Shuru
Apke Nagar Ki App…
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక శనివారం అనూహ్య పరిణామాల మధ్య ఆదివారానికి వాయిదా పడింది. మరోవైపు విపక్ష నాయకులు చలో ఖానాపూర్ కు పిలుపునిచ్చారు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు అవుతారోనని అంతటా ఆసక్తి నెలకొంది.
P.G. Murthy
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక శనివారం అనూహ్య పరిణామాల మధ్య ఆదివారానికి వాయిదా పడింది. మరోవైపు విపక్ష నాయకులు చలో ఖానాపూర్ కు పిలుపునిచ్చారు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు అవుతారోనని అంతటా ఆసక్తి నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని TGNPDCL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయక కార్యనిర్వహణ అధికారి జి. శ్రావణ్ కుమార్ గారు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు మరియు దేవస్థానం ఉద్యోగులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎస్సీల వర్గీకరణ రగడ సృష్టించింది. ఎస్సీల రిజర్వేషన్ 15 నుంచి 25 శాతం పెంచాలని మాదిగలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదిగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహేష్ చేతిలోని మైక్ లాక్కుని ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపు గందరగోళంగా మారింది. సభకు అధ్యక్షత వహించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. మేడి మహేష్ ఎస్సీ వర్గీకరణ రద్దుపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగలు డిమాండ్ చేశారు. చివరకు మహేష్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరడంతో ఆందోళన సద్దుమణిగింది కానీ రిజర్వేషన్ మాత్రం 15 నుంచి 25 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జుక్కల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు ప్రకటించిన ఫలాలను అందించాలని డిమాండ్ చేశారు.1
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- వరుస హిందూ దేవాలయాల పై దాడులను ఖండిస్తూ మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్, కౌన్సిలర్ శశాంక్ తో కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పట్టణం గాంధీనగర్ కాలనీ హనుమాన్ దేవాలయం లోని హనుమాన్, శివలింగం, దేవతల విగ్రహాల పై ఓ ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేసి హిందువుల ఆరాధ్య దైవాలను అవమానించడం జరిగిందని అన్నారు. గత వారం రోజులుగా హిందూ దేవాలయ పై దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం మంబోజీపల్లి హనుమాన్ దేవాలయం పై ఇదేవిధంగా మూత్ర విసర్జన చేయడం, అవుసులపల్లి గ్రామంలో దేవీ, దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం తెలిసేది అని గుర్తు చేశారు. అవుసులపల్లి విగ్రహాల ధ్వంసం పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఎవరిని నిందితులుగా గుర్తించకపోవడం వల్లనే మరో సంఘటన చోటు చేసుకోవడం హిందూలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పోలీస్ లు నిందితులను గుర్తించి హిందూ మనోభావాలు దెబ్బ తీసే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో మెదక్ పట్టణంలో హిందూ ఐక్యత చూపించేలా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ దాడులను నిరసిస్తూ హిందూ బంధువులు ఈ నెల 6 న మెదక్ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని హిందువుల ఐక్యత చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ శశాంక్, రితీష్, రమేష్, లోకేష్, సంతోష్ బజరంగ్దళ్ నాయకులు పృద్వి, వంశీ, బీజేవైఎం నాయకులు సాయి, బబ్లు, చందు, స్థానిక యువకులు పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.3
- వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రూ.50 వేల విరాళం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని Sri Raja Rajeshwara Swamy Temple దేవస్థానం అభివృద్ధి కోసం సిద్దిపేట్‌కు చెందిన భక్తుడు ఆకుల నితేందర్ రూ.50 వేల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సహాయక కార్యనిర్వహణాధికారి జి. శ్రావణ్ కుమార్ గారికి అందజేశారు. అనంతరం భక్తుడు స్వామివారిని దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు భక్తుడికి ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, అకౌంట్స్ అడ్వైజర్ ఆగమ రావు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.1
- బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.2
- ఎల్లారెడ్డి మండలం : ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడిన యువత నేరాలబాట పడుతున్నారు. గేమ్లలో డబ్బులు పోగొట్టుకున్న యువకులు అప్పులపాలై వక్రమార్గంలో డబ్బులు సంపాదించే మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అప్పులపాలై ఓ యువకుడు ఎల్లారెడ్డిలో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం చేసిన గొలుసు చోరీ కేసులో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ద్వారా విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో చోరీకి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాణాల తిరుపతి రెడ్డిగా గుర్తించారు. కృష్ణాజీవాడి గ్రామ బస్టాండ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని విచారించగా జల్సాలకు అలవాటు పడిన తిరుపతి రెడ్డి ఆన్లైన్ గేమింగ్ ద్వారా అప్పుల పాలైనట్టుగా తేలింది. పక్కా పథకం ప్రకారం గొలుసు చోరీకి పాల్పడటానికి నిర్ణయించుకుని చోరీకి పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి 3 తులాల పుస్తెల తాడు, కత్తి, ముఖానికి ధరించిన స్కార్ఫ్, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ప్రెస్మీట్ లో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి ఎస్సై నరేష్ పాల్గొన్నారు.1