వేసవికాలంలో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు భీమేశ్వర స్వామి ఆలయంలో ఈవో చర్యలు వేసవికాలంలో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు –శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈవో చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు సమాచారాన్ని సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన స్కానర్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా 8736936969 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వేసవి వేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగేలా ఆలయ ప్రాంగణంలో రెండు భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. “రాజన్న జలప్రసాదం” పేరుతో రెండు త్రాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నిలబడే క్యూ లైన్ల వద్ద త్రాగునీటి నల్లాలను ఏర్పాటు చేశారు. కూల్ బబ్బుల్స్ ద్వారా సేవకులను నియమించి ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భీమేశ్వర సదన్‌లో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి భక్తులకు మరియు ఆలయ కార్యాలయాలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.ఈ ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
వేసవికాలంలో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు భీమేశ్వర స్వామి ఆలయంలో ఈవో చర్యలు వేసవికాలంలో భక్తులకు ప్రత్యేక సదుపాయాలు –శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈవో చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో వేసవి కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు సమాచారాన్ని సులభంగా అందించేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన స్కానర్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా 8736936969 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వేసవి వేడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగేలా ఆలయ ప్రాంగణంలో రెండు భారీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు కల్పించారు. “రాజన్న జలప్రసాదం” పేరుతో రెండు త్రాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు నిలబడే క్యూ లైన్ల వద్ద త్రాగునీటి నల్లాలను ఏర్పాటు చేశారు. కూల్ బబ్బుల్స్ ద్వారా సేవకులను నియమించి ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకునేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భీమేశ్వర సదన్‌లో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి భక్తులకు మరియు ఆలయ కార్యాలయాలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.ఈ ఏర్పాట్లతో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కోతుల బెడదను నివారించడానికి వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ వార్డులోని ముష్టిపల్లి, భూపతి నగర్, చిన్న బోనాల లో కోతుల బెడద వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వాటిని నివారించేందుకు స్థానిక యువకుడు మరియు మున్సిపల్ జవాన్ ఇద్దరి తో గొరిల్లా వేషధారణ వేయించడం జరిగిందని గొరిల్లా వేషధారణతో కోతులను పారద్రోలడానికి ప్రయత్నించడం జరుగుతుందని పదవ వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడలో బ్రాహ్మణులు ఆందోళనకు దిగారు. శంకర్ మఠం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్రస్టు అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, హిందువులపై, వేదాలపై, వేద మంత్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను వెంటనే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే హిందూ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సైనికులు ఎలాగో, హిందూ ధర్మ రక్షణకు బ్రాహ్మణులు అంతే అవసరం అన్నారు. అర్చకులపై దాడులు చేస్తున్న దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.2
- కామారెడ్డి జిల్లా : హైదరాబాద్లో మంగళవారం నిర్వహించే గీత కార్మికుల మహాధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వృత్తి రక్షణ ' కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.1
- జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1