logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బోధన్‌లో తొలి వర్షానికే అభివృద్ధి హామీల బండారం బట్టబయలు.. నీటితో నిండిన గుంతలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ బోధన్ మున్సిపాలిటీ 25వ వార్డులో, మున్సిపల్ చైర్‌పర్సన్ నివాసానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో, అలాగే ఆ వార్డు కౌన్సిలర్‌గా ఆమె భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తొలి వర్షానికే రోడ్డుపై భారీ గుంత నీటితో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ నీటితో నిండిన గుంతలోకి దిగి మీడియాతో మాట్లాడారు. బోధన్ ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ దృశ్యమే బోధన్‌లో అభివృద్ధి పనులపై చేసిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని నిరూపిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఈ రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలి. తొలి వర్షానికే రోడ్డు చెరువును తలపిస్తోంది. ప్రజలు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటితో నిండిన ఈ గుంతను అత్యవసరంగా మరమ్మతు చేసి, ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జునైద్ అహ్మద్ ఖలీల్ డిమాండ్ చేశారు.

2 hrs ago
user_Mirza Hassan Baig
Mirza Hassan Baig
Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
2 hrs ago

బోధన్‌లో తొలి వర్షానికే అభివృద్ధి హామీల బండారం బట్టబయలు.. నీటితో నిండిన గుంతలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ బోధన్ మున్సిపాలిటీ 25వ వార్డులో, మున్సిపల్ చైర్‌పర్సన్ నివాసానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో, అలాగే ఆ వార్డు కౌన్సిలర్‌గా ఆమె భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తొలి వర్షానికే రోడ్డుపై భారీ గుంత నీటితో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ నీటితో నిండిన గుంతలోకి దిగి మీడియాతో మాట్లాడారు. బోధన్ ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ దృశ్యమే బోధన్‌లో అభివృద్ధి పనులపై చేసిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని నిరూపిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఈ రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలి. తొలి వర్షానికే రోడ్డు చెరువును తలపిస్తోంది. ప్రజలు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటితో నిండిన ఈ గుంతను అత్యవసరంగా మరమ్మతు చేసి, ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జునైద్ అహ్మద్ ఖలీల్ డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • బోధన్‌లో తొలి వర్షానికే అభివృద్ధి హామీల బండారం బట్టబయలు.. నీటితో నిండిన గుంతలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ బోధన్ మున్సిపాలిటీ 25వ వార్డులో, మున్సిపల్ చైర్‌పర్సన్ నివాసానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో, అలాగే ఆ వార్డు కౌన్సిలర్‌గా ఆమె భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తొలి వర్షానికే రోడ్డుపై భారీ గుంత నీటితో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ నీటితో నిండిన గుంతలోకి దిగి మీడియాతో మాట్లాడారు. బోధన్ ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ దృశ్యమే బోధన్‌లో అభివృద్ధి పనులపై చేసిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని నిరూపిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఈ రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలి. తొలి వర్షానికే రోడ్డు చెరువును తలపిస్తోంది. ప్రజలు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని అన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటితో నిండిన ఈ గుంతను అత్యవసరంగా మరమ్మతు చేసి, ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జునైద్ అహ్మద్ ఖలీల్ డిమాండ్ చేశారు.
    1
    బోధన్‌లో తొలి వర్షానికే అభివృద్ధి హామీల బండారం బట్టబయలు.. నీటితో నిండిన గుంతలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్
బోధన్ మున్సిపాలిటీ 25వ వార్డులో, మున్సిపల్ చైర్‌పర్సన్ నివాసానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో, అలాగే ఆ వార్డు కౌన్సిలర్‌గా ఆమె భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో తొలి వర్షానికే రోడ్డుపై భారీ గుంత నీటితో నిండిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జునైద్ అహ్మద్ ఖలీల్ నీటితో నిండిన గుంతలోకి దిగి మీడియాతో మాట్లాడారు. బోధన్ ప్రజాప్రతినిధుల పనితీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ దృశ్యమే బోధన్‌లో అభివృద్ధి పనులపై చేసిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని నిరూపిస్తోంది. మున్సిపల్ చైర్‌పర్సన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఈ రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించాలి. తొలి వర్షానికే రోడ్డు చెరువును తలపిస్తోంది. ప్రజలు, విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, నాలుగు చక్రాల వాహనదారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు." అని అన్నారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీటితో నిండిన ఈ గుంతను అత్యవసరంగా మరమ్మతు చేసి, ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జునైద్ అహ్మద్ ఖలీల్ డిమాండ్ చేశారు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • బాసర లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షం... జలమయమైన రోడ్లు, వాగులు, వంకలు.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం... వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, డ్రైనేజీ లు... రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి చిత్తడిగా మారిన రోడ్లు... ఇబ్బందులు పడుతున్న వాహన దారులు... ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాసర గోదావరి నదిలోకి భారీగా చేరిన వరద నీళ్లు... నిండు కుండలా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది... హర్షం వ్యక్త పరుస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, గ్రామస్తులు....
    1
    బాసర లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షం... జలమయమైన రోడ్లు, వాగులు, వంకలు..
నిర్మల్ జిల్లా // బాసర 
BREAKING NEWS
బాసర లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం...
వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, డ్రైనేజీ లు...
రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి చిత్తడిగా మారిన రోడ్లు... ఇబ్బందులు పడుతున్న వాహన దారులు...
ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాసర గోదావరి నదిలోకి భారీగా చేరిన వరద నీళ్లు...
నిండు కుండలా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది... హర్షం వ్యక్త పరుస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, గ్రామస్తులు....
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.బాన్సువాడలో వీధి కుక్కల బెడదపై ఆందోళన.. ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బాధితులతో కలిసి వినతి బాన్సువాడ, జూలై 30: బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.
    3
    బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.బాన్సువాడలో వీధి కుక్కల బెడదపై ఆందోళన.. ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బాధితులతో కలిసి వినతి
బాన్సువాడ, జూలై 30:
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ గురువారం ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల కుక్కల దాడుల్లో గాయపడిన చిన్నారులు, మహిళతో కలిసి ఆయన అధికారులను కలిసి సమస్య తీవ్రతను వివరించారు.
ఈ సందర్భంగా బాడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణంలోని 1వ, 2వ, 13వ, 15వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత రెండు రోజుల వ్యవధిలోనే సుమారు పది మంది చిన్నారులు, ఒక మహిళ కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రితో పాటు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
పట్టణ ప్రజలు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. చిన్నారులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు ఉదయం, సాయంత్రం బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొందని అన్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలను వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇకపై ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ వార్డు సభ్యుడు షేక్ అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇసాక్, నాయకులు షఫీ, గంగారాం, కాసుల బాబు, ఖాలేద్, అఫ్జల్, ఫయాజ్, కుక్కల దాడిలో గాయపడిన బాధితులు తదితరులు పాల్గొన్నారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Banswada, Kamareddy•
    8 hrs ago
  • నిజామాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తంగా మున్సిపల్ యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారినప్పటికీ, ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిలిచే వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది వెంటవెంటనే క్లియర్ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
    1
    నిజామాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తంగా మున్సిపల్ యంత్రాంగం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారినప్పటికీ, ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిలిచే వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది వెంటవెంటనే క్లియర్ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి SRD: కల్హేర్ మండల కేంద్రంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన హాస్టల్ ప్రాంగణమంతా కలియతిరిగి, గదులు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, హాస్టల్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, వసతులు, విద్యాబోధన గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
    1
    ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి 
SRD: కల్హేర్ మండల కేంద్రంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన హాస్టల్ ప్రాంగణమంతా కలియతిరిగి, గదులు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, హాస్టల్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, వసతులు, విద్యాబోధన గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
    user_JALEEL RUSTUM REPORTER
    JALEEL RUSTUM REPORTER
    కంగ్టి మండలం మన సాక్షి రిపోర్టర్ జలిల్ ర కంగ్టి, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
    1
    కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన  జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి
కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన  జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి
అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.
చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు. నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి 9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
    2
    సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు.
నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 
మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి  9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు 
దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
    user_G.S.Kumar
    G.S.Kumar
    Nirmal U, Telangana•
    5 hrs ago
  • డివిజన్ 42లో రోడ్డు పనులు నిలిచిపోయాయి.. డ్రైనేజీ సమస్యపై ఆప్ ఆగ్రహం నిజామాబాద్: నిజామాబాద్ డివిజన్ నం.42లో రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు మసీదు ముందు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ ఆరోపించారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, డ్రైనేజీ లైన్లను శుభ్రం చేసి, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
    1
    డివిజన్ 42లో రోడ్డు పనులు నిలిచిపోయాయి.. డ్రైనేజీ సమస్యపై ఆప్ ఆగ్రహం
నిజామాబాద్:
నిజామాబాద్ డివిజన్ నం.42లో రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే ఆమోదం వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు మసీదు ముందు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సమీర్ అహ్మద్ ఆరోపించారు.
డ్రైనేజీ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రోడ్డు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి, డ్రైనేజీ లైన్లను శుభ్రం చేసి, నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.