Shuru
Apke Nagar Ki App…
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు. బుధవారం జిల్లాలో పర్యటిస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీకి సహకరించిన రామజ్యసభ సభ్యులు వద్దిరాజు
VANAMA SRINIVAS RAO
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు. బుధవారం జిల్లాలో పర్యటిస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీకి సహకరించిన రామజ్యసభ సభ్యులు వద్దిరాజు
More news from తెలంగాణ and nearby areas
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు. బుధవారం జిల్లాలో పర్యటిస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీకి సహకరించిన రామజ్యసభ సభ్యులు వద్దిరాజు1
- బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ – XII కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. 2026 జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టి మొత్తం 38 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించామని, వారిలో 33 మంది బాలురు, 5 మంది బాలికలు ఉన్నారని వెల్లడించారు. వీరిలో 14 సంవత్సరాల లోపు 4 మంది, 14 సంవత్సరాల పైబడిన 34 మంది చిన్నారులు ఉన్నారని వివరించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై మొత్తం 18 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.1
- కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. బుధవారం ఏలూరు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని ఎద్దేవా చేశారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో ఈరోజు రైతు వేదికలో ఏఈఓ ఆబిద్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్లలో Fertilizer యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విధానాన్ని వివరించారు. యాప్ వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామానికి చెందిన రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.3
- ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.10
- పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్1
- తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం అయ్యగారి పల్లి సమీపం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హచ్యా అనే వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో హత్య అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు1