Shuru
Apke Nagar Ki App…
మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కు స్వాగతం* *మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కు స్వాగతం* సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తాడిత పిడిత అనగారిన ప్రజల పక్షాన అజ్ఞాతంలో ఉద్యమించిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగిపోయిన అనంతరం మొదటి సారి తన జన్మస్థలమైన కోరుట్ల పట్టణం తిరిగి వచ్చిన సందర్భంగా తన తమ్ముడి నివాసంలో వున్న దేవ్ జీ ని కోరుట్ల పట్టణ మైనార్టీ నాయకులు జాతీయ చిరు వ్యాపారుల సంఘం కోరుట్ల పట్టణ అధ్యక్షులు షాహద్ మొహమ్మద్ షేక్,మోయిజ్ రహ్మాన్. జర్నలిస్ట్ అబ్దుల్ ముసవ్విర్ . యునుస్ లు కలిసి శాలువాతో సన్మానించారు.
Anantoji Kalidas
మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కు స్వాగతం* *మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కు స్వాగతం* సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తాడిత పిడిత అనగారిన ప్రజల పక్షాన అజ్ఞాతంలో ఉద్యమించిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగిపోయిన అనంతరం మొదటి సారి తన జన్మస్థలమైన కోరుట్ల పట్టణం తిరిగి వచ్చిన సందర్భంగా తన తమ్ముడి నివాసంలో వున్న దేవ్ జీ ని కోరుట్ల పట్టణ మైనార్టీ నాయకులు జాతీయ చిరు వ్యాపారుల సంఘం కోరుట్ల పట్టణ అధ్యక్షులు షాహద్ మొహమ్మద్ షేక్,మోయిజ్ రహ్మాన్. జర్నలిస్ట్ అబ్దుల్ ముసవ్విర్ . యునుస్ లు కలిసి శాలువాతో సన్మానించారు.
More news from తెలంగాణ and nearby areas
- తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు1
- నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. అంతకుముందు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డి-అడిక్షన్ సెంటర్ లో అందిస్తున్న చికిత్సలను, వైద్యులను, రోగులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.4
- సంగారెడ్డిలో ఉత్సాహంగా యూటీఎఫ్ ఉపాధ్యాయుల క్రీడా పోటీలు1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకును వారించిన తల్లిని తనయుడు కడతేర్చాడు. మల్లాపూర్ కు చెందిన నంబయ్య మధ్యం మత్తులో భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకుని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖం పై పిడిగుద్దులు గుద్ది ఎత్తిపడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకు పై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.3
- గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు1
- జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్ ఇచ్చి అత్త ను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్టు చేశారు. కటకటాల వెనక్కి పంపించారు. వెల్గటూర్ మండలం జగదేవపేట కు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి కి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. భార్యభర్తలు తరచు గొడవ పడుతుండడంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి గారిఇంటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తగారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో అత్తే తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్త ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెరిచేందుకు యత్నించగా కరెంట్ షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.1