logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మండుతున్న ఎండలు.... ఉక్కపోత... దోమల మోత... చిన్నారులు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి.... సుర్రుమంటున్న సూర్యుడు.. 40 డిగ్రీలకు చేరువలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు... రాత్రి పూటా పెరుగుతున్న టెంపరేచర్‌... అధికమవుతున్న కరెంట్‌ వినియోగం... వాతావరణ మార్పులతో వ్యాధులకు అవకాశం... జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు... మండపేట న్యూస్; ఏప్రిల్ నెల ఆరంభం లోనే ఎండలు మండుతున్నాయి.ఉక్కపోత తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఉష్ణోగ్రత లు ఎక్కువగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు వీస్తాయి. ప్రజలు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటూ, ఎండ నుంచి తమను తాము కాపాడుకోవాలి. తూర్పు గోదావరి, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీల మేర ఎకువగా రికార్డవుతున్నాయి. తేమ శాతం తగ్గడంతో జనం ఉకపోతతో ఇబ్బంది పడుతున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈసారి అప్పుడే భానుడు విశ్వరూపం చూపుతున్నాడు. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఉకిరిబికిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండని చూసి ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ఏప్రిల్ లోనే ఎండలు ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు లో 37 డిగ్రీలు, మండపేటలో 36.9, నిడదవోలు, రాజమహేంద్రవరంలో 36.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.8 డిగ్రీలకు చేరుకున్నాయి. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 30 రోజుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతేడాది మార్చిలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే రికార్డ్‌ అయ్యాయి. మరోవైపు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. మండే ఎండలకు తోడు గాలిలో తేమ శాతం కూడా పడిపోతున్నది. ఈ రెండు జిల్లాలో కరెంట్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో విరివిగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నారు. గత నెలలో రోజుకు 8 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ వాడగా, ఇటీవల 9 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఎండలు, ఉకపోత ధాటికి తాళలేక ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. ఈ నెలాఖరులో 10 మిలియన్‌ యూనిట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండల వల్ల మండపేట లో దోమలు విపరీతంగా పెరిగి పోయాయి. దీంతోపాటు సీజనల్‌ వ్యాధులు కూడా దరి చేరే ప్రమాదం ఉంది. జ్వరం, జలుబు, అతిసారం, నీళ్ల వీరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో వచ్చే ఆటలమ్మ(చికెన్‌ పాక్స్‌), కామెర్లు వచ్చే ఆసారం ఉంది. గవద బిళ్లలు, టైఫాయిడ్‌ , పొంగు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలు ఎకువగా ఉండటంతో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరు బయట పనిచేసే వారు సూర్యరశ్మి కాపాడుకునేలా జాగ్రత్త పడాలి. తరుచూ నీళ్లు తాగాలి. ఎకువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తెలుపు రంగు, లేత రంగులు పలుచని కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. చంటిపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వడగాల్పులకు గురికాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. కాఫీలు, టీలు అధిక వేడి సమయంలో తీసుకోకూడదు.కాలం మారుతుండటంతో సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. నీరు ఎంత ఎకువ తీసుకుంటే అంత మంచిది. ఎండలో ఎకువగా తిరిగితే డయేరియా రావొచ్చు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రానున్న రోజుల్లో వృద్ధులు వడదెబ్బకు గురికాకుండా చూసుకోవాలి.

9 hrs ago
user_Raju Nandikolla
Raju Nandikolla
Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago
1837e56f-288e-4234-acc5-47a650f18805

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...
    4
    పోలవరం జిల్లా... 
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు
దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు
పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న  తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం.
పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు
డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...
    user_NageswaraRao PRESS
    NageswaraRao PRESS
    జర్నలిస్ట్ రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
    1
    కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు  మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    3 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया। लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा। संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है। FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा। लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।
    1
    अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा
लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया।
लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा।
संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है।
FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा।
लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।
    user_Jivon basu
    Jivon basu
    Duggirala, Guntur•
    7 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.