logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.177 కోట్లతో తాగునీటి వసతుల అభివృద్ధి చేపడుతుండగా, జగనన్న లేఅవుట్, మోడల్ స్కూల్ పరిసరాల్లో రూ.4 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. 5.5 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా వెయ్యికి పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 11,500 ఇళ్లకు ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూరు, కనిగిరి, కాశిరెడ్డి కాలనీ, ఎం.ఎన్.ఎం. కళాశాల సమీపంలో నాలుగు ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులకు అనుమతులు మంజూరు కాగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రామతీర్థం రిజర్వాయర్ నీటిని వినియోగించడంతో పాటు, భవిష్యత్‌లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కనిగిరి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.

2 hrs ago
user_Munna
Munna
కనిగిరి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.177 కోట్లతో తాగునీటి వసతుల అభివృద్ధి చేపడుతుండగా, జగనన్న లేఅవుట్, మోడల్ స్కూల్ పరిసరాల్లో రూ.4 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. 5.5 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా వెయ్యికి పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 11,500 ఇళ్లకు ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూరు, కనిగిరి, కాశిరెడ్డి కాలనీ, ఎం.ఎన్.ఎం. కళాశాల సమీపంలో నాలుగు ఓహెచ్‌ఆర్‌ఎస్‌ ట్యాంకులకు అనుమతులు మంజూరు కాగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రామతీర్థం రిజర్వాయర్ నీటిని వినియోగించడంతో పాటు, భవిష్యత్‌లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కనిగిరి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.

  • user_Marella Krishna Reddy
    Marella Krishna Reddy
    కనిగిరి, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్
    కంగ్రాట్స్ సార్
    44 min ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ.. మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం పల్లకిసేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
    1
    మహానంది క్షేత్రంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ..
మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి అమ్మవార్లకు సోమవారం   పల్లకిసేవను వైభవంగా నిర్వహించారు. ముందుగా  స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువుదీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.పూజల అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    1
    ప్రజలు ఇక్కట్లు..  అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..!
బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు
    1
    శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...! బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ మాకు న్యాయం జరగలేదు అంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
    1
    ఎమ్మెల్యే సార్ కొత్తూరు కు ఇచ్చిన హామీ నెరవేరేది ఎప్పుడు...!
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో వర్షాకాలం వస్తే వీధులు అన్ని బురదమయం అవుతున్నాయి. ఈ విషయం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు తెలపడంతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయలేదు. పలు సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ  మాకు న్యాయం జరగలేదు అంటూ  గ్రామస్తులు తెలుపుతున్నారు. మండలంలో అనేకచోట్ల పశువుల వామి దొడ్లకు రోడ్డు వేస్తున్నారు గాని వీధులలో మనుషులు తిరిగే ప్రదేశాలను మాత్రమే నాయకులు మరిచినట్లున్నారు. ఎమ్మెల్యే గారు  గ్రామస్తులకు ఇచ్చిన హామీని నెరవేరచాలని కోరుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ గ్రామంలో అత్యధికంగా బీసీలు ఉన్న ప్రాంతం కాబట్టే ఈ గ్రామంలోకి రోడ్లు వేయలేదు అంటూ కూడా గ్రామస్తులు తెలుపుతున్నారు. అధికార పార్టీ మండల నాయకులు తమ బంధువులు, వైసీపీలో ఉన్న  నాయకుల పశువుల పాగల వరకు రోడ్డు వేస్తున్నారు మా గ్రామంలో మాత్రం మరిచార అంటూ వారు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • భీమ్ జెన్ జడ్ సామూహిక నిరాహారదీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలి. ఈనెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద భీమ్ జెన్-జడ్ సామూహిక నిరసన దీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పర్రె కోటయ్య పిలుపునిచ్చారు. సోమవారం రేపల్లెలో నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీని సత్వరమే కొనసాగించాలన్నారు. 26 సంక్షేమ పథకాలు దశలవారీగా అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించినప్పటికీ ఓటమి ప్రభుత్వం రెండువేల పాలనలో ఒక్క దళిత గిరిజన సంక్షేమ పథకాన్ని కూడా పునరుద్ధరించకపోవడం ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతార్లంక శివ వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ పంతగాని నాగేశ్వరరావు, మాల మహానాడు రేపల్లె నియోజకవర్గం కన్వీనర్ చల్లపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
    1
    భీమ్ జెన్ జడ్ సామూహిక నిరాహారదీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలి.
ఈనెల 17వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద భీమ్ జెన్-జడ్ సామూహిక నిరసన దీక్షకు ఎస్సీ ఎస్టీలు తరలిరావాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పర్రె కోటయ్య పిలుపునిచ్చారు. సోమవారం రేపల్లెలో నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 26 దళిత గిరిజన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీని సత్వరమే కొనసాగించాలన్నారు. 26 సంక్షేమ పథకాలు దశలవారీగా అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రకటించినప్పటికీ ఓటమి ప్రభుత్వం రెండువేల పాలనలో ఒక్క దళిత గిరిజన సంక్షేమ పథకాన్ని కూడా పునరుద్ధరించకపోవడం ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పోతార్లంక శివ వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ పంతగాని నాగేశ్వరరావు, మాల మహానాడు రేపల్లె నియోజకవర్గం కన్వీనర్ చల్లపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    4 hrs ago
  • * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._* విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..
    1
    * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._*

విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • రేపల్లెలో కార్మిక సంఘాల రాస్తారోకో. అడ్డుకున్న పోలీసులు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ భరో పిలుపులో భాగంగా రేపల్లెలో కార్మిక రైతు సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం రేపల్లె తాలూకా వద్ద రాస్తారోకో చేపట్టిన కార్మిక రైతు నిరసనకారులను రేపల్లె పట్టణ పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు కార్మికులు కూలీల సమస్యలు పరిష్కరించకపోవడం వారిని రోడ్డుపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
    2
    రేపల్లెలో కార్మిక సంఘాల రాస్తారోకో. అడ్డుకున్న పోలీసులు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో జైల్ భరో పిలుపులో భాగంగా రేపల్లెలో కార్మిక రైతు సంఘాల నేతలు రాస్తారోకో చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం రేపల్లె తాలూకా వద్ద రాస్తారోకో చేపట్టిన కార్మిక రైతు నిరసనకారులను రేపల్లె పట్టణ పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులు కార్మికులు కూలీల సమస్యలు పరిష్కరించకపోవడం వారిని రోడ్డుపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    7 hrs ago
  • అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్ 14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి.. ప్రెస్ నోట్ కడప జిల్లా: కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
    3
    అప్పనపల్లి పంచాయతీలో రూ.2 కోట్లకు పైగా నిధుల అక్రమాలపై ACB / Vigilance & Enforcement విచారణకు డిమాండ్

14వ, 15వ ఆర్థిక సంఘం, అమృత్ సరోవర్ నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి..


ప్రెస్ నోట్
కడప జిల్లా:
కాజీపేట మండలం అప్పనపల్లి గ్రామ పంచాయతీలో 2021 నుండి 2025 సంవత్సరం చివరి వరకు 14వ, 15వ ఆర్థిక సంఘం మరియు అమృత్ సరోవర్ పథకం కింద మంజూరైన నిధుల వినియోగంపై తీవ్రమైన ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సాధారణ పంచాయతీరాజ్ శాఖ విచారణకు మాత్రమే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతిపత్రం సమర్పించారు.జనతా వారిది కార్యక్రమంలో భాగంగా ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మాలకొండయ్య, కాలా వీరబ్రహ్మం, అధ్యక్షుడు పోకల శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.అప్పనపల్లి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం, పత్రాలు మరియు ఇతర ఆధారాల ఆధారంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ముఖ్యంగా అమృత్ సరోవర్ మరియు ఇతర పంచాయతీ నిధులకు సంబంధించి రూ.2 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగి ఉండవచ్చనే ఆరోపణలు ఉన్నాయని, ఇందులో సుమారు రూ.1,43,30,108/- వరకు నిధులు వాస్తవ పనులు లేకుండానే లేదా పనుల వాస్తవికతపై అనుమానాలు ఉన్న పరిస్థితుల్లో డ్రా/వినియోగం చేసినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.
అమృత్ సరోవర్ పనులపై భౌతిక పరిశీలన చేయాలి
అమృత్ సరోవర్ పథకం కింద వాస్తవంగా చెరువులు లేదా పనులు లేని ప్రదేశాల్లో పనులు జరిగినట్లు చూపించి నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నందున, ప్రతి పని ప్రదేశాన్ని అధికారులు భౌతికంగా పరిశీలించి రికార్డుల్లో చూపిన పనులతో వాస్తవ పరిస్థితిని పోల్చి చూడాలని వారు కోరారు.అలాగే Measurement Books (MBs), బిల్లులు, వౌచర్లు, మస్టర్ రోల్స్, జియోట్యాగ్ ఫోటోలు, GPS వివరాలు, పని పూర్తి ధృవీకరణ పత్రాలు, బ్యాంకు లావాదేవీలు తదితర రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, బాధ్యుల నుండి ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయడంతో పాటు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బంది, కాంట్రాక్టర్లు లేదా ఇతరుల పాత్రను గుర్తించి క్రిమినల్, శాఖాపరమైన మరియు ఆర్థిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏదైనా విచారణ జరిగి ఉంటే, దానికే పరిమితం కాకుండా ACB / Vigilance & Enforcement ద్వారా స్వతంత్ర పునర్విచారణ చేపట్టాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత అసలు రికార్డులు, కంప్యూటర్ డేటా, డిజిటల్ రికార్డులు మరియు ఇతర ఆధారాలను భద్రపరచాలని కూడా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి, నిధుల రికవరీతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    1
    రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేలకు సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ధర్నా నిర్వహించారు
మోడీ హటావో కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ పిక్కిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నందికొట్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు రైతు సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఎత్తిపోతల పథకము ప్రారంభించి రైతులకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Reporter
    Reporter
    Nandikotkur, Nandyal•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.