లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్.. ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిగా గుర్తించిన కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలు (48)ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌తో పాటు OPPO సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సోమవారం వెల్లడించారు. పదేళ్లుగా సహజీవనం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందిన చింతకుంట చంద్రవ్వ కుమార్తె గత పదేళ్లుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలుతో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా మృతురాలు హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సాయిలు తన గ్రామానికి రావాలని ఆమెను పలుమార్లు కోరినట్లు, రాకపోతే చంపేస్తానని ఫోన్‌లో బెదిరించినట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పొలానికి వెళ్తున్నట్లు చెప్పి.. భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి సెప్టెంబర్ 18న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు మృతురాలు గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నాగారం గ్రామ శివారులో ఆమె తలకు బలమైన గాయాలతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందింది. దీంతో మృతురాలి తల్లి చంద్రవ్వ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయిలుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. భూమి డబ్బుల విషయంలో ఘర్షణ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 19న ఉదయం సుమారు 11 గంటలకు భూమికి సంబంధించిన డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లాడు. అక్కడ జుబేర్ అనే వ్యక్తితో ఆమెను మాట్లాడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పొలం వద్ద ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కీలక ఆధారాలు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉందని వెల్లడించారు. పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు కేసును సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

- ఆదర్శ కాలనీలో బాల గణేష్ ఉత్సవాలకు కాసుల బాలరాజ్ దర్శనం పూజల్లో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరణ – నిత్య అన్నదానంతో భక్తుల రద్దీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. మండలి సభ్యులు ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. గణేశునికి నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు కార్యక్రమానికి మరింత భక్తిమయ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అబ్దుల్ ఖలేఖ్, సూరి ,మహమ్మద్ గౌస్, సీనియర్ కార్యకర్తలు, గణేష్ భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- కుకూనూర్ గ్రామటంలోస్టోన్ క్రషర్ ఏర్పాటు చేయవద్దు మూడు గ్రామస్తుల రైతులు ప్రజాప్రతినిధులు కలెక్టర్కు వినతి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ ప్రతిమా సింగ్ సింగును కలెక్టర్ ఛాంబర్ లో కలిసి సుమారు 20 సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్ పద్మాసింగ్ పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డి విలేకరులత మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో దేవుని బండపై నెలకొల్ తమన్నా స్టోన్ నిలిపివేయాలని కోరుతూ మూడు గ్రామాల ప్రజలు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని వినతిపత్రం సమర్పించారు ఎమ్మెల్యే సునీత రెడ్డి గ్రామస్తుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్టోన్ క్రషర్ అనుమతి నిలిపివేయాలని గ్రామస్తులతోపాటు ఎమ్మెల్యే కోరారు ఈ మేరకు కలెక్టర్ స్పందించి అనుమతులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిపారు1
- చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- బాసర IIIIT విద్యార్థుల్లో ఆందోళన..సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థుల పై IIIT కళాశాల అధికారుల ఆంక్షలు.. మండిపడుతున్న TSAS... బాసర ఐఐఐటి లో రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులపై కళాశాల అధికారులు ఆంక్షలు విధించారు. గతం లో ఎన్నడూ లేని విధంగా కొత్తగా రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష రోజే హాజరు కావాలని, ఒక్క రోజు ముందు రావద్దని, పరీక్ష కాగానే హాస్టల్ రూమ్ ఖాళీ చేయాలని పలు సూచనలతో కూడిన ఆంక్షలు జారీ చేశారు. దీంతో TSAS, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తపరచాయి. వెంటనే అధికారుల ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు...1
- వినాయక మండపాలను సందర్శించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే సిరిసిల్ల పట్టణంలోని పలు వినాయక మండపాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.1
- సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.1
- లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్.. ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిగా గుర్తించిన కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలు (48)ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌తో పాటు OPPO సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సోమవారం వెల్లడించారు. పదేళ్లుగా సహజీవనం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందిన చింతకుంట చంద్రవ్వ కుమార్తె గత పదేళ్లుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలుతో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా మృతురాలు హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సాయిలు తన గ్రామానికి రావాలని ఆమెను పలుమార్లు కోరినట్లు, రాకపోతే చంపేస్తానని ఫోన్‌లో బెదిరించినట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పొలానికి వెళ్తున్నట్లు చెప్పి.. భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి సెప్టెంబర్ 18న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు మృతురాలు గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నాగారం గ్రామ శివారులో ఆమె తలకు బలమైన గాయాలతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందింది. దీంతో మృతురాలి తల్లి చంద్రవ్వ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయిలుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. భూమి డబ్బుల విషయంలో ఘర్షణ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 19న ఉదయం సుమారు 11 గంటలకు భూమికి సంబంధించిన డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లాడు. అక్కడ జుబేర్ అనే వ్యక్తితో ఆమెను మాట్లాడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పొలం వద్ద ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కీలక ఆధారాలు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉందని వెల్లడించారు. పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు కేసును సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.1