నాగర్ కర్నూలు :రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి మార్గం: అరవింద్ చారి పత్రికా ప్రకటన:- *రాజ్యాధికారమే బహుజనుల విముక్తికి ఏకైక మార్గం. ఓటు మనది, పాలన మనది కావాలి*.... *బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ధన్నోజు అరవింద్ చారి*.... దేశ జనాభాలో మరియు రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బహుజన బీసీ సమాజం నేటికీ రాజకీయ అధికారానికి, చట్టసభలలో తగిన ప్రాతినిధ్యానికి ఆమడ దూరంలో ఉంది. మంగళవారం రోజున నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ జిల్లా నాయకులు సత్యశీల సాగర్ ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జనాభా నిష్పత్తి ప్రకారం అధికారం దక్కాల్సి ఉండగా, రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకులుగానే వాడుకుంటున్నాయి. మన శ్రమ మన ఓట్లతో గెలిచిన పాలకుడు మన హక్కులను కాలరాస్తున్నారు. ఈ రాజకీయ వివక్షను నిలదీయడానికి, బీసీల రాజకీయ హక్కులను సాధించడానికి బీసీ పొలిటికల్ జేఏసీ అవతరించింది. బీసీలు ఒకే పొలిటికల్ జేఏసీగా ఎందుకు ఐక్యమవ్వాలి అంటే, రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభల్లో వాటా, జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో అసెంబ్లీ మరియు పార్లమెంటులో బీసీలకు 50 శాతం పైగా సీట్లు సాధించడం కోసం. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గిపోయిన బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరించి, 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలుపరిచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి. బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్ కేటాయింపులు బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక బీసీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చి బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించేలా పోరాడటానికి. కుల గణన దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రస్థాయిలో సమగ్ర కుల గణనను పారదర్శకంగా నిర్వహించి బీసీల సంఖ్యను అధికారికంగా తేల్చడం కోసం.రాజకీయ ఐక్యత ఐడెంటిటీ రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులాలన్నీ ఒకతాటిపైకి వచ్చి రాజకీయ సత్తాను నిరూపించుకోవడానికి. బీసీ కార్పొరేషన్లకు తగినంత నిధులు మంజూరు చేసి బహుజనుల కులవృత్తులకు ఉచిత విద్యుత్తు మరియు ఆధునిక సాంకేతిక పరికరాలు అందించాలి అని నాగర్ కర్నూలు జిల్లా బిసి పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా జేఏసీ నాయకులు సత్యశీల సాగర్, పాపాని నరేందర్, నరేందర్ గౌడ్, మన్నెం తదితరులు పాల్గొన్నారు.

- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు TRP నేత తీన్మార్ మల్లన్న పిలుపు ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ వచ్చేదాకా మనమందరం జీతాలు తీసుకోకుండా ఉందాం అని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. కష్టాల్లో, కన్నీళ్ల మధ్యలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మనం అండగా ఉండాలని తెలిపారు.1
- కేశంపేట:దత్తాయపల్లిలో ఘనంగా పోచమ్మ, మైసమ్మ బోనాల మహోత్సవం కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామంలో పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ మన తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు అద్దం పడుతుందని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడిపల్లి భాస్కర్, డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, చిన్నలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.1
- 47 టీఎంసీల సమ్మక సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం రేవంత్ వదులుతుండు: హరీష్ రావు 47 టీఎంసీల సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా? కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, డీకే శివ కుమార్ కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన తెలంగాణ ప్రభుత్వం సరే అన్నదని వార్తలు వస్తున్నాయి GRMB అజెండాలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల నీళ్లు ఇచ్చేదే లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటుంది ఈ 47 టీఎంసీలకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్నీ అనుమతులు తెచ్చాం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వదులుతుంది? