logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Sraya
Sraya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
1 hr ago

చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత
చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది.. ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.
    2
    రేవంత్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్
హైదరాబాద్ :
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. 
ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది..
ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.
    user_RP Journalist
    RP Journalist
    Local News Reporter అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    37 min ago
  • ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 50 గంటల పాటు కళా జాతర నిర్వహణ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ ప్రజా కళా జాతరకు సన్నాహాలు 50 గంటల పాటు కళా జాతర నిర్వహణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ లో కరపత్రం విడుదల. మెదక్, సెప్టెంబర్ 21: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ విమలక్క ఐదు దశాబ్దాల ప్రస్థానంలో పాడిన పాటలను ఆలపిస్తూ, ఆమెతో గొంతు కలిపి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా మండపం, బాగ్‌లింగంపల్లిలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు ప్రజా కళా జాతర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, రమేష్, శ్రీనివాస్, మల్లేశం, గోపాల్, సూరంపల్లి మహేందర్, పీడీఎస్‌యూ విజృంభణ విద్యార్థి నాయకుడు మహేష్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 50 గంటల పాటు కళా జాతర నిర్వహణ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ 
ప్రజా కళా జాతరకు సన్నాహాలు
50 గంటల పాటు కళా జాతర నిర్వహణ
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ లో కరపత్రం విడుదల.
మెదక్, సెప్టెంబర్ 21: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ విమలక్క ఐదు దశాబ్దాల ప్రస్థానంలో పాడిన పాటలను ఆలపిస్తూ, ఆమెతో గొంతు కలిపి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా మండపం, బాగ్‌లింగంపల్లిలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు ప్రజా కళా జాతర కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, రమేష్, శ్రీనివాస్, మల్లేశం, గోపాల్, సూరంపల్లి మహేందర్, పీడీఎస్‌యూ విజృంభణ విద్యార్థి నాయకుడు మహేష్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    53 min ago
  • బీఆర్ఎస్ నేతల గత పేదరికంపై సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్! బీఆర్ఎస్ నేతల గత ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుటుంబం గతంలో సాధారణ జీవితం గడిపినా, నేడు లక్షల కోట్లకు పడగలెత్తారంటూ నెటిజన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    1
    బీఆర్ఎస్ నేతల గత పేదరికంపై సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్!
బీఆర్ఎస్ నేతల గత ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుటుంబం గతంలో సాధారణ జీవితం గడిపినా, నేడు లక్షల కోట్లకు పడగలెత్తారంటూ నెటిజన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి - కేటీఆర్
    1
    అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ 
మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు
మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు
రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి
ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో
ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము
మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి
- కేటీఆర్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    2 hrs ago
  • వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    1
    వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం 
వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్ట్.. ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిగా గుర్తించిన కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలు (48)ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌తో పాటు OPPO సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సోమవారం వెల్లడించారు. పదేళ్లుగా సహజీవనం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందిన చింతకుంట చంద్రవ్వ కుమార్తె గత పదేళ్లుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలుతో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా మృతురాలు హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సాయిలు తన గ్రామానికి రావాలని ఆమెను పలుమార్లు కోరినట్లు, రాకపోతే చంపేస్తానని ఫోన్‌లో బెదిరించినట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పొలానికి వెళ్తున్నట్లు చెప్పి.. భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి సెప్టెంబర్ 18న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు మృతురాలు గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నాగారం గ్రామ శివారులో ఆమె తలకు బలమైన గాయాలతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందింది. దీంతో మృతురాలి తల్లి చంద్రవ్వ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయిలుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. భూమి డబ్బుల విషయంలో ఘర్షణ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 19న ఉదయం సుమారు 11 గంటలకు భూమికి సంబంధించిన డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లాడు. అక్కడ జుబేర్ అనే వ్యక్తితో ఆమెను మాట్లాడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు చేరుకున్నారు. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పొలం వద్ద ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కీలక ఆధారాలు స్వాధీనం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉందని వెల్లడించారు. పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు కేసును సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    1
    లింగంపేట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్ట్.. ఇనుప రాడ్, సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు స్వాధీనం
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిగా గుర్తించిన కొరుపోలు గ్రామానికి చెందిన గుట్టమీది సాయిలు (48)ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌తో పాటు OPPO సెల్‌ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు సోమవారం వెల్లడించారు.
పదేళ్లుగా సహజీవనం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం కొరుపోలు గ్రామ శివారులోని నాగారం గ్రామానికి చెందిన చింతకుంట చంద్రవ్వ కుమార్తె గత పదేళ్లుగా కొరుపోలుకు చెందిన గుట్టమీది సాయిలుతో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా మృతురాలు హైదరాబాద్‌లోని గుండ్లపోచమ్మ ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో సాయిలు తన గ్రామానికి రావాలని ఆమెను పలుమార్లు కోరినట్లు, రాకపోతే చంపేస్తానని ఫోన్‌లో బెదిరించినట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
పొలానికి వెళ్తున్నట్లు చెప్పి..
భూమికి సంబంధించిన డబ్బులు వస్తాయని, పొలానికి మందు చల్లించాల్సి ఉందని చెప్పి సెప్టెంబర్ 18న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు మృతురాలు గుండ్లపోచమ్మ నుంచి బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నాగారం గ్రామ శివారులో ఆమె తలకు బలమైన గాయాలతో రక్తస్రావమై మృతి చెందినట్లు సమాచారం అందింది. దీంతో మృతురాలి తల్లి చంద్రవ్వ లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయిలుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు.
విచారణలో మృతురాలిపై ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
భూమి డబ్బుల విషయంలో ఘర్షణ
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 19న ఉదయం సుమారు 11 గంటలకు భూమికి సంబంధించిన డబ్బుల విషయమై నిందితుడు మృతురాలిని తన ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి తీసుకెళ్లాడు. అక్కడ జుబేర్ అనే వ్యక్తితో ఆమెను మాట్లాడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ తిరిగి మృతురాలి పొలం వద్దకు చేరుకున్నారు.
సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పొలం వద్ద ఇద్దరూ మాట్లాడుకుంటుండగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో మృతురాలిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కీలక ఆధారాలు స్వాధీనం
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి ఒక OPPO సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, రక్తపు మరకలున్న అంగి (దుస్తులు) స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ప్రస్తుతం నేర విచారణలో ఉందని వెల్లడించారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
కేసును సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా ఛేదించడంలో కృషి చేసిన ఎల్లారెడ్డి సీఐ డి. రాజారెడ్డి, లింగంపేట్ ఎస్సై పి. దీపక్ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, IPS అభినందించారు. కేసు దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేసి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.