న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారి తరఫున ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎన్. శ్యాంసన్ రాజు వారి కుమారులు శరత్ బాబు రత్న శేఖర్ ను అభినందించారు.గూడపర్తి సి ఓ సి యూత్ ఈకార్యక్రమం నందు పాల్గొని జయప్రదం చేశారు .ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన న్యూ మెన్ చారిటబుల్ సొసైటీ వారికి పలువురు అభినందనలు తెలిపారు.4
- ycp king's1
- *చైనా లోని హైకౌ మాజీ మేయర్ దగ్గర భారీగా అక్రమ సొమ్ము పట్టివేత..* - 23 టన్నుల నగదు - 13.5 టన్నుల బంగారం - చైనా & విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ - ఖరీదైన కార్ల సేకరణ ప్రభుత్వ ఒప్పందాలు & భూ ఒప్పందాలకు సంబంధించిన లంచాల ద్వారా బిలియన్ల విలువైన ఆస్తులు లంచంగా పొందారు. భారీ అక్రమ సంపదను కనుగొన్న తర్వాత అతనికి మరణశిక్ష విధించిన స్థానిక న్యాయస్థానం.1
- గోపాలపురం జాతీయ రహదారిపై గురువారం ఉదయం లారీ తిరగబడిన ఘటనలో డ్రైవర్ కి తీవ్రగాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ నుంచి కొవ్వూరు వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే అతన్ని 108 వాహనంలో గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతున్నారు. హైవే పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.1
- గుంటూరు/చుట్టుగుంట గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు1
- ycp ra puka1