కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బిక్కీ గంగన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన బిక్కీ గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా దళిత సంఘాల నాయకుడు మల్లెల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి బిక్కీ గంగన్నను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించడం హర్షణీయమన్నారు. సాధారణ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా నాయకులు చందాల రాజన్న, దర్శనల నాగేష్, మల్యాల స్వామి, నక్క రాందాస్, మోతే బారికరావు, భీమ్రావు వాగ్మరే, సంపర్ల అడెలు, దాదా సాహెబ్, కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోని రావు, విలాస్ తదితరులు పాల్గొని గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.

- గుంతల మయమైన నిర్మల్ టు మంచిర్యాల రోడ్డు... నిర్మల్ టు జన్నారం లక్షెట్టిపేట్ మంచిర్యాల రోడ్లు గుంతలమయం నిర్మల్ టు మంచిర్యాల వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై పడ్డ గుంతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వచ్చిపోయే వాహనదారులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితిలో ఉన్న రోడ్డును మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాలు అత్యంత వేగంతో వస్తున్నాయని గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు ఇకనైనా గుంతలను పూడ్చి రోడ్డు పనులను చేపట్టాలని గ్రామస్తులు కోరారు.1
- ఖానాపూర్ లోని శ్రీరామ్ నగర్ లోని మహ దేవ అన్నపూర్ణ దేవాలయంలో పత జ్ఞాపకలు ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో అతి పురతమైన మహ దేవ అన్నపూర్ణ దేవాలయంలో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు రాత్రి మస్కాపూర్ కళ భజన బృందంచే సాంస్కృతిక దేవుని పాటలు అల పిస్తు భక్తులను మంత్రముగ్ధులను చేశారు ఈ భక్తి కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు1
- మార్పు రావాలని లక్ష్యంతోనే సిపిఐ పోరుయాత్ర: సిపిఐ నాయకులు మార్పు సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జన్నారం మండల కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.1
- మాల్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల యువకుడు మృతి1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల శోభాయాత్ర జగిత్యాల : జగిత్యాల జిల్లా కళాకారుల బోనాల జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆధ్వర్యంలో జగిత్యాల మినీ స్టేడియం నుండి పోచమ్మ వాడలో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ మరియు సాంస్కృతిక కార్యక్రమాల పండుగ నిర్వహించారు. మినీ స్టేడియం నుండి పూజల అనంతరం ప్రారంభమైన కళాకారుల బోనాల శోభాయాత్ర ముస్తాబైన ఆడపడుచులు తమ తలపై బోనాలు, పోతురాజుల వేషధారణతో ఉగ్రరూపాలు మరియు వివిధ రూపాలతో డప్పు చప్పుళ్ళు, యువతీ యువకుల కోలాహలం, కళాకారులతో శోభాయాత్ర తదితర అంశాలతో జగిత్యాల పట్టణంలో సాగిన బోనాల జాతర ఘనంగా సాగింది.1
- పొలంలో దాచిన రూ.5 లక్షలు.. చెదలు తినడంతో ముక్కలైన నోట్లు! 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. బ్యాంకు సైతం డబ్బు మార్చేందుకు నిరాకరణ రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రా పరిధిలోని నెవాయి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైతు మంగీలాల్ మేఘ్వాల్ తన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పాలిథిన్ సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు. కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో నగదు కోసం వెతికిన మంగీలాల్‌కు తాను డబ్బును ఎక్కడ పాతిపెట్టాడో గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని తన కుమారులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు 10 బీఘాల పొలాన్ని పలుచోట్ల తవ్వి వెతికినా నగదు ఆచూకీ లభించలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో విత్తనాలు వేసే సమయంలో నగదు ఉన్న పాలిథిన్ సంచి అనూహ్యంగా నేలపైకి వచ్చింది. సంచిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో దాన్ని తెరిచి చూడగా షాక్‌కు గురయ్యారు. సంచిలోని రూ.5 లక్షల నోట్లను చెదలు పూర్తిగా తినేయడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారిపోయాయి. నోట్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ, బ్యాంకు అధికారులు కూడా నగదును మార్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. భద్రంగా దాచుకున్న రూ.5 లక్షలు.. చివరకు చెదల పాలవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.1
- *మంజ్రి గ్రామంలో వీఓ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు...* భైంసా మండలంలోని మంజ్రి గ్రామంలో వీఓ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణ పనులకు *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు* భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు వీఓ మహిళా సమైక్య సంఘ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాతినిధులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.3
- తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు1
- షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల : అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు. హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.3