చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష.... చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశమందిరం లో ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ పాల్గొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధి లోని నీటి వనరు లైన చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ముందుగా అంచనా, ప్రణాళిక – నీటి నాణ్యత, కాలుష్య మూలాలు, సిల్ట్ పేరుకుపోవడం, జీవ వైవిధ్యాన్ని పరిశీలించి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ,మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా ఇంటర్‌సెప్షన్,డైవర్షన్ డ్రెయిన్లు, సీవేజ్ నెట్‌వర్క్, ఎస్ టి పి ల ఏర్పాటు ద్వారా నియంత్రించవచ్చని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో కుడా సి పి ఓ అజిత్ రెడ్డి అదనపు కలెక్టర్ రవి బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఆర్ డి ఓ రాథోడ్ రమేష్ ఇరిగేషన్, కుడా , బల్దియా ఈ ఈ లు కిరణ్ కుమార్ భీమ్ రావు మహేందర్ సంతోష్ బాబు ఇరిగేషన్ డి ఈ హర్షవర్థన్ ఎన్ ఐ టి మాజీ ప్రొఫెసర్ పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష.... చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ
పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశమందిరం లో ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ పాల్గొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధి లోని నీటి వనరు లైన చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ముందుగా అంచనా, ప్రణాళిక
– నీటి నాణ్యత, కాలుష్య మూలాలు, సిల్ట్ పేరుకుపోవడం, జీవ వైవిధ్యాన్ని పరిశీలించి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ,మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా ఇంటర్‌సెప్షన్,డైవర్షన్ డ్రెయిన్లు, సీవేజ్ నెట్‌వర్క్, ఎస్ టి పి ల ఏర్పాటు ద్వారా నియంత్రించవచ్చని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో కుడా సి పి ఓ అజిత్
రెడ్డి అదనపు కలెక్టర్ రవి బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఆర్ డి ఓ రాథోడ్ రమేష్ ఇరిగేషన్, కుడా , బల్దియా ఈ ఈ లు కిరణ్ కుమార్ భీమ్ రావు మహేందర్ సంతోష్ బాబు ఇరిగేషన్ డి ఈ హర్షవర్థన్ ఎన్ ఐ టి మాజీ ప్రొఫెసర్ పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దారుణానికి పాల్పడ్డాడు,తనకు మందు పెడుతుందనే అనుమానంతో చివరకు గొడ్డలితో దాడి చేసి భార్యను హత్య చేసిన ఘటన భూపాలపల్లి మండలం పెద్దాపూర్ లో తీవ్ర కలకలం రేపింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య భార్య సంధ్య కాపురం మొదట్లో సాఫీగా సాగినా కూడా ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి..భర్త సమ్మయ్య భార్య పై అనుమానం పెంచుకోవడం మొదలు పెట్టాడు.కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ పుట్టింట్లో నివసిస్తున్న మహిళను, మూడు నెలల తర్వాత ఇటీవల సమీప బంధువు మరణించడంతో భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిసింది.ఈ క్రమం లో భార్యను గొడ్డలి తో నరికి హత్య చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.అనంతరం హత్య చేసిన సమ్మయ్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగి పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.1
- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని గురువారం నాడు రోడ్డెక్కి ఆందోళన దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకట్రామ జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలమును వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తూ వెంకట్రామ జంక్షన్ వద్ద రాస్తా రోకో చేపట్టారు భారీగా నిలిచిన ట్రాఫిక్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని అవి ఇప్పటికీ నెరవేర్చలేదని కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వెంటనే కార్మికులకు 200 గజాల నివాసస్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలో సంచలనం సృష్టించిన ఆర్‌ఎంపి వైద్యుడిపై దాడి చేసి కళ్ళలో కారం చల్లి చైన్ స్నాచింగ్ పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నేరానికి పాల్పడిన మైనర్ బాలుడితో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టు అయిన వారిని కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన తమ్మనవేని కొమురయ్య ఆర్‌ఎంపిగా పనిచేస్తున్నారు. అతనిపై ఈనెల 11న రాత్రి దారి దోపిడికి పాల్పడిన ముఠాను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడితో పాటు గుండ్లపల్లికి చెందిన పెనుగొండ అబినైజర్, పంబాల నాగరాజు, నుస్తులాపూర్ కు చెందిన మాచర్ల రామ్ చరణ్ గౌడ్, పెద్దపల్లి జిల్లా బొట్లవనపర్తికి చెందిన గుజ్జేటి మధువర్ధన్ ఐదుగురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడ్డారు. గతంలో అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారు డ్యామేజీకి సంబంధించి యజమానికి చెల్లించాల్సిన 40 వేల కోసం దొంగతనానికి పథకం వేశారు. ఒంటరిగా తిరిగే ఆర్ఎంపి కొమురయ్య మెడలోని బంగారు గొలుసును లక్ష్యంగా చేసుకుని 11న కరీంనగర్‌లో ఒక స్విఫ్ట్ డిజైర్ కారును అద్దెకు తీసుకుని మాటు వేశారు. నేదునూర్ నుండి తన మోటార్ సైకిల్‌పై ఆర్ఎంపీ వస్తుండగా, నిందితులు కారులో వెంబడించారు. నేదునూర్ శివారులోని మామిడి తోట వద్ద అతడిని అడ్డుకుని, కళ్ళలో కారం చల్లి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఆయన మెడలోని తులం బంగారు గొలుసు, 1,000/-నగదు దోచుకుని పరారయ్యారు. దారి దోపిడీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ దర్యాప్తు చేపట్టి మైనర్ బాలుడితో పాటు అబినైజర్, నాగరాజు, రామ్ చరణ్ గౌడ్, గుజ్జేటి మధువర్ధన్ ను అరెస్టు చేశామని సిపి తెలిపారు. ముఠా సభ్యులు కోహెడ మండలంలో ఒక కరెంటు మోటారు దొంగతనం చేసినట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక తులం బంగారు గొలుసు, 4 మొబైల్ ఫోన్లు, 1,000/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి చెప్పారు.3
- మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో *జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్,* అదనపు కలెక్టర్ రెవెన్యూ అనిల్ కుమార్, సివిల్ సప్లై, గ్యాస్ డీలర్స్, విద్యాశాఖ, హాస్పటల్ సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరా పై *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,* సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం (11) ఏజెన్సీల పరిధిలో 2,12131 గ్యాస్ కనెక్షన్లు కలవని, గతవారం రోజుల నుండి పైన తెలిపిన 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 13985 సిలిండర్ల వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగిందని, డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో సిద్ధంగా ఉన్నాయన్నారు, అనవసరంగా ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, డిమాండ్ కనుగుణంగా గ్యాస్ లభ్యత ఉందని, తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న స్టాకును గమనిస్తూ ఉండాలని వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకము కలిగించినట్లయితే, అలాంటి వినియోగదరులపైన కూడా చట్టపరముగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో, గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్* మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఏట్టి పరిస్థితిలలో అలాంటి వార్తలను నమ్మ వద్దని తెలిపారు, ప్రభుత్వం సూచించిన ప్రకారం 25 రోజుల అనంతరం మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని, గ్యాస్ సరఫరా చేసే వాహనాలను సిబ్బందిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ తెలిపారు,1
- Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్1
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది: : హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష.... చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ జాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మినీ సమావేశమందిరం లో ఇరిగేషన్,రెవెన్యూ, జీ డబ్ల్యూ ఎం సి, కుడా ఇండస్ట్రీస్ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో కలెక్టర్ పాల్గొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధి లోని నీటి వనరు లైన చెరువులు కుంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ముందుగా అంచనా, ప్రణాళిక – నీటి నాణ్యత, కాలుష్య మూలాలు, సిల్ట్ పేరుకుపోవడం, జీవ వైవిధ్యాన్ని పరిశీలించి దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని ,మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చెరువులోకి రాకుండా ఇంటర్‌సెప్షన్,డైవర్షన్ డ్రెయిన్లు, సీవేజ్ నెట్‌వర్క్, ఎస్ టి పి ల ఏర్పాటు ద్వారా నియంత్రించవచ్చని ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో కుడా సి పి ఓ అజిత్ రెడ్డి అదనపు కలెక్టర్ రవి బల్దియా సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ ఆర్ డి ఓ రాథోడ్ రమేష్ ఇరిగేషన్, కుడా , బల్దియా ఈ ఈ లు కిరణ్ కుమార్ భీమ్ రావు మహేందర్ సంతోష్ బాబు ఇరిగేషన్ డి ఈ హర్షవర్థన్ ఎన్ ఐ టి మాజీ ప్రొఫెసర్ పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు.4
- హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామంలోని డి–8 కెనాల్ ను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించారు. , సింగారం వద్ద కెనాల్ గెట్ కింద వెల్డింగ్ చేయడం కారణంగా సంగెం మండలంలోని ఆశాలపల్లి, గవిచర్ల, రామచంద్రపురం, షాపురం, కొత్తగూడెం గ్రామాలకు కెనాల్ నీరు అందడం లేదని ఇట్టి విషయాన్ని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే రేవూరి పరిశీలించి వెంటనే ఈ గ్రామాల రైతుల పంటలకు కనీసం నీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.2
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు రోడ్డెక్కారు. ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పిస్తామని చెప్పిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రస్తుతం తమ గోడు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో 7 ట్రాక్టర్లలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఎన్నికల ముందు నెలకు ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హనుమాన్ గుడి సాక్షిగా హామీ ఇచ్చారని రెండున్నర ఏళ్ళు కావస్తున్న ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మళ్ళీ వర్షాకాలం ఆరంభం అయితే ప్రతి ఇంటిలోకి నీరు చేరుతోందని, తక్షణమే ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉధృతం చేసి నారాయణపూర్ రిజర్వాయర్ కట్టకు గండి పెడతామని హెచ్చరించారు.1