Shuru
Apke Nagar Ki App…
SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు బెంగళూరు నియోజకవర్గంలో తొలగింపు? బెంగళూరు నియోజకవర్గంలో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. “ఇక్కడే పుట్టాను.. ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాను. కానీ నా ఓటే తొలగించారు” అని ఆయన పేర్కొన్నారు. ఓటును తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తెలియడం లేదని అన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూ, “వారి తప్పిదాలను ప్రశ్నించడంలో వెనుకాడను” అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇవి ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలు/వ్యాఖ్యలు. ఓటు తొలగింపు కారణాలపై ఎన్నికల అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
KOTAMARTHI HANUMANTHU
SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు బెంగళూరు నియోజకవర్గంలో తొలగింపు? బెంగళూరు నియోజకవర్గంలో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. “ఇక్కడే పుట్టాను.. ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశాను. కానీ నా ఓటే తొలగించారు” అని ఆయన పేర్కొన్నారు. ఓటును తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో కూడా తెలియడం లేదని అన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తూ, “వారి తప్పిదాలను ప్రశ్నించడంలో వెనుకాడను” అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇవి ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలు/వ్యాఖ్యలు. ఓటు తొలగింపు కారణాలపై ఎన్నికల అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- 'గుప్త నిధుల' పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు – నలుగురు నిందితుల అరెస్ట్ హైదరాబాదు:: రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు (04) నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి పలు వాహనాలను మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. *అరెస్టయిన నిందితుల వివరాలు:* మహ్మద్ మునావర్ అలియాస్ మున్నా (36) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: కార్ల డెంటింగ్ & పెయింటింగ్, నివాసం: గుడిమల్కాపూర్, హైదరాబాద్. సయ్యద్ అలీ అష్రఫ్ (40) – తండ్రి: సయ్యద్ మూసా, వృత్తి: ఎలక్ట్రీషియన్, నివాసం: ఫర్హాన్ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ హాజీ (25) – తండ్రి: మహ్మద్ ఖాజా, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బాలాజీ నగర్, జవహర్ నగర్, ECIL, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. మహ్మద్ సల్మాన్ (29) – తండ్రి: మహ్మద్ అన్వర్, వృత్తి: బైక్ మెకానిక్, నివాసం: యాదగిరిపల్లి (గ్రామం), కీసర (మండలం), మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా. *స్వాధీనం చేసుకున్న వస్తువులు:* 02 నాలుగు చక్రాల వాహనాలు (కార్లు) 01 ఆటో రిక్షా 02 మోటార్ సైకిళ్లు 04 సెల్ ఫోన్లు 25 నకిలీ (బంగారు పూత పూసిన) నాణేలు 6 కేజీల బొగ్గు 4 కేజీల మట్టి పూజా సామగ్రి ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర: బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 మోసం (Cheating) కేసు నమోదు. *నేరం చేసిన తీరు (Modus Operandi):* ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్ మరియు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్నుతాడు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ అమాయకులను మోసం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని వివరించాడు. ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను సమీపించి, తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు మరియు నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుండి పరారయ్యేవారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసి, సుమారు రూ. 1 కోటి వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బిఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఇటీవలి కాలంలో కొందరు కేటుగాళ్లు వీధులు, గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని తీసి ఇస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కాబట్టి, సదరు మోసగాళ్లను, వారి మాటలను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇటువంటి అక్రమ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరడమైనది. హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి, సబ్‌ఇన్స్‌పెక్టర్లు కె. మన్సూర్ అలీ, నర్సింగరావు, ఎస్. శేషు, ఇతర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మరియు రాజేంద్రనగర్ పోలీసుల సమన్వయంతో ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది.1
- సండ్రా ఫైబర్ కేటుగాడు పిడమర్తి రవి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మీ అందరికీ ముందు నుంచే నేను హెచ్చరిస్తున్న సండ్ర వెంకట వీరయ్య సైబర్ నేరగాడు సైబర్ కేటు గాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులను జమ చేసుకొని వాళ్ళ ద్వారా ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ పెట్టి ఆ సైబర్ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచి చేసిన గొప్ప పని ఇది. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మద్యం మాఫియా దొంగ నోట్ల ముద్రణ జూదం బెట్టింగ్ అన్ని మాఫియాల వెనుక సండ్ర వెంకట వీర ఉన్నాడు ఆయన పని డబ్బు సంపాదనని ఆయన సత్తుపల్లికి అభివృద్ధి ఆయననే అభివృద్ధి చెందింది ఇటువంటి లోఫర్ పనులు చేసుకుంటా ఈ ప్రాంత యువకులైనటువంటి పట్టాభి ప్రవీణ్ లు కాదు ముందుగా సండ్రా వెంకట వీరిని అరెస్ట్ చేయాలి ఆస్ట్రేలియా ఉంటున్న తన కొడుకుని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకురావాలి పోలీసులు ప్రభుత్వము సండ్ర వెంకటవీరని అరెస్టు చేస్తే మొత్తం నిజ నిజాలు బయటపడతాయి ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సత్తుపల్లి నియోజకవర్గం ముఖం చాట్ చేసిన వీరయ్య నిజంగా సత్తుపల్లి మీద నిజంగా అతని మీద వస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి కి రాకుండా కీరవాణి సంభాషణలు జరుపుతున్నాడు1
- సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలోకి సీపీఐ ప్రజా చైతన్య యాత్ర.. ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ నినాదంతో ముందుకు సాగుతున్న సీపీఐ కొత్తగూడెంలో ‘బద్లావ్ జరూరీ హై.. దేశంలో మార్పు కావాలి’ అనే నినాదంతో కదం తొక్కిన కామ్రేడ్లు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఎరుపెక్కిన కోల్ టౌన్ కొత్తగూడెం.. సీపీఐ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొత్తగూడెంలోకి ప్రవేశించింది. యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. గడ్డం శాంతిప్రియ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ప్రజలు యాత్రకు స్వాగతం పలికి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాకు పూలమాలలు వేసి సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘చేంజ్ ఇండియా.. సేవ్ ఇండియా’ నినాదంతో పాలనలో మార్పు కోసం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో గత ఆరు రోజులుగా ప్రజా చైతన్య యాత్ర 144 కేంద్రాలు, గ్రామాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తూ కొత్తగూడెం చేరుకుందని తెలిపారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతు, కార్మిక, మహిళా, యువజన, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన సమయంలో దేశంలో విద్వేషాలను ప్రోత్సహించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఈ తిరోగమన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సంఘటిత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సాబీర్ పాషా డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించి, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి గ్రామం, మండలానికి అందించాలని కోరారు. జిల్లాలో కొత్త బొగ్గు బావులు ఏర్పాటు చేయాలని, జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనం ఎజెండాను విస్మరించిన పాలకవర్గాలపై ప్రజల తరఫున పోరాటం చేయడమే ఈ ప్రజా చైతన్య యాత్ర లక్ష్యమని తెలిపారు. యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరి పక్షం కాదు.. ప్రజల పక్షం అని సాబీర్ పాషా స్పష్టం చేశారు. ప్రజల మేలు, భద్రత, వారి జీవితాల్లో మార్పు కోసం పోరాట అజెండాతో ఎర్రజెండా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా చైతన్య యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రతి ఒక్కరికీ, యాత్రలో భాగస్వాములవుతున్న ప్రజలకు విప్లవాభివందనాలు తెలిపారు.1
- *నందిగామలో బైక్ దొంగలు హల్చల్..!!*ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:- *నందిగామలో బైక్ దొంగలు హల్చల్..!!* *ఎన్టీఆర్ జిల్లా, నందిగామ:-* నందిగామలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆగస్టు మూడో తారీకున నందిగామ రథం బజార్ సెంటర్లో బైక్ దొంగతనం జరిగిన వైనం. మనసటి మరుసటి రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోని వైనం,కనీసం సిసి ఫుటేజ్ చెక్ చేయటానికి రాని కానిస్టేబుల్ సంతోష్. ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, తూనికిపాడు లో ముసుగు దొంగల హల్చల్ చేస్తుంటే మరోపక్క నందిగామలో దొంగలు బైకు దొంగతనాలు చేస్తుంటే భయపడుతున్న జనం ఇకనైనా పోలీస్ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం!!1
- ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థుల తరలింపుపై తీవ్ర వివాదం నెలకొంది. పరిమితికి మించి ఒకే బస్సులో భారీ సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నారంటూ యుఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. బస్సును అడ్డుకుని విద్యా సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల నుంచి భారీగా బస్సు ఫీజులు వసూలు చేస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని యుఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి సుమారు 100 మందికి పైగా విద్యార్థులను ఒకే బస్సులో తరలించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. ఇదే సమయంలో యుఎస్ఎఫ్ఐ చేసిన నిరసన, ఫిర్యాదుపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన బస్సును అక్కడికక్కడే సీజ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా తనిఖీ చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.4
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్‌లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- 🎂 **జన్మదిన వేడుకలు** 🎂 📍 సత్తుపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్ 3వ వార్డులో గౌరవ సత్తుపల్లి ఎమ్మెల్యే **శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారి జన్మదినం** సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. 🔹 ఈ కార్యక్రమం **సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రవి గారి ఆధ్వర్యంలో** జరిగింది. 🔹 **బొంతు సుమలత గారు** – సత్తుపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 🔹 **చల్లగుళ్ళ కృష్ణయ్య గారు** – సత్తుపల్లి సొసైటీ అధ్యక్షులు 🔹 ** నాగుల నాగేశ్వరరావు** – 3వ వార్డు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 🔹 **ఖమ్మంపాటి కాంతారావు** 🔹 **బీర అబ్బులు** 🔹 **మల్లెల అనిల్** 🔹 **కశిని శ్రీను** 🔹 **జొన్నలగడ్డ రాజు** 🔹 **సాయి శ్రీనివాస్** 🔹 **దాట్ల రాము** 🔹 3వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు 🔹 గ్రామ ప్రజలు 🔹 తదితరులు పాల్గొన్నారు. 🎉💐1
- ఖమ్మం ఏఎంసీ మార్కెట్‌లో సమస్యల కుప్పలు.. చెత్తతో కంపుకొడుతున్న కూరగాయల మార్కెట్ ఖమ్మం జిల్లా మొత్తానికి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ.. ప్రస్తుతం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి ఉండటంతో వ్యాపారులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో తాగునీటి సమస్య కూడా వేధిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నాలుగు మంచినీటి పంపులు పనిచేయకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూరగాయల వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. వేలాది మంది ప్రజలు, వ్యాపారులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన మార్కెట్‌లో కనీస పారిశుధ్య, తాగునీటి వసతులు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పనిచేయని మంచినీటి పంపులను వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు, ప్రజలు కోరుతున్నారు.4
- నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది: ఎమ్మెల్యే కూనంనేని దేశంలో నక్సలైట్లు లేరని సంబరపడుతున్న ప్రధాని మోదీ.. నక్సలైట్ భావజాలం మాత్రం బతికే ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సుజాతనగర్ చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.1