Shuru
Apke Nagar Ki App…
రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చింది రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్ నీనో ఉందని ఆంధ్రా ప్రజలకు తెలియదా, మరి వాళ్ళు పంటలు ఎందుకు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే పైన మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మాకు నీళ్లు వదులుతాడని ఆంధ్రా ప్రజలకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు ధైర్యంగా పంటలు వేస్తున్నారన్నారు. ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా అన్నారు.
Anji
రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చింది రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్ నీనో ఉందని ఆంధ్రా ప్రజలకు తెలియదా, మరి వాళ్ళు పంటలు ఎందుకు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే పైన మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మాకు నీళ్లు వదులుతాడని ఆంధ్రా ప్రజలకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు ధైర్యంగా పంటలు వేస్తున్నారన్నారు. ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా అన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబ్ నగర్ లో గ్రాండ్ గా ప్రారంభమైన ఎఫ్.కె డెంటల్ కేర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎస్ గుట్ట చౌరస్తా వద్ద ఎఫ్.కె డెంటల్ కేర్ ఆసుపత్రి గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఇర్షద్ హుస్సేన్,అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకు వైద్య సేవలను అందించడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.2
- భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు నీటి విడుదల భీమా ఫేజ్-1, స్టేజ్ -1, స్టేజ్ -2 పంప్ హౌస్ లా నుండి దిగువకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల యాత్ర పేరుతో విహారయాత్రలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.1
- తాడూర్ :నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం తప్పదు:సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ తాడూర్ మండలo బలాన్ పల్లి గ్రామంలో ఆనాటి ప్రభుత్వం 1990లో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ హద్దులు జాగాలు చూపించలేదు, నేటికీ ఇలా స్థలాలు ఊహించకపోవడం చాలా బాధాకరమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, అన్నారు, నిరుపేదలకు అండగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎప్పుడు ఉంటుందని అన్నారు, ఇలా జాగాలు ఇచ్చేవరకు సిపిఐ పార్టీ ఎల్లవేళలా ముందుండి పోరాటం చేస్తామని ప్రతి ఒక్కరికి ఇల్లు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే వరకు పోరాటం చేస్తామన్నారు, 1999 సంవత్సరంలో 54 మంది పట్టాలు ఇచ్చారు, అదే మరసటి 2000 సంవత్సరంలో కూడా 54 మందికి పట్టాలిచ్చారు, డబల్ ఇచ్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు, ఇప్పటికైనా 1999లో ఇచ్చిన వారికి ముందుగా ఇచ్చి 2000 సంవత్సరంలో కూడా ఇవ్వాలని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సూర్య శంకర్ గౌడ్, విద్యా శ్రీనివాసులు, మారేడు శివశంకర్, సిపిఐ తాడూరు మండల సహాయ కార్యదర్శి దాంగడ్ల వెంకటస్వామి, సిపిఐ గ్రామ నాయకులు ఈర్ల నారాయణ, కొండన్న గౌడ్, గ్రామ నాయకులు అగ్నివేష్, గిరి, బాలస్వామి, భాస్కర్, ప్రభాకర్ ముసలయ్య, గిరి చారి, వెంకటేశ్వరమ్మ,శోభ, శివలీల గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు,1
- వనపర్తి లో స్కూల్స్ వదిలిపెట్టే సమయంలో వర్షం రావడంతో ఇబ్బందులు పడుతున్న స్కూల్ పిల్లలు మరియు ప్రయాణికులు ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు సరిగ్గా స్కూలు విడిచే సమయంలో వర్షం రావడంతో ఇళ్లకు వెళ్లే పిల్లలు మరియు ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వర్షాలు పడటం రైతులకు అనుకూలంగా ఉందని రైతులు తెలిపారు1
- ఈ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న వర్షం ఆనందంలో రైతన్నలు ధరూర్: మండలంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుండి మోస్తారు వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక వ్యవసాయం ముందుకు సాగని క్రమంలో రైతులకు ఉత్సాహాన్ని అందించే విధంగా వర్షం కురవడంతో రైతుల ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నాటిన పత్తి వేరుశనగ పంటలకు నీరు అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో వర్షం కురిసిందని రైతులు తెలిపారు.1
- వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి, బ్యాంకు, రైతు వేదికల ద్వారా రైతులకు యురియా అందించాలి : తెలంగాణ రైతు సంఘం. వికారాబాద్ : వ్యవసాయ ఎరువుల కోసం బుకింగ్ యాప్ రద్దుచేసి pacs రైతు వేదికల నుండి ప్రభుత్వం రైతులకు యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు ప్రభుత్వం సబ్సిడీతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు పంపిణీ చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బుధవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణాలకు వెళ్లి రైతు సంఘం వికారాబాద్ నాయకులు పరిశీలించారు. రైతులు పడుతున్న సమస్యలు తెలుసుకొని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన ఎరువు ధరలు కాకుండా దళారులు తమ ఇష్టానుసారంగా ఏరియాను డిఏపిని అమ్ముతున్నారని ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- మైనంపల్లి హనుమంతరావు టూ ప్లస్ టు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? ఏనుముల తిరుపతి రెడ్డి, ఏనుముల కొండల్ రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్. ఆమెకు గన్‌మెన్లను ఇచ్చారు సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమె గన్‌మెన్లను తీసేశారు జోగు రామన్న మాజీ మంత్రి. ఆయన గన్‌మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్‌మెన్లను ఇచ్చారు ఎందుకు? కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు 2+2 గన్‌మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఇచ్చారు జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా? దీని మీద డీజీపీ సమాధానం చెప్పాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చింది రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా ప్రజలకే నమ్మకం ఎక్కువ వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎల్ నీనో ఉందని ఆంధ్రా ప్రజలకు తెలియదా, మరి వాళ్ళు పంటలు ఎందుకు వేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే పైన మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మాకు నీళ్లు వదులుతాడని ఆంధ్రా ప్రజలకు తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళు ధైర్యంగా పంటలు వేస్తున్నారన్నారు. ఆంధ్రా ప్రజల మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదా అన్నారు.1