Shuru
Apke Nagar Ki App…
ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిపై ఎస్ఐ ఆగ్రహం.. “రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరింపు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
M D Azizuddin
ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిపై ఎస్ఐ ఆగ్రహం.. “రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరింపు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా: ఖిలావరంగల్ మండలం మామునూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఎదురుగా వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులను శ్రీపతి వంశీ మరియు శ్రీపతి రాజుగా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.1
- ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.6
- హనుమకొండలోని భద్రకాళి చెరువు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి పూడికతీత పనులను ప్రారంభించారు. రూ.16.10 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను మే 15లోగా పూర్తి చేయాలని అధికారులు కు సూచించారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రకాళి చెరువు సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో రూ.9 కోట్లతో ప్రారంభించిన పనులు పూర్తిస్థాయిలో సాగకపోవడంతో ఇప్పుడు సమగ్రంగా పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. భద్రకాళి ఆలయాన్ని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఆలయం నుంచి చెరువు బండ్ వరకు గ్లాస్ వంతెన నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రకాళి చెరువులో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, బుర్కా వంశీయుల ఇలవేలుపు అయిన గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ‘చిట్టి పండుగ’గా పిలువబడే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా బుర్కా వంశీయుల ఆచారాల ప్రకారం ఈ జాతర మూడు రోజుల పాటు సాగుతుంది. మొదటి రోజు నుండే భక్తులు భారీ సంఖ్యలో కిష్టాపురం గ్రామానికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాల మధ్య ఆదివాసీలు తమ ఇలవేలుపును కొలుస్తున్నారు. ముసలమ్మ పెద్ద కుమారుడిని దర్శించుకుని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. పూజారులు (వడ్డేలు) అత్యంత నిష్టతో పురాతన పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు తరలివచ్చారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో పాటు గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ననిలుస్తున్నాయి అడవి తల్లి ఒడిలో, ప్రకృతి సాక్షిగా జరుగుతున్న ఈ జాతరతో కృష్ణపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.1
- ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు1
- పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.4
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండలో సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి.. నల్గొండ సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ! యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపు... మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుంది... మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు... ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచన... సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని సూచన... నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యం... నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్,న్యాక్ సెంటర్ ఏర్పాటు... సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తాం... *రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.*☝️1
- జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో యశస్విని రెడ్డి నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి భవన భూమిపూజ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాల క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన భూమిలో భవనం నిర్మాణం ఎలా చేస్తారని స్థానికులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఘటనను వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే పీఏ రాజేష్ గౌడ్ ఫోన్ లాక్కున్నారని స్థానికులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నించగా అక్కడే ఉన్న ఎస్ఐ దూలం పవన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “మీ మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తా” అంటూ బెదిరించారని తెలిపారు. మంచి కోసం ప్రశ్నించిన తమను బెదిరించిన ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1