Shuru
Apke Nagar Ki App…
జుక్కల్ మండలంలో రైతు వేదికలో రెండో విడత వార్డు సభ్యులకు శిక్షణ ప్రారంభం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో వార్డు సభ్యులకు శిక్షణ ప్రారంభం జుక్కల్ మండల రైతు వేదికలో శనివారం రెండో విడత శిక్షణ తరగతులు ప్రారంభమైనట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. 10 గ్రామపంచాయతీలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు ఈనెల 18 వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. తొలిరోజు 50 మంది హాజరు కాగా, ట్రైనర్లు అశోక్, నాగయ్య ప్రాజెక్టర్ ద్వారా అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. సభ్యులు విధులపై పట్టు సాధించాలని ఎంపీడీవో సూచించారు.
Narmala Swapna
జుక్కల్ మండలంలో రైతు వేదికలో రెండో విడత వార్డు సభ్యులకు శిక్షణ ప్రారంభం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో వార్డు సభ్యులకు శిక్షణ ప్రారంభం జుక్కల్ మండల రైతు వేదికలో శనివారం రెండో విడత శిక్షణ తరగతులు ప్రారంభమైనట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. 10 గ్రామపంచాయతీలకు చెందిన 96 మంది వార్డు సభ్యులకు ఈనెల 18 వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. తొలిరోజు 50 మంది హాజరు కాగా, ట్రైనర్లు అశోక్, నాగయ్య ప్రాజెక్టర్ ద్వారా అభివృద్ధి పనులపై అవగాహన కల్పించారు. సభ్యులు విధులపై పట్టు సాధించాలని ఎంపీడీవో సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.1
- కలియుగ ది దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల ఆధ్వర్యంలో పల్లెకిసేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు పల్లకిని మోస్తూ ఐదు ప్రదిక్షణాలు చేశారు. అరేయ్ పూజారి నరేంద్ర శర్మ భక్తుల పేర్ల గోత్రనామాలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కంచి మధు తీర్థప్రసాద విథరణ గావించారు.1
- గృహ అవసరాలకు సైతం ఉపయోగపడే మొక్కలను నర్సరీల్లో పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సాయి నగర్, జే పీ నగర్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా నర్సరీల్లో ఎన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ మొత్తం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా గృహ వినియోగానికి ఉపయోగపడే మొక్కలు సైతం పెంచాలని సూచించారు.మునగ, పండ్ల, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మొక్కలకు నీటిని పడుతూ సంరక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ ఆర్డిఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.1
- వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ సమీపంలోని అడవిలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. మంటలు వేగంగా వ్యాపించి అడవిలోని చెట్లు, పొదలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావాలి అధికారులు కోరుతున్నారు.1
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- పెద్దపల్లి జిల్లాలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 41 పరీక్ష కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయగా, 7495 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావనున్నారు. వీరిలో 2787 మంది విద్యార్థులు ప్రైవేట్‌లో రాయనున్నారు. 3787 మంది బాలికలు మరియు 3708 మంది బాలురు పరీక్షల్లో పాల్గొననున్నారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా జరగడానికి ప్రతి కేంద్రానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా విద్యా అధికారులు విద్యార్థుల భద్రత మరియు పరీక్షా క్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారని తెలిపారు.1
- సంగారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వినియోగించవద్దని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ1
- కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం 500 కోట్లతో, అలాగే CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్) కింద 50 కోట్ల నిధులు కేటాయించాలని *కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి* నితిన్ గడ్కారీ గారిని కలిసి విన్నవించిన కామారెడ్డి *శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* గారు ఈ సందర్భంగా ఆయన ప్రకటన విడుదల చేయటం జరిగింది.. గతంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల పొడవు తో కామారెడ్డి చుట్టు ఔటర్ రింగు రోడ్డు విషయమై గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారిని కలసి స్థల పరిశీలన మరియు వ్యయం ప్రణాళికలు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన రహదారుల పొడిగింపు, అభివృద్ధి గురించి మరియు నూతన రహదారుల ఏర్పాటు గురించి సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్టక్టియర్ ఫండ్ కింద లింగపూర్ నుండి టెక్రియల్ వరకు 50 కోట్ల నిధులు కేటాయించాలని మంత్రి గారికి విన్నవించినట్టు తెలిపారు. రింగు రోడ్డు పనుల ప్రణాళిక వేగవంతం చేయటానికి అధికారులకు ఆదేశించినట్టు, 50 కోట్ల నిధుల కేటాయింపు విషయమై కూడా సానుకులంగా స్పందించినట్టు తెలిపారు.1