మర్యాదపూర్వకంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కలిసిన నూతన డిఎస్పి. రంపచోