logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రామప్ప ఆలయానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులతో ముప్పు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన (యునెస్కో గుర్తింపు) పొందిన రామప్ప ఆలయం సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉందని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింగరేణి చేపట్టనున్న ఓపెన్ కాస్ట్ తవ్వకాలను నిలిపివేయాలని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు రావడంతో ఓపెన్ కాస్ట్ "హటావో - రామప్ప బచావో" అనే నినాదంతో ఉద్యమం చేపడతామని ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. గతంలో దేవాదుల అండర్ గ్రౌండ్ తవ్వకాలను అడ్డుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో రామప్ప ఆలయానికి ప్రమాదం తప్పింది. నేడు ఓపెన్ కాస్ట్ పేరుతో జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలంటూ ఎక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

12 hrs ago
user_GADAM DEVENDAR
GADAM DEVENDAR
ములుగు, ములుగు, తెలంగాణ•
12 hrs ago

రామప్ప ఆలయానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులతో ముప్పు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన (యునెస్కో గుర్తింపు) పొందిన రామప్ప ఆలయం సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉందని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింగరేణి చేపట్టనున్న ఓపెన్ కాస్ట్ తవ్వకాలను నిలిపివేయాలని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు రావడంతో ఓపెన్ కాస్ట్ "హటావో - రామప్ప బచావో" అనే నినాదంతో ఉద్యమం చేపడతామని ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. గతంలో దేవాదుల అండర్ గ్రౌండ్ తవ్వకాలను అడ్డుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో రామప్ప ఆలయానికి ప్రమాదం తప్పింది. నేడు ఓపెన్ కాస్ట్ పేరుతో జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలంటూ ఎక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • UPI చెల్లింపులపై టాక్స్ దోపిడీ సరికాదు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి... తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22... బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అని తెచ్చిన GST, UPI చెల్లింపుల మీద పన్ను ప్రజల పై భారం వేసిన, వేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని Cpi (ml ) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* అన్నారు .తొర్రూర్ బస్టాండ్ వద్ద నేడు నిరసన తెలియజేశారు.ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపు 2000 దాటితే సరికాదని సిపిఐ ఎంల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చినది. ఈసందర్బంగా రవి మాట్లాడుతు GST పేరుతో ఇప్పటికే ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేడు సాధారణ ప్రజలనందరిని upi చెల్లింపులకు అలవాటు చేసి నేడు టాక్స్ వేసే యత్నం అత్యంత మోసపూరిత చర్య అని అన్నారు. అమెరికా, వీసా, మాస్టర్ కార్డ్ ల వత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని తమ లావాదేవీలకు ఇవి నష్టం తెస్తున్నాయని అమెరికా ఆగ్రహిస్తున్నదని భయంతో, దాని ప్రభావంతో మోడీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిటం అన్యాయం అన్నారు.ఇది ప్రజావ్యతిరేక చర్య దీని పై ప్రజలు ఉద్యమబాట పట్టాలన్నారు. అమెరికా ఒత్తిడికి లాగిపోయి కోట్లాదిమంది upi వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం వేసే విధానాలకు అన్ని వర్గాల ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ ప్రజల కష్టo వచ్చిన డబ్బులను విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం సరికాదన్నారు. దేశభక్తి స్వదేశీ విధానం అంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ లొంగిపోవడం ఈ దేశ సార్వభౌమాధికారానికి గుడ్డలు పెట్టు అని అన్నారు. మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ నాయకులు ముంజంపల్లి వీరన్న, ఉడుగుల రాములు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ దొడ్డ కేశవులు బిక్షం వెంకన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    UPI చెల్లింపులపై టాక్స్ దోపిడీ సరికాదు. 
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి...
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22... 
