బెట్టింగ్ నిర్మూలిద్దాం,యువతను కాపాడుకుందాం : వికారాబాద్ పట్టణ సిఐ రఘుకుమార్ వికారాబాద్ : ఈరోజు శనివారం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ ఒక ప్రకటన ద్వారా యువతకు తల్లిదండ్రులకు బెట్టింగ్ పై ఒక సందేశం ఇచ్చారు. ఐపీఎల్ ఆటను ఒక కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి కానీ అలా కాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో అక్రమమైన మార్గాలు వెతుకుతూ బెట్టింగ్ పాల్పడి డబ్బులు కోల్పోయాక నేరాల వైపు చూస్తున్నట్టు తెలుస్తుందని అన్నారు. ప్రారంభమైన ఈ బెట్టింగ్ పెద్ద మొత్తంగా మారి బెట్టింగ్లో డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకునేదాకా వెళుతుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఒక గంట కనిపెట్టుకొని ఉండాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్టు సమాచారం ఉంటే 8712670030 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం రెడీగా ఉన్నట్లు తెలిపారు.
బెట్టింగ్ నిర్మూలిద్దాం,యువతను కాపాడుకుందాం : వికారాబాద్ పట్టణ సిఐ రఘుకుమార్ వికారాబాద్ : ఈరోజు శనివారం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ ఒక ప్రకటన ద్వారా యువతకు తల్లిదండ్రులకు బెట్టింగ్ పై ఒక సందేశం ఇచ్చారు. ఐపీఎల్ ఆటను ఒక కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి కానీ అలా కాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో అక్రమమైన మార్గాలు వెతుకుతూ బెట్టింగ్ పాల్పడి డబ్బులు కోల్పోయాక నేరాల వైపు చూస్తున్నట్టు తెలుస్తుందని అన్నారు. ప్రారంభమైన ఈ బెట్టింగ్ పెద్ద మొత్తంగా మారి బెట్టింగ్లో డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకునేదాకా వెళుతుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఒక గంట కనిపెట్టుకొని ఉండాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడినట్టు సమాచారం ఉంటే 8712670030 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం రెడీగా ఉన్నట్లు తెలిపారు.
- సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన4½ తులాల బంగారం రికవరీ, వాహనం స్వాధీనంముసుగు ధరించి దాడి… 48 గంటల్లోనే నిందితుడు అరెస్ట్ ప్రత్యేక బృందాలతో వేగవంతంగా కేసు ఛేదించిన పోలీసులుమెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస్ రావు, శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు మేరకు ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి జిల్లా వాసి కాగా, ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసంఉంటున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.1
- మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 న చిన్న శంకరం పేట మండలం జంగారాయి కి చెందిన తుమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80) దంపతుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ముసుగు వేసుకుని వాటిలో బైక్ బంపర్ రాడ్ తో దాడి చేసి 4.5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్ళడం జరిగిందని అన్నారు. ఈ కేసులో అదనపు ఎస్పీ మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా ఈ నెల 28 న ఉదయం తూప్రాన్ బస్ స్టాప్ లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకొని అతని వద్ద చోరీ చేసిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విరిగే వెంకట నారాయణ వృద్ధ దంపతుల మనవరాలి భర్త కావడంతో అతనికి వీరు ఒంటరి గా ఉంటారనే విషయం తెలుసుకుని చేసిన అప్పులను తీర్చేందుకు ఈ దోపిడి చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసు చేదన వేగంగా చేసిన తూప్రాన్ డీఎస్పీ, రామాయంపేట సీఐ, ఎస్ఐ, సీసీ ఎస్ కానిస్టేబుల్స్ లను ఆయన అభినందించారు.1
- ధర్మరెడ్డిపల్లిలో కన్నుల పండువగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం గజ్వేల్ గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం ధర్మరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రుడు, సీతాదేవిల వివాహ వేడుకను గ్రామస్తులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో విశేష పూజలు నిర్వహించిన అర్చకులు, శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణం జరుగుతుండగా భక్తులు జయజయధ్వానాలతో పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు గ్రామ సర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం గ్రామ ప్రజల అదృష్టమని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ధర్మరెడ్డిపల్లి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణలో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.4
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* .. మద్నూర్ మండలం పరిధిలోని శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరు పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కలిగిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించేలా స్కూల్ నిర్మాణం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ................ కలెక్టర్ వెంట ee సోషల్ వెల్ఫేర్ అధికారి అశోక్, డీఈఓ రాజు, mro, mpdo, సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు ఈ తనిఖీలో పాల్గొన్నారు.1
- ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- "బెట్టింగ్ మహమ్మారికి దూరంగా ఉండండి", క్రీడా స్ఫూర్తితో ఆటను ఆస్వాదించండి.1
- నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....1
- పత్రిక ప్రకటన. తేది:28.03.2026. కామారెడ్డి జిల్లా శనివారం. .. *గుడ్డును తూకం వేసి బరువును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్* . .... మద్నూర్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూల్‌లోని స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, స్వయంగా గుడ్లను తూకం వేసి వాటి బరువును పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా గుడ్ల బరువు ఉందో లేదో తనిఖీ చేస్తూ, తక్కువ బరువుతో సరఫరా అవుతున్నాయా అన్న అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తక్కువ బరువుతో గుడ్లు సరఫరా అయితే సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, సరఫరాలో నాణ్యత లోపాలు ఉంటే గుత్తేదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం, వసతులపై ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, విద్యార్థులకు పోషకాహారం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్కూల్ లో శుభ్రత, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట deo రాజు, dco రామ్మోహన్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.1