Shuru
Apke Nagar Ki App…
తిమ్మాజిపేట మండలంలోని ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని ఏపీఓ సూచనలుl తిమ్మాజిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరం చేయాలని ఏపీఓ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకోవాలని సూచించారు. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫోటో అథెంటికేషన్ హాజరును పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే మండలంలోని అన్ని నర్సరీల్లో ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చి, లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన కోరారు.
MALLIKARJUN T
తిమ్మాజిపేట మండలంలోని ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని ఏపీఓ సూచనలుl తిమ్మాజిపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను ముమ్మరం చేయాలని ఏపీఓ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కూలీల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకోవాలని సూచించారు. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఫోటో అథెంటికేషన్ హాజరును పక్కాగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే మండలంలోని అన్ని నర్సరీల్లో ఈత మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిచ్చి, లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన కోరారు.
More news from Telangana and nearby areas
- నాగర్‌కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో ముందు జేఏసీ నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. 'జేఏసీ జిందాబాద్' అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 2017 ఏరియర్స్, 2021 నుంచి అమలు కావాల్సిన పే-స్కేల్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.1
- ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్1
- వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.1
- నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే )సందర్బంగా బాదంపప్పు బద్ద పై మైక్రో బ్రష్ ల తో వాటర్ కలర్ పెయింటిగ్స్ ద్వారా నలబై సూక్ష్మ చిత్రాలను ఒక గంటలో వేసి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో భూమాత భూమిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ చేతులు జోడిస్తూ వేదనతో వేడుకున్నట్లు, అలాగే వన్య ప్రాణులు చెట్లు లేక, ఆహారం లేక, నీటి కొరతతో అలమటించి పోయి భూమాతకు మొర పెట్టుకున్నట్లు, ఎండి పోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల,జంతువుల కళే బరాలు వున్నట్లు, అలాగే నీటి బొట్టులో చెట్టు వున్నట్లు అంటే నీరును, చెట్లను కాపాడు కోవాలని అర్థం. ఇలా చిన్న బాదం పప్పు పై ఇన్ని సూక్ష్మ చిత్రాలను వేసానని తెలిపారు .ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ సకల జీవరాశులకు భూమి నిలయం. కాని మానవులు తమ అవసరాల కోసం భూమికి హాని కలిగిస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి అత్యంత వేడిమి వుంది. వాతావరణంలో మార్పు వచ్చింది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది.. భూమి మీద దృష్టి పెట్టకుంటే భవిష్యత్ లో మరెన్నో ప్రమాదాలు జరుగుతాయి. మనిషి మనుగడకు ముప్పు వాటిల్లుతుంది.అందుకే ప్రతి ఒక్కరు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నీటిని వృధా చేయకూడదు, విపరీతంగా చెట్లను పెంచాలి. పర్యావరణం పచ్చగా వుంటేనే భూమిలోని వేడి తగ్గి చల్ల బరుస్తుంది. ప్రతి జీవరాశికి భూమిలో నివసించే హక్కు వుంది. భూమి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. ప్రభుత్వం కూడా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి భూమిని కాపాడుకోవాలని తెలియ చెప్పాలి . భూమి నుండి అన్ని అవసరాలు తీర్చుకొని మనం భూమిని కాపాడుకోలేక పోతున్నాము . నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమినుండి వచ్చిందే. భూమి అంటే మనకు కావాలిసినది ఇచ్చే అక్షయపాత్ర.మన భూమిని చేయకు - మరు భూమి.అందరూ పర్యావరణాన్ని కాపాడుకొని భూమిని రక్షించు కొందాం అని పిలుపునిచ్చారు.1
- ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడు – మంత్రి పొన్నం ప్రభాకర్1
- మాజీ MLA కాటసాని రామిరెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాటసాని అంటే ఏంటో తెలుసా? అని బీసీని హెచ్చరించగా.. దీనికి ఆయన తనదైన శైలిలో జవాబిచ్చారు. రామిరెడ్డి అంటే కాంట్రాక్ట్ మర్డర్లు, కబ్జాలు, దౌర్జన్యాలని ఫైర్ అయ్యారు. అటు, 2014-24 ఎన్నికలలో BPLలో మెజార్టీ తనేదన్నారు. కాగా, మంత్రి బీసీ సింగపూర్ పర్యటనలో ఉండగా, ఆయన కార్యాలయం వీడియో రిలీజ్ చేసింది.1
- రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని మహానంది ఎస్ ఐ ఎన్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి మహానంది మండలం గాజులపల్లె పరిధిలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి మెట్ట యందు ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సరైన ధ్రువపత్రాలు లేని పలువురికి జరిమానాలు విధించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. మన్ననూరు పీహెచ్‌సీని సందర్శించిన ఆయన లేబర్ రూమ్, ల్యాబ్, మెడికల్ స్టోర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీ సంఖ్యను పెంచి, పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.1