మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు శుక్రవారం గడ్డివాము దగ్ధమైంది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చేసుకుని ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. అకస్మాత్తుగా పిడుగు పడటంతో గడ్డివాముకు మంటలు వ్యాప్తి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. పిడుగు పడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు శుక్రవారం గడ్డివాము దగ్ధమైంది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చేసుకుని ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. అకస్మాత్తుగా పిడుగు పడటంతో గడ్డివాముకు మంటలు వ్యాప్తి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. పిడుగు పడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు.
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు శుక్రవారం గడ్డివాము దగ్ధమైంది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చేసుకుని ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. అకస్మాత్తుగా పిడుగు పడటంతో గడ్డివాముకు మంటలు వ్యాప్తి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. పిడుగు పడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతా నాగులవరం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు శుక్రవారం గడ్డివాము దగ్ధమైంది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చేసుకుని ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు కురిసాయి. అకస్మాత్తుగా పిడుగు పడటంతో గడ్డివాముకు మంటలు వ్యాప్తి చెందాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. పిడుగు పడ్డ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని స్థానికులు తెలిపారు.
- బద్వేలు: “ఈద్-ఉల్-ఫితర్: ఉపవాసం ముగింపు కాదు… సమాజాన్ని కలిపే మానవతా ప్రకటన” ప్రస్తుత కాలంలో సమాజం అనేక విభేదాలు, విరోధాలు, అసహనాలతో పోరాడుతున్న సందర్భంలో, కొన్ని పండుగలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అలాంటి గొప్ప పండుగలలో ఒకటి ఈద్-ఉల్-ఫితర్. ఇది కేవలం ముస్లిం సమాజానికి సంబంధించిన మతపరమైన వేడుకగా పరిమితం కాకుండా, మానవతా విలువలను పునరుద్ధరించే ఒక సామాజిక ప్రకటన గా నిలుస్తుంది. రంజాన్ ఉపవాసాన్ని చాలామంది ఆహారం మానుకోవడంగా మాత్రమే చూస్తారు. కానీ దాని అంతరార్థం మరింత లోతైనది. ఇది ఒక వ్యక్తిని తన లోపాలను ఎదుర్కొనేలా చేస్తుంది. కోపం, అసత్యం, అన్యాయం వంటి దుర్గుణాలను నియంత్రించే సాధనగా పనిచేస్తుంది. అసలు చెప్పాలంటే, రంజాన్ ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు – అది సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా మార్చే ఒక నైతిక శిక్షణ. ఫిత్రా – సమాజంలో అసమానతలకు సవాలు ఈద్ కు ముందు ఇచ్చే ఫిత్రా (Zakat al-Fitr) ఒక సాధారణ దానం కాదు. అది సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలకు ఒక ప్రత్యక్ష సవాలు. పేదవారికి కూడా పండుగ ఆనందం చేరాలి అనే ఆలోచన, ఒక సమాన సమాజ నిర్మాణానికి బలమైన పునాది. ప్రతి వ్యక్తి తన సామర్థ్యానికి అనుగుణంగా పంచుకోవాలి అనే భావన, నేటి సమాజానికి అత్యంత అవసరం. సమాజంలో మూడు పూటలా తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం దీన్ (ధర్మం) ఉద్భోదిస్తూ ఉంది .దీనినే ఫిత్రా దానము అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా పేదలకు ఈ ఫిత్రా దానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రా దానంలో రెండు కిలోల 50 గ్రాములు గోధుమ లను గాని దానికి సమానమైన ఇతర ఆహార ధాన్యాలను గాని దానికి సమానమైన ధనాన్ని గాని పంచి పెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది. దైవప్రవక్త ఫిత్రా దానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటి నుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్ని ఫిత్రా దానం వల్ల క్షమించబడతాయని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు అబ్దుల్లాబీన్ మసూద్ తెలిపారు. ఈద్ – ఐక్యతకు ప్రతీక, విభేదాలకు ప్రత్యామ్నాయం ఈద్ నమాజ్ సమయంలో వేలాది మంది ఒకే చోట, ఒకే వరుసలో నిలబడి ప్రార్థించడం ఒక గొప్ప సామాజిక సందేశం ఇస్తుంది . పండుగ రోజు ముస్లిం సోదరులు ఈద్గాహ్ కు వెళ్లేటప్పుడు "అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లా ఇల్ హంద్"అని తక్బీర్ ను జపిస్తూ వెళతారు. ప్రార్థనకు వెళ్లేటప్పుడు ఒక దారిలోనూ ఇంటికి వచ్చేటప్పుడు మరొక దారిలోనూ రావడం విధాయకం. “మనిషి ముందు మతం కాదు, మానవత్వమే ముఖ్యమైనది.” ఈ దృశ్యం మన సమాజంలో పెరుగుతున్న విభేదాలకు ఒక ప్రత్యామ్నాయం చూపిస్తుంది. ఇంకా ముఖ్యంగా, మన దేశంలో అనేక చోట్ల హిందూ–ముస్లిం సోదరులు కలిసి ఈద్ పండుగను జరుపుకోవడం, ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకోవడం, విందులు పంచుకోవడం వంటి సంప్రదాయాలు మత సామరస్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ సందర్భాలు మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి: “విభజన మనసుల్లో ఉంటుంది… ఐక్యత కూడా అక్కడే మొదలవుతుంది.” శాంతి, సౌభ్రాతృత్వం – కాలానికి అవసరమైన సందేశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసహనం, హింస, విభేదాలు పెరుగుతున్న సమయంలో, ఈద్ పండుగ ఒక శాంతి పిలుపుగా నిలుస్తుంది. ద్వేషానికి బదులు ప్రేమ విభేదాలకు బదులు ఐక్యత స్వార్థానికి బదులు దానం ఈ విలువలు నేటి సమాజానికి అత్యంత అవసరం. రంజాన్ ఉపవాసం శరీరానికి శుద్ధిని ఇస్తే, ఈద్ పండుగ మనసుకు, సమాజానికి శాంతిని అందిస్తుంది. శాస్త్రీయంగా ఉపవాసం ఆరోగ్యానికి ఉపయోగకరమైతే, సామాజికంగా ఇది సమానత్వం, సహానుభూతిని పెంచుతుంది. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈద్ పండుగ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను వేస్తుంది: “మన ఆనందంలో ఇతరుల భాగస్వామ్యం ఎంత?” మన పండుగలు, మన సంపద, మన సంతోషం – ఇవన్నీ ఇతరులతో పంచుకున్నప్పుడు మాత్రమే నిజమైన అర్థం పొందుతాయి. పండుగకు మించిన పాఠం ఈద్-ఉల్-ఫితర్ ఒక రోజు జరుపుకునే పండుగ మాత్రమే కాదు. అది ఒక జీవన విధానం. ఉపవాసం ద్వారా నియమం నేర్పి, ఫిత్రా ద్వారా దానం నేర్పి, ఈద్ ద్వారా ఐక్యతను బోధించే ఒక సమగ్ర జీవన పాఠం. ఈ పండుగ మనకు చెబుతున్నది ఒకటే: “మతం వేరు కావచ్చు… కానీ మానవత్వం ఒక్కటే.” “సమాజాన్ని కలిపే ప్రతి అడుగు… అదే నిజమైన పండుగ.” ఈద్ ముబారక్!4
- vempalle1
- మొదటి మసీదులో ఇఫ్తార్ విందు.. ఇఫ్తార్ విందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ముస్లిం సోదరులు. విడవలూరు మండలం ముదివర్తి లోని మసీదు స్థానిక టిడిపి నేత ఎస్ కే రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం యువత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహాయ సహకారంతో టిడిపి నేత రఫీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం యువత నాయకులు పాల్గొన్నారు.8
- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము ముస్లింలు రంజాన్ మాసాన్ని, ఈద్-ఉల్-ఫితర్ పండుగను ఈద్గా సమీపములో నమాజ్ చేసుకొని పెద్దల దువా (ఆశీర్వాదం) తీసుకొని అక్కడ పేద ముస్లింలకు జకాత్ ఇస్తారు. జకాత్ అంటే వారు సంపాధించిన డబ్బుల్లో కొంత డబ్బును పేదలు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ప్రతీఒక్క ముస్లింలు సుఖసంతోషాలతో జరుపుకోవడానికి ఇస్లాంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారికి జకాత్ఇ స్తారణి పెద్దలు చెపుతుంటారు . ఇంకా కొందరు అవసరానికి మించి ధనం, ఆస్తులు ఉన్నవారు, స్థితిమంతులు పేదలకు విధిగా దానధర్మాలు చేయాల్సి ఉంటుందని దీన్నే 'జకాత్' అని అంటారని, తమ అవసరాలు తీరగా అదనపు ఆదాయం, ధనం, సంపద, ఆభరణాల విలువపై తప్పనిసరిగా జకాత్ చేయాలని . సంపదలో నుంచి రెండున్నర శాతం లెక్కకట్టి ధన, వస్తు రూపంలో దానం చేస్తారణి, రంజాన్లో దాన, ధర్మాలు చేస్తే అధికంగా పుణ్యం లభిస్తుందని ఎక్కువ మంది ఈ మాసంలోనే జకాత్ చేసేందుకు ఇష్టపడతారని పెద్దల ఆచారం ప్రకారం ఈద్-ఉల్-ఫితర్ చేస్తామని అలాగే పేద అయిల పెళ్లిళ్లకై జోలే పట్టుకొని ప్రతీఒక్క ముస్లింతో డబ్బులు యాచిస్తారని ఆ డబ్బులతో పేద అమ్మాయిల పెళ్లిళ్లకు ఇస్తారని అంటున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , గద్వాల శ్యాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రిజ్వాన్ భాష షేక్ , జిల్లా కలెక్టర్. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎమ్ ఎల్ ఎ.3
- అనంతపురం నగరంలో 50 వ డివిజన్ లో చెత్త, ప్లాస్టిక్ కొన్ని నెలలుగా కలుస్తున్న పట్టించుకొని అధికారులపై ప్రజల ఆగ్రహం నగరంలో విచ్చలవిడిగా చెత్తను కాలుస్తూ ఉన్నా ఏ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోక పోవడం శోచనీయం1
- కదిరి పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలో వేలాదిమంది కలిసి సామూహిక ప్రార్ధనలు చేశారు. నెల రోజులు ఉపవాస దీక్షలతో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మత పెద్దలు దువా ప్రార్ధనలు చేశారు. ఈగ పరిసర ప్రాంతాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మైనార్టీ సోదరులు ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.1
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో అవని గోల్డ్ భూ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎమ్మెల్యే పార్థసారథిపై సంచలన ఆరోపణలు చేశారు. 50 ఎకరాల భూమిని తన అనుచరుల పేర్లకు రాయాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, అంగీకరించకపోవడంతో ప్రశాంత్ పేరుతో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆరోపించారు. న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల శ్యాసన సభ్యులు నేడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు . పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర 30 రోజుల ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని అన్నారు. చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ ల్లో ఒకటి రంజాన్ పండుగ అని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు మరియు అల్లా దీవెనలతో ప్రజలకు సకల సౌభాగ్యాలు, సకాలంలో వర్షాలు పడాలి రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని , అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరొకసారి ముస్లిం సోదరులకు రంజాన్ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.1