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి దీని మీద తెలంగాణ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? దీని మీద రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 30 పోయిన మొబైల్ ఫోన్లు స్వాధీనం.. యజమానులకు అప్పగించిన అఫ్జల్‌గంజ్ పోలీసులు హైదరాబాద్, ఆగస్టు 5: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో అఫ్జల్‌గంజ్ పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటుకున్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్, ఆధునిక సాంకేతిక ఆధారాల సహాయంతో అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ బృందం మొత్తం 30 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది. అనంతరం వాటిని సంబంధిత యజమానులకు అందజేసింది. ఇన్‌స్పెక్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్. మోహన్‌రావు, డీఎస్‌ఐ వి. నరేందర్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రత్యేక చర్య చేపట్టారు. క్రైమ్ అధికారి డీఎస్‌ఐ వి. నరేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు జి. మధుసూదన్, శ్రీకాంత్ బిడ్లా, పోలీసు కానిస్టేబుళ్లు జె. జితేందర్, జి. శ్రీకాంత్, మహిళా పోలీసు కానిస్టేబుల్ ఎస్. ప్రియాంక సమన్వయంతో సాంకేతిక ఆధారాలను విశ్లేషించి పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి (ఐపీఎస్), అదనపు డీసీపీ కృష్ణ గౌడ్, గోషామహల్ డివిజన్ ఏసీపీ కె. చంద్రశేఖర్ రెడ్డి బృందాన్ని అభినందించారు. మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడంలో విశేష కృషి చేసిన పోలీసు సిబ్బందికి తగిన రీతిలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందేందుకు ప్రజలు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.1
- Owaisi Responds Strongly to Keshav Prasad Maurya's Remarks on Madrasas A political controversy has erupted after Uttar Pradesh Deputy Chief Minister Keshav Prasad Maurya reportedly remarked that terrorist organisations begin from madrasas, irrespective of the country. Responding to the statement, AIMIM President Asaduddin Owaisi strongly rejected the claim during an interaction with the media. Owaisi said that those making such allegations should study history and remember the sacrifices made by Indian Muslims for the country's freedom and nation-building. He further alleged that organisations associated with the Sangh Parivar had opposed the freedom movement and did not participate in India's struggle for Independence. The remarks from both leaders have triggered a fresh political debate over history, education, and communal harmony.1
- పత్తికొండలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించకూడదు ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు రంగస్వామి ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఉత్తర్వుల అనుసరించి ప్రస్తుతం పత్తికొండ గ్రామంలో లీజుకు భావనాన్ని తీసుకొని అధికారులు కొత్తగా అడ్మిషన్లను జరుపుతున్నారు. వచ్చే సంవత్సరం లోపు ఆదోని రోడ్డు కున్న స్థలంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను నిర్మిస్తారని గజిటెడ్ ఉత్తర్వులు జారీ అయినది.ఇక్కడున్న గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కె.యి. శ్యాంకుమార్ తన సొంత ఊరు క్రిష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామం కు తరలిస్తున్నారు. రాజకీయం లబ్ధి కొరకు. ఇక్కడున్న గురుకుల పాఠశాలను అక్కడకు తరలిస్తే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఉద్యమం చేస్తాం. నిన్న పత్తికొండలో విద్యార్థి సంఘాలు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పత్తికొండ లోనే ఉండాలి.ఇక్కడి నుంచి వేరొక చోటికి తరలించకూడదు అని ధర్నా నిర్వహిస్తే ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ పోలీసులచే విద్యార్థి సంఘాల పై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలి.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ వార్తను చూసైనా స్పందించి పత్తికొండ గ్రామంలోనే గురుకుల పాఠశాలను నిర్మించి వేద విద్యార్థుల కొరకు ఉన్నత చదువులు విద్యార్థులకు చెప్పి వారి భవిష్యత్తును ఎదిగే దిశగా తీసుకోవాలని. ఏ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా నాయకుడు రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ కోడుమూరు పట్టణంలో ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.1
- శ్రీశైలానికి భారీ ఇన్ ఫ్లో.. 118 టీఎంసీలకు చేరిన నిల్వ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి శ్రీశైలానికి 2,45,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతుండగా, నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. ప్రాజెక్ట్ పరంగా పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 863.90 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 118.6216 టీఎంసీలు నిల్వ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మొదలు కాలేదు.1