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అని తెచ్చిన GST, UPI చెల్లింపుల మీద పన్ను ప్రజల పై భారం వేసిన, వేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని Cpi (ml ) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి*  అన్నారు .తొర్రూర్ బస్టాండ్ వద్ద నేడు నిరసన తెలియజేశారు.ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపు 2000 దాటితే సరికాదని సిపిఐ ఎంల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చినది. ఈసందర్బంగా రవి మాట్లాడుతు GST పేరుతో ఇప్పటికే ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేడు సాధారణ ప్రజలనందరిని upi చెల్లింపులకు అలవాటు చేసి నేడు టాక్స్ వేసే యత్నం అత్యంత మోసపూరిత చర్య అని అన్నారు. అమెరికా, వీసా, మాస్టర్ కార్డ్ ల వత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని తమ లావాదేవీలకు ఇవి నష్టం తెస్తున్నాయని  అమెరికా ఆగ్రహిస్తున్నదని భయంతో, దాని ప్రభావంతో మోడీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిటం అన్యాయం అన్నారు.ఇది ప్రజావ్యతిరేక చర్య దీని పై ప్రజలు ఉద్యమబాట పట్టాలన్నారు. అమెరికా ఒత్తిడికి లాగిపోయి కోట్లాదిమంది upi వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం వేసే విధానాలకు అన్ని వర్గాల ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ ప్రజల కష్టo వచ్చిన డబ్బులను విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం సరికాదన్నారు. దేశభక్తి స్వదేశీ విధానం అంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ లొంగిపోవడం ఈ దేశ సార్వభౌమాధికారానికి గుడ్డలు పెట్టు అని అన్నారు. మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్  నాయకులు ముంజంపల్లి వీరన్న, ఉడుగుల రాములు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ దొడ్డ కేశవులు బిక్షం వెంకన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    40 min ago
  • కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి.. * కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్ గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
    1
    కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన గోదావరి..
* కన్నెపల్లి పంప్‌హౌస్, ఎల్లంపల్లి నీటిని వెంటనే విడుదల చేయాలని చందర్ డిమాండ్
గోదావరిఖని
గోదావరి బ్రిడ్జ్ వద్ద రామగుండం మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు కోరుకంటి చందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే నేడు గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నదిని ఏడాది పొడవునా సముద్రాన్ని తలపించేలా నిండుకుండలా ఉంచారని కొనియాడారు. అపర భగీరథుడిలా కేసీఆర్ నీటిని అందించి మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించారని గుర్తుచేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్న వేళ, గోదావరిలో నీళ్లు లేకపోవడంతో విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎల్లంపల్లిలో నిల్వ ఉన్న నీటిని వెంటనే గోదావరిలోకి విడుదల చేయాలని మరియు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • * సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ... * గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం.... మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
    2
    * సాయి మల్టీ స్పెషల్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ...
* గణపతి నవరాత్రుల సందర్భంగా సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహాఅన్నదానం....
మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తొర్రూరు పట్టణంలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వరూప్ కుమార్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు గౌరీ శంకర్‌తో పాటు సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    4
    ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన... కేటిఆర్ ఇలాక లో ప్రజాపాలనకు దీవెన పేరుతో బహిరంగ సభ... ఏర్పాటను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 30న కరీంనగర్, సిరిసిల్లలో పర్యటిస్తారని అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తైన సందర్భంగా ప్రజాధీవేన పేరుతో కేటీఆర్ ఇలాక సిరిసిల్లలో బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో కలిసి సభ స్థలాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకు దీవెనలు ఇవ్వడానికి సుమారు లక్ష మందితో బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు కళ్ళులా రేవంత్ రెడ్డి సర్కార్ అందించిన సేవలను సభ ద్వారా ప్రజానీకానికి తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల నేతన్నల, వేములవాడ దేవాలయ అభివృద్ధి, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు మరియు వేయి రోజులలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాజన్న సిరిసిల్లకు వెయ్యి రోజులలో 1000 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు వారసత్వంగా అప్పు ఇచ్చి వెళ్లినా అనేక పథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధికి వారి సభకు ప్రజలు  ఆశీర్వాదం ఇచ్చి అండగా నిలబడాలని కోరారు. 30న సిరిసిల్లతో పాటు కరీంనగర్లో పర్యటించి కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    1
    టెక్నాలజీ అభివృద్ధి – మన భవిష్యత్తుకు కొత్త దారి" టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి
టెక్నాలజీ అంటే కేవలం యంత్రాలు కాదు... మన ఆలోచనలకు వేగం ఇచ్చే శక్తి. ఈ రోజు నేర్చుకునే ప్రతి కొత్త టెక్నాలజీ రేపటి అభివృద్ధికి ఒక అడుగు. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ప్రపంచం, ఆధునిక ఆవిష్కరణలు మన జీవితాలను కొత్త దిశలో తీసుకెళ్తున్నాయి. టెక్నాలజీని భయపడకుండా నేర్చుకుందాం, సృజనాత్మకంగా ఉపయోగిద్దాం. మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. టెక్నాలజీతో ముందడుగు... అభివృద్ధితో కొత్త ప్రపంచం!"
