Shuru
Apke Nagar Ki App…
ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి SRD: కల్హేర్ మండల కేంద్రంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన హాస్టల్ ప్రాంగణమంతా కలియతిరిగి, గదులు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, హాస్టల్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, వసతులు, విద్యాబోధన గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
JALEEL RUSTUM REPORTER
ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి SRD: కల్హేర్ మండల కేంద్రంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన హాస్టల్ ప్రాంగణమంతా కలియతిరిగి, గదులు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, హాస్టల్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, వసతులు, విద్యాబోధన గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
More news from తెలంగాణ and nearby areas
- రెయిన్బో బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించిన డిఎస్పి మధుసూదన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్ లో గల రెయిన్బో బ్లడ్ బ్యాంకును కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేయగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని తల సేమియా బాధిత చిన్నారులకు వారి జీవితాంతం 15 రోజులకు ఒక ఎన్ని రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు.నూతనంగా రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ రక్తదాన శిబిరంలో కామారెడ్డి జిల్లా సెంట్రల్ ఆర్మ్డ్ పరామిలిటరీ ఫోర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్.డి. గౌస్ఉద్దీన్ అధ్వర్యంలో సైనికులు హెడ్ కానిస్టేబుల్ బండి ప్రభాకర్(బి యస్ఎఫ్),మోతాజి బాల కృష్ణ రావు,మాజీ సైనికుడు రంజిత్ రెడ్డి,కానిస్టేబుల్ బద్రి లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.వీరికి డీఎస్పీ మధుసూదన్,సీఐ నరహరి ప్రశంస పత్రాలను,ఉత్తమ రక్తదాత పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది.దేశ రక్షణ కోసం సేవ చేయడమే కాకుండా ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జునరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్,డాక్టర్ సంతోష్ కుమార్,ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్,డాక్టర్ అజయ్ పేరాల,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరీ మారుతి, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,24 వ వార్డు కౌన్సిలర్ డాకి అరవింద్ రాజ్ మరియు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం ససాల రాజు,భట్టు భరద్వాజ్,సైఫ్ నజీర్,మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- బాసర లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షం... జలమయమైన రోడ్లు, వాగులు, వంకలు.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం... వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, డ్రైనేజీ లు... రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి చిత్తడిగా మారిన రోడ్లు... ఇబ్బందులు పడుతున్న వాహన దారులు... ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాసర గోదావరి నదిలోకి భారీగా చేరిన వరద నీళ్లు... నిండు కుండలా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది... హర్షం వ్యక్త పరుస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, గ్రామస్తులు....1
- నిజామాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తంగా మున్సిపల్ యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారినప్పటికీ, ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిలిచే వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది వెంటవెంటనే క్లియర్ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.1
- సర్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజులే మిగిలి ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ, జూలై 30 ఉదయం 10 గంటల వరకు 63.27% నమోదు మాత్రమే జరిగిందన్నారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా SIRలో పాల్గొని వివరాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు.1
- సీజనల్ వ్యాధులపై వెంకటాయపల్లిలో ప్రత్యేక దృష్టి.. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. గ్రామంలోని నిల్వ నీటి ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా నిర్మూలన కోసం ఆయిల్ బాల్స్ వేశారు. సర్పంచ్ బట్టికాడి హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ఇలాంటి నివారణ చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు1
- ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. హవేలి ఘనపూర్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరోసారి ధూప్ సింగ్ తండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాడి గ్రామపంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తండాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారంగా నూతన వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని వారు అధికారులను కోరుతున్నారు. కొత్త బ్రిడ్జి పూర్తయితే ఈ సమస్యకు శాశ్వతంగా తెరపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1