logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భూపాలపల్లిలో కోతుల బీభత్సం – ప్రాణభయంతో ప్రజలు, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోతుల స్వైరవిహారం తీవ్ర స్థాయికి చేరింది. మున్సిపాలిటీ పరిధిలో కోతుల దాడులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిన్న కోతుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

భూపాలపల్లిలో కోతుల బీభత్సం – ప్రాణభయంతో ప్రజలు, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోతుల స్వైరవిహారం తీవ్ర స్థాయికి చేరింది. మున్సిపాలిటీ పరిధిలో కోతుల దాడులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిన్న కోతుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ​కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    2
    ​కాజీపేట: మండలంలోని మడికొండ గ్రామంలో రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన నిబంధనలను విస్మరించి, కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఒక మహిళను బైండోవర్ చేయడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
​మడికొండకు చెందిన సదరు మహిళను తహసీల్దార్ కార్యాలయానికి తరలించే సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం మహిళలను విచారణకు తరలించేటప్పుడు మహిళా పోలీసులు ఉండాల్సి ఉండగా, బలవంతంగా ఎమ్మార్వో ఆఫీసు వద్దకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు విధివిధానాలు పాటించకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Public Reporter Gaddam Kiran
    Public Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    18 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
    1
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలోని గువ్వలపాడు వద్ద తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బార్ధన్ (లోడ్) తీసుకెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం తర్వాత వాహనం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో ఎవరైనా గాయపడినారా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    18 hrs ago
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గుట్టపై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ప్రతియేటా వైశాఖ మాస వసంత ఋతువు శుక్ల పక్ష పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ఈసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించి ఆలయ సన్నిధిలో ముత్యాల పందిరిలో స్వామి వారి  కళ్యాణం నిర్వహించారు. పెద్దపల్లి డిప్యూటీ తహసిల్దార్ మహేష్ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహించి అన్నదానం చేశారు. మహిళా భక్తులు స్వామివారికి ఓడి బియ్యం పోశారు. కళ్యాణోత్సవంలో సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, ధర్మకర్తలు ఆంజనేయులు, సతీష్, సంపత్ పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.
    1
    ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపోలో జరిగిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ముఖ్య  అతిథిగా హాజరైన మంత్రి, ఆర్టీసీ కార్మికులతో కలిసి మే డే వేడుకలు జరుపుకున్నారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని, ప్రపంచ కార్మికులకు శ్రమైక జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఆపరేషన్ లాస్ నుండి లాభాల్లోకి వస్తుందంటే మహాలక్ష్మి పథకం ద్వారానే సాధ్యమైందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే వారి ఆకాంక్షల కనుగుణంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో కార్మిక సంఘాలతో 15 గంటల పాటు చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల ఎన్నికలు, కార్మికులకు 11 శాతం పిఆర్సి ప్రకటించిందన్నారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు జరిపి గుర్తింపు పొందిన సంఘం అధికారుల కమిటీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. సమ్మె జరగక ముందే 32 అంశాల్లో 29 అంశాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పామని, మిగిలిన మూడు అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని తెలిపిన, అంతలోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య  చేసుకోవడం దురదృష్టకరమని తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ చట్టం తెచ్చామని, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రిగా, ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    20 hrs ago
  • * 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించిన ముఖ్యమంత్రి * సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    2
    * 3 రోజుల వేతనం ఇచ్చేందుకు, కేసుల ఎత్తివేతకు అంగీకరించిన ముఖ్యమంత్రి 
* సమ్మె కాలంలో వేతనం, కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    12 hrs ago
  • రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం. మాతృదేవోభవ అనాధ ఆశ్రమవాసులకు మానసిక వికలాంగులకు ఆశ్రమ నిర్మాణానికై మరియు గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణానికి స్వంత స్థలం కోసం భూదానయజ్ఞం శాశ్వత సొంత స్థలం,భవన నిర్మాణనికి శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి గార్ల పెళ్లిరోజు సందర్భంగా రూ,, 10,000/- లు ఆర్దికసహాయం అందించి తమ సేవాతత్పరతను చాటారు. మీరు,మీ కుటుంబసభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. చేయి చేయి కలుపండి - మాతృదేవోభవ ఆశ్రమానికి స్వంత స్థలం కోసం తోడ్పాటునందివ్వండి🙏🙏🙏 Google Pay, Phonepe: 9347513830, 7997919365
    1
    రంగరెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గ్రామం నాదర్జల్ శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి  గార్ల పెళ్లిరోజు సందర్భంగా మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నూతన భవనం నిర్మాణనికి రూ,, 10,000/- లు ఆర్దికసహాయం.
మాతృదేవోభవ అనాధ  ఆశ్రమవాసులకు మానసిక వికలాంగులకు ఆశ్రమ నిర్మాణానికై మరియు గోమాతల సంరక్షణకై గోశాల నిర్మాణానికి స్వంత స్థలం కోసం భూదానయజ్ఞం శాశ్వత సొంత స్థలం,భవన నిర్మాణనికి శ్రీ బొల్లం శ్యామసుందర్ -శ్రీమతి కల్యాణి  గార్ల పెళ్లిరోజు సందర్భంగా రూ,, 10,000/- లు ఆర్దికసహాయం అందించి  తమ సేవాతత్పరతను చాటారు. మీరు,మీ కుటుంబసభ్యులు నిత్యం సుఖసంతోషాలతో ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము.
చేయి చేయి కలుపండి - మాతృదేవోభవ ఆశ్రమానికి స్వంత స్థలం కోసం తోడ్పాటునందివ్వండి🙏🙏🙏
Google Pay, Phonepe: 9347513830, 7997919365
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది.
ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
    1
    తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    18 hrs ago
  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం బస్ స్టేషన్ లో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు.‌ ఆర్టీసీ బస్టాండ్ లో కుర్చీల్లో పడుకున్న యువకున్ని లేచి కూర్చో అన్నందుకు బస్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ట్రాఫిక్ గైడ్ పై దాడి చేశాడు. ప్రయాణికుల కోసం వేసిన కుర్చీలో పడుకున్న యువకుడిని లేచి కూర్చోవాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన యువకుడు ట్రాఫిక్ గైడ్ ను చితకబాదాడు. ప్రయాణికులు అడ్డుకున్న ఆగకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకున్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువకుడి దాడిలో గాయపడ్డ ఆర్టీసీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మద్యం మత్తులో ఉన్న యువకుడిపై కేసు నమోదు చేసి మత్తు వదిలించారు.
    1
    కరీంనగర్ జిల్లా శంకరపట్నం బస్ స్టేషన్ లో మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు.‌ ఆర్టీసీ బస్టాండ్ లో కుర్చీల్లో పడుకున్న యువకున్ని లేచి కూర్చో అన్నందుకు బస్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ట్రాఫిక్ గైడ్ పై దాడి చేశాడు. ప్రయాణికుల కోసం వేసిన కుర్చీలో పడుకున్న  యువకుడిని లేచి కూర్చోవాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన యువకుడు ట్రాఫిక్ గైడ్ ను చితకబాదాడు. ప్రయాణికులు అడ్డుకున్న ఆగకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకున్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువకుడి దాడిలో గాయపడ్డ ఆర్టీసీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  మద్యం మత్తులో ఉన్న యువకుడిపై కేసు నమోదు చేసి మత్తు వదిలించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.