    user_Akudari Devendar
    Akudari Devendar
    Graphic designer భీమారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
    1
    నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు
జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • రామప్ప ఆలయానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులతో ముప్పు.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన (యునెస్కో గుర్తింపు) పొందిన రామప్ప ఆలయం సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉందని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింగరేణి చేపట్టనున్న ఓపెన్ కాస్ట్ తవ్వకాలను నిలిపివేయాలని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు రావడంతో ఓపెన్ కాస్ట్ "హటావో - రామప్ప బచావో" అనే నినాదంతో ఉద్యమం చేపడతామని ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. గతంలో దేవాదుల అండర్ గ్రౌండ్ తవ్వకాలను అడ్డుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో రామప్ప ఆలయానికి ప్రమాదం తప్పింది. నేడు ఓపెన్ కాస్ట్ పేరుతో జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలంటూ ఎక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    రామప్ప ఆలయానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ పనులతో  ముప్పు..
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన (యునెస్కో గుర్తింపు) పొందిన రామప్ప ఆలయం సింగరేణి ఓపెన్ కాస్ట్ తవ్వకాలతో ప్రమాదం పొంచి ఉందని రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సింగరేణి చేపట్టనున్న ఓపెన్ కాస్ట్ తవ్వకాలను నిలిపివేయాలని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు రావడంతో ఓపెన్ కాస్ట్ "హటావో - రామప్ప బచావో" అనే నినాదంతో ఉద్యమం చేపడతామని ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు రామ్మోహన్ రావు అన్నారు. గతంలో దేవాదుల అండర్ గ్రౌండ్ తవ్వకాలను అడ్డుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో రామప్ప ఆలయానికి ప్రమాదం తప్పింది. నేడు ఓపెన్ కాస్ట్ పేరుతో జరుగుతున్న తవ్వకాలను నిలిపివేయాలంటూ ఎక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    12 hrs ago
  • సింగరేణిలో మెటీరియల్ కొరతతో కార్మికుల భద్రతను పణంగా పెట్టొద్దు., * కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జి.ఎం. కార్యాలయాలను ముట్టడిస్తాం.. ఏఐటీయూసీ సింగరేణిలో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన కీలక మెటీరియల్స్‌ను సకాలంలో అందించడంలో యాజమాన్యం విఫలమవుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1 ఇంక్లైన్, జీడీకే-2వ ఇంక్లైన్ మరియు జీడీకే-11వ ఇంక్లైన్ లలో జరిగిన వినతి పత్రాల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో మెటీరియల్ కొరత పేరుతో కార్మికుల భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. గనుల్లో పని చేయడానికి అవసరమైన ప్రాథమిక మెటీరియల్స్ కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు గత కొన్ని నెలలుగా సకాలంలో అందకపోవడంతో గనుల్లో ఉత్పత్తి పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రీకండిషన్ డ్రిల్ బిట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. సపోర్ట్ మెన్‌కు అత్యవసరంగా అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూఫ్ బోల్టింగ్‌కు అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ కొరత ఏర్పడితే గని భద్రతా చర్యలపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లైన్‌మెన్‌కు అవసరమైన కీళ్లు తదితర సామగ్రిని వెంటనే సరఫరా చేయాలని, ట్రాక్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే టబ్బులు పట్టాలు తప్పడం, కిందపడటం వంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులకు జూన్, జూలై నెలల్లో అందాల్సిన సేఫ్టీ షూస్ సెప్టెంబర్ వచ్చినా ఇంకా అందకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని యాజమాన్యంపై మండిపడ్డారు. గ్లౌజెస్ నుంచి ఎస్.డి.ఎల్ ఆయిల్ వరకు అన్నింటిలో కొరతేనా? అని ప్రశ్నించారు. కార్మికులకు అవసరమైన నాణ్యమైన గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ లకు అవసరమైన నాణ్యమైన ఆయిల్, గిరిమీట్లు తదితర మెటీరియల్స్‌ను, అలాగే నూతన రంగుతో కూడిన ఒకే రకం యూనిఫామ్‌ను అన్ని గనుల్లో వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. “ఉత్పత్తి లక్ష్యాలు గుర్తుంటే, కార్మికుల భద్రత ఎందుకు గుర్తుండదు? కార్మికుల నుంచి పని ఆశిస్తే.. పని చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఎందుకు ఇవ్వరు?” అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఏఐటీయూసీ సహించబోదని, ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనుల్లో కార్మికులకు అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, రెజిన్ క్యాప్సిల్స్, సేఫ్టీ షూస్, గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ ఆయిల్, గిరిమీట్లు, ట్రాక్ మెటీరియల్స్, యూనిఫామ్ తదితర అవసరమైన సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితుల విషయంలో ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో పై సమస్యల సాధన కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆఫీస్ బేరర్స్ *సంకె అశోక్, మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, సుధాకర్*, అన్ని గనుల పిట్ సెక్రటరీలు *మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్*, నాయకులు *గొడిశెల నరేశ్, పి. రవి, సాన జలపతి, చంద తిరుపతి, బి. సమ్మయ్య*, మైన్స్, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సింగరేణిలో మెటీరియల్ కొరతతో కార్మికుల భద్రతను పణంగా పెట్టొద్దు., 
* కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జి.ఎం. కార్యాలయాలను ముట్టడిస్తాం.. ఏఐటీయూసీ

సింగరేణిలో కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ, వారికి అవసరమైన కీలక మెటీరియల్స్‌ను సకాలంలో అందించడంలో యాజమాన్యం విఫలమవుతోందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళవారం సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-1 ఇంక్లైన్, జీడీకే-2వ ఇంక్లైన్ మరియు జీడీకే-11వ ఇంక్లైన్ లలో జరిగిన వినతి పత్రాల కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో మెటీరియల్ కొరత పేరుతో కార్మికుల భద్రతతో చెలగాటమాడితే సహించేది లేదని వారు స్పష్టం చేశారు.
గనుల్లో పని చేయడానికి అవసరమైన ప్రాథమిక మెటీరియల్స్ కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు గత కొన్ని నెలలుగా సకాలంలో అందకపోవడంతో గనుల్లో ఉత్పత్తి పనులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో రీకండిషన్ డ్రిల్ బిట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
సపోర్ట్ మెన్‌కు అత్యవసరంగా అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రూఫ్ బోల్టింగ్‌కు అవసరమైన రెజిన్ క్యాప్సిల్స్ కొరత ఏర్పడితే గని భద్రతా చర్యలపై ప్రత్యక్ష ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. లైన్‌మెన్‌కు అవసరమైన కీళ్లు తదితర సామగ్రిని వెంటనే సరఫరా చేయాలని, ట్రాక్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగితే టబ్బులు పట్టాలు తప్పడం, కిందపడటం వంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులకు జూన్, జూలై నెలల్లో అందాల్సిన సేఫ్టీ షూస్ సెప్టెంబర్ వచ్చినా ఇంకా అందకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని యాజమాన్యంపై మండిపడ్డారు.
గ్లౌజెస్ నుంచి ఎస్.డి.ఎల్ ఆయిల్ వరకు అన్నింటిలో కొరతేనా? అని ప్రశ్నించారు. కార్మికులకు అవసరమైన నాణ్యమైన గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ లకు అవసరమైన నాణ్యమైన ఆయిల్, గిరిమీట్లు తదితర మెటీరియల్స్‌ను, అలాగే నూతన రంగుతో కూడిన ఒకే రకం యూనిఫామ్‌ను అన్ని గనుల్లో వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. “ఉత్పత్తి లక్ష్యాలు గుర్తుంటే, కార్మికుల భద్రత ఎందుకు గుర్తుండదు? కార్మికుల నుంచి పని ఆశిస్తే.. పని చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఎందుకు ఇవ్వరు?” అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలు, ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఏఐటీయూసీ సహించబోదని, ఆర్జీ-1 ఏరియాలోని అన్ని గనుల్లో కార్మికులకు అవసరమైన డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, రెజిన్ క్యాప్సిల్స్, సేఫ్టీ షూస్, గ్లౌజెస్, ఎస్.డి.ఎల్ ఆయిల్, గిరిమీట్లు, ట్రాక్ మెటీరియల్స్, యూనిఫామ్ తదితర అవసరమైన సామగ్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, భద్రత, గౌరవప్రదమైన పని పరిస్థితుల విషయంలో ఏఐటీయూసీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో పై సమస్యల సాధన కోసం అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి ఆఫీస్ బేరర్స్ *సంకె అశోక్, మాదన మహేష్, బోగ సతీష్ బాబు, ఎస్. వెంకట్ రెడ్డి, గండి ప్రసాద్, సుధాకర్*, అన్ని గనుల పిట్ సెక్రటరీలు *మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, దాసరి శ్రీనివాస్*, నాయకులు *గొడిశెల నరేశ్, పి. రవి, సాన జలపతి, చంద తిరుపతి, బి. సమ్మయ్య*, మైన్స్, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • * CEIR ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. 77 ఫోన్లు బాధితులకు అప్పగింత.... “మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి” * జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ *మహబూబాబాద్ జిల్లా పోలీస్... *ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా 2027 మొబైల్ ఫోన్ల రికవరీ.... * 77 ఫోన్లను గుర్తించి ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్. చేతులమిదిగా బాధితులకు అందజేత..... * CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి... * జిల్లా ఎస్పీ డా. శబరీష్. ఐపీఎస్.... పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ చేతులమిదిగా అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.... CEIR పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ ప్రక్రియలో మహబూబాబాద్ డీఎస్పీ, CCS ఇన్‌స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్‌ఐ జి.వి. కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, CEIR ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు. CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి ఫోన్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు. ప్రజల ఆస్తి పరిరక్షణలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.....
    2
    * CEIR ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. 77 ఫోన్లు బాధితులకు అప్పగింత....
“మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి” * జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్


*మహబూబాబాద్ జిల్లా పోలీస్... 
*ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా 2027 మొబైల్ ఫోన్ల రికవరీ....
* 77 ఫోన్లను గుర్తించి  ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్,ఐపీఎస్. చేతులమిదిగా బాధితులకు అందజేత.....
* CEIR సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి...
* జిల్లా ఎస్పీ డా. శబరీష్. ఐపీఎస్.... పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో మహబూబాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో  77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను ఈరోజు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ చేతులమిదిగా అందించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ....
CEIR పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నామని అన్నారు. 
ఈ ప్రక్రియలో మహబూబాబాద్ డీఎస్పీ, CCS ఇన్‌స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్‌ఐ జి.వి. కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, CEIR ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని అన్నారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు.
CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి ఫోన్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి CEIR సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు.
ప్రజల ఆస్తి పరిరక్షణలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.....
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.