logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు....217 సెంటర్లలో పరీక్షలు రాస్తున్న 40 వేల మంది విద్యార్థులు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు....217 సెంటర్లలో పరీక్షలు రాస్తున్న 40 వేల మంది విద్యార్థులు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం

12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి

ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69

పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల  కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు  అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    1
    మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం  మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు. అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా, బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
    5
    వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ఆయుష్ వైద్య సంస్థల్లో మందుల నాణ్యత, నిరంతర సరఫరాపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాల్లో వరంగల్‌లోని ప్రభుత్వ ఆయుష్ కేంద్రాల్లో మందుల నాణ్యతపై ఎలాంటి తనిఖీలు నిర్వహించారో వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖను ఎంపీ కోరారు.అలాగే ఆయుష్ వైద్య కేంద్రాల్లో సరఫరా అయ్యే మందులపై సంవత్సరం వారీగా చేసిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, పరీక్షల ఫలితాలు, నాసిరకం లేదా నకిలీగా తేలిన మందుల వివరాలు తెలియజేయాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని తయారీదారులు లేదా సరఫరాదారులపై తీసుకున్న చర్యలు లైసెన్స్ సస్పెన్షన్, రద్దు, బ్లాక్‌లిస్టింగ్, బకాయిల వసూళ్లు, కేసులు నమోదు వంటి చర్యలపై వివరాలు కోరారు.
అదేవిధంగా, ఆయుష్ మందుల కొరత లేకుండా ఉండేందుకు నేషనల్ ఆయుష్ మిషన్ (NAM) లేదా ఇతర కేంద్ర పథకాల కింద డిజిటల్ స్టాక్ మానిటరింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నారా అనే అంశంపై కూడా ఎంపీ ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ మాట్లాడుతూ ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని తెలిపారు. తెలంగాణలోని వరంగల్ సహా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయుష్ ఆసుపత్రులకు నాణ్యమైన మందుల సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఆయుష్ విభాగం ద్వారా మందుల నమూనాలను యాదృచ్ఛికంగా,  బ్యాచ్ వారీగా సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మందులనే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యతలో లోపాలు తేలితే సరఫరాదారులు తమ ఖర్చుతోనే మందులను వెనక్కి తీసుకుని కొత్తవి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.
అలాగే తెలంగాణలో ఈ-ఔషధి (e-Aushadhi) డిజిటల్ వ్యవస్థను అమలు చేసి ఆయుష్ మందుల నిల్వలు, సరఫరాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు లేదా వైద్యాధికారులు ఈ వ్యవస్థ ద్వారా మందుల కోసం ఇండెంట్ పెట్టే అవకాశం ఉందని, స్టాక్ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో అక్రమాలు, కొరతలను నివారించవచ్చని పేర్కొన్నారు.
వరంగల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ వైద్య వ్యవస్థ బలోపేతంపై ఎంపీ డా. కడియం కావ్య నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    19 hrs ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు.
మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు
    1
    గ్యాస్ కొత్తగా ఉందని చాలామంది రెండు లేదా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారు అలా అక్కర్లేదు డొమెస్టిక్ సిలిండర్లకు ఎటువంటి కోరతలేదు మీరు ఎటువంటి చింత చేయనక్కర్లేదు ఎవరైనా ఇంతకుముందు లాగానే బుక్ చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    1
    హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు.
రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.
    1
    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర  ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో  కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో  పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
  • Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    1
    Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    1
    పదవ తరగతి పరీక్ష కేంద్రాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.