అంగరంగ వైభవంగా శ్రీ కొండగోపాలస్వామి రుక్మిణీ సమేత కల్యాణం శ్రావణ మాసం చివరి వారంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త బోవిల్ల.నందగోపాల్ రెడ్డి బద్వేలు, సెప్టెంబర్ 05: నియోజకవర్గంలోని అట్లూరు మండలం రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాల మధ్య పడమటి భాగంలోని కొండల్లో, శ్రీ లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ కొండగోపాలస్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి వారం సందర్భంగా శనివారం రుక్మిణీ సమేత శ్రీ కొండగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ కొండ గోపాలస్వామి ఆలయ ధర్మకర్త బొవిల్ల నందగోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు , సత్యం స్వామి,రమేష్ శర్మ స్వామి ల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భజనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రావణ మాసం చివరి వారంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పాలకొండు.రాజగోపాల్ రెడ్డి, పో న్నవోలు సాంబశివారెడ్డి, పాటూరు రాధాకృష్ణారెడ్డి, ఎలక్ట్రీషియన్ నాగిరెడ్డి, నందగోపాల్ రెడ్డి, బోవిల్ల. పెద్దబ్బయి గారి రామకృష్ణారెడ్డి, తదితరులు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా శ్రీ కొండగోపాలస్వామి రుక్మిణీ సమేత కల్యాణం శ్రావణ మాసం చివరి వారంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త బోవిల్ల.నందగోపాల్ రెడ్డి బద్వేలు, సెప్టెంబర్ 05: నియోజకవర్గంలోని అట్లూరు మండలం రెడ్డిపల్లి, కొండూరు, అట్లూరు గ్రామాల మధ్య పడమటి భాగంలోని కొండల్లో, శ్రీ లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ కొండగోపాలస్వామి ఆలయంలో శ్రావణ మాసం చివరి వారం సందర్భంగా శనివారం రుక్మిణీ సమేత శ్రీ కొండగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ కొండ గోపాలస్వామి ఆలయ ధర్మకర్త బొవిల్ల నందగోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు , సత్యం స్వామి,రమేష్ శర్మ స్వామి ల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు భజనలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రావణ మాసం చివరి వారంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పాలకొండు.రాజగోపాల్ రెడ్డి, పో న్నవోలు సాంబశివారెడ్డి, పాటూరు రాధాకృష్ణారెడ్డి, ఎలక్ట్రీషియన్ నాగిరెడ్డి, నందగోపాల్ రెడ్డి, బోవిల్ల. పెద్దబ్బయి గారి రామకృష్ణారెడ్డి, తదితరులు భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
- పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.1
- పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.1
- నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్ సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు ఆర్యవైశ్య మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి కోశాధికారి లక్ష్మీ సుకన్య ఆర్యవైశ్య యువజన యువ భాగంలో అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,1
- వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.1
- ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఘాటైన కౌంటర్ విడవలూరు మండలంలోని స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో కోవూరు ఏఎంసీ చైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వంశీకృష్ణారెడ్డి.. ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి కూడా ప్రసన్నకుమార్ రెడ్డి భాష, వ్యవహారశైలిపై విమర్శలు చేశారు.3
- వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.1
- జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ వీధిలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఉభయ దాతల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణం కాపాడడంలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు చేశారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆటలు పాటలుతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా వేలంపాటలో లడ్డును 7116 రూపాయలకు సుబ్బారావు దక్కించుకున్నారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఏర్పాటు చేసుకొని పురవీధులలో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు ఆనందంతో కేరింతల కొడుతూ డాన్సులు వేశారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.1