డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అభినందనలు డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్.... * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అభినందనలు * ప్రతిపక్ష ఐక్యతకు మద్దతుగా నిలిచినందుకు ప్రియాంక గాంధీకి సీఎం కృతజ్ఞతలు ఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంతో పాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందించారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా దక్షిణ భారత దేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్యాంగ సవరణను అడ్డుకోవడం.... దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా బిల్లుతో సంబంధం లేకుండా, మహిళా సాధికారత పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అనవసరమైన డీలిమిటేషన్ అజెండాను ముందుకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సీఎంతో అన్నారు.

- చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ ఒక నినాదంగానే ఉంది. ఇంతకాలానికి చట్టరూపం దాల్చుతోంది. ఇది దేశచరిత్రలో గొప్ప రోజు. మహిళాబిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది. మహిళల అభ్యున్నతి దిశగా అడుగులు వేసిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా మహిళలనే ముందు వరుసలో నిలబెట్టిన నాయకుడు మా జగనన్నే. మహిళల మీద దా*డులు, అత్యా*చారాలు, ఆత్మహ*త్యలు ఇవే చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త #WomenReservationBill #YSRCPForWomen1
- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *"స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర"* కార్యక్రమంలో భాగంగా ఈరోజు (శనివారం) కాకినాడ జిల్లా వ్యాప్తంగా పోలీసు స్టేషన్ ల నందు ఆయా స్టేషన్ సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా ఎంఎం*ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్, ఐపీఎస్* ఏ ఆర్ క్వార్టర్స్ ప్రాంతంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని, మొక్కను నాటి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సిబ్బంది మరియు అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమ దానం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) శ్రీ S. శ్రీనివాసరావు, ఎస్బి డిఎస్పీ శ్రీ కెవివి సత్యనారాయణ, డిఎస్పీ (ఏ ఆర్) శ్రీ వి జి శ్రీహరి రావు, MT రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె వెంకటరావు, కంపెనీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎమ్ నరసింహ మూర్తి, కాకినాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం అప్పలనాయుడు, పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సునీల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. @జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ.1
- పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి, పారిశుధ్య పనుల పురోగతిని పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణ సుందరీకరణతో పాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. పట్టణంలోని ప్రధాన రహదారులు,కాలనీల్లో పారిశుధ్య పరిస్థితులను పీడీ స్వయంగా పర్యవేక్షించారు. డ్రైనేజీ వ్యవస్థలు,నిత్యం జరిగే చెత్త సేకరణ ప్రక్రియను పరిశీలించి ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాధవపురం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన పీడీ వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టిడ్కో నివాస సముదాయాలను సందర్శించి,అక్కడ లబ్ధిదారులకు అందుతున్న తాగునీరు,విద్యుత్ వంటి ప్రాథమిక వసతులపై సమీక్ష నిర్వహించారు. నివాస ప్రాంతాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా తక్షణమే మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు,మరియు శానిటేషన్ సిబ్బంది ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.3
- పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఇట్స్ మై ఎడిటింగ్ వీడియో1
- Post by Syyed taher1
- UTF ఆధ్వర్యంలో కినపర్తి, గౌరీపేట, కోనలోవ తదితర గ్రామాల్లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. "ప్రభుత్వ బళ్లోనే చేర్పిద్దాం - బడులను బలోపేతం చేద్దాం" అనే నినాదంతో ఐదేళ్లు నిండిన పిల్లలను బడిలో చేర్పించారు. జిల్లా కౌన్సిలర్ కమలారత్నం, ప్రధాన కార్యదర్శి రాఘవులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.2
- అచ్చంపేట మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది. ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.1
- పిఠాపురం: పిఠాపురంలోని చిత్రాడ బ్రిడ్జి డౌన్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు ప్రదర్శిస్తున్న మౌనం పట్ల సిపిఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాడా కార్యాలయంలో వారానికి ఒకసారి ఫిర్యాదులు తీసుకోవడమే తప్ప, క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యమని సిపిఐ జిల్లా నాయకులు సాకా రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం చిత్రాడ బ్రిడ్జి వద్ద కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఫిర్యాదులు అందుతున్నా అధికారులు స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కబ్జాదారులకు అనుకూలంగా మారుతోందని,ఇది వారికి ఇస్తున్న పరోక్ష సంకేతమా అని నిలదీశారు. ప్రజా సమస్యలపై పోరాడే తమకు ఉన్న బాధ్యత,ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులకు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. రాజకీయ ప్రమేయం ఉందా అను ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం మరియు స్థానిక పాడా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని, ఈ జాప్యం స్థానిక ఎమ్మెల్యే, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షనా లేదా అధికారుల సొంత నిర్ణయమా అని రామకృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తుంటే కబ్జాదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నట్లు కనిపిస్తుందని సాకా రామకృష్ణ అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఖండవల్లి మారేస్ రజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని, తక్షణమే ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1