logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు

3 hrs ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి మీడియా సమావేశం నిర్వహించారు

More news from తెలంగాణ and nearby areas
  • పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు, మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.
    1
    పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. స్పీకర్ సార్...మీరు నిజాయితీ పరులు,  మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణమని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండని నిలదీయండని కోరారు. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని  గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండని పిలుపునిచ్చారు. గతంలో ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చారని చెప్పారు. మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు 10 వేలు ఇస్తున్నడట... ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    48 min ago
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో 1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. భీమేశ్వర ఆలయంలో పూజలు అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో రానున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను అదనపు  కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా భీమేశ్వర ప్రధాన ఆలయానికి వచ్చే భక్తులు, వృద్ధులు, దివ్యాంగులకు  సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీల్‌చైర్ సదుపాయంతో నూతనంగా ఏర్పాటు చేసే ర్యాంపును పరిశీలించారు.అలాగే లడ్డూ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు, వీఐపీ రోడ్డు, టాయిలెట్స్, శివార్చన స్టేజీ, నూతనంగా ఏర్పాటు చేయనున్న క్యూ లైన్లు, పార్వతీపురం ధర్మశాల రోడ్డుతోపాటు ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.భీమేశ్వర స్వామి వసతి గృహంలో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ కార్యాలయంలో  1000 రూపాయలు వేద ఆశీర్వచనం,500 రూపాయలు స్పెషల్ కోడె, 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్స్  అందుబాటులో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
భీమేశ్వర ఆలయంలో పూజలు
అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారిని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ ఈవో శ్రీమతి ఎల్  రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈలు శాంతయ్య, వరప్రసాద్, ఆలయ డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓలు జయకుమారి, శ్రావణ్ కుమార్, బ్రహ్మం అన్న శ్రీనివాస్, ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    1
    "కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించిన" మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 3 : స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలో చేరిన నాయకులకు టికెట్లు ఇస్తే ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల పరిస్థితి ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల పంపిణీపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతిపాదన ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినవాళ్ల గతి ఏంటని ప్రశ్నించారు. తినే ముందు పళ్లెం ఎత్తుకుపోయినట్టుగా ఉంది కాంగ్రెస్ జెండా మోసిన వారి పరిస్థితి” అని వ్యాఖ్యానిస్తూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవడం నా తప్పా?” అంటూ నిలదీశారు
    user_Venu Gopal
    Venu Gopal
    Jagitial, Telangana•
    19 hrs ago
  • డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝
    1
    డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు...
ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Hanamkonda, Hanumakonda•
    6 hrs ago
  • బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
    1
    బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
    2
    హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
    1
    జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడి 4గురు మృతిచెంది, పలువురు గాయపడ్డ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.
మృతిచెందిన కుటుంబీకులు, బంధువులు కలిసి ఖానాపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
మృతిచెందిన మరియు గాయపడ్డ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని  ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
పోలీసులు ధర్నా వద్దకు చేరుకుని, సమస్యను శాంతిపజేసి రాకపోకలు కొనసాగించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    42 min ago
  • మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బోనీ కొట్టింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికారం పార్టీలో టికెట్ల లొల్లి, పలుచోట్ల రెబల్స్ బెడద ఉండగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఫస్ట్ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫస్ట్ డివిజన్ నుంచి ముగ్గురు నామినేషన్ దాఖలు చేయగా కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ కు మద్దతుగా మిగతా ఇద్దరూ నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు దీంతో విజయ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. 
రామగుండం కార్పొరేషన్ చరిత్రలో తొలి ఏకగ్రీవమైన కార్పోరేటర్ గా విజయ నిలిచారు. మడిపల్లి విజయ  మల్లేష్ వ్యక్తిగతంగా మంచితనం, ప్రజలతో మమేకమై చేసిన సేవలను గుర్తించిన ప్రత్యర్థి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం అయినట్లు స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్ ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నారు.ఇందులో భాగంగా ఆలయ లడ్డు సత్రంలో ఈరోజు 1500కు పైగా లడ్డు ట్రేలు వేడి నీరు మరియు సర్ఫ్ ఉపయోగించి శుభ్రపరచి పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు.ఈ పనులను ఆలయ లడ్డు సత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టగా, పనుల నాణ్యతను సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేష్ కుమార్  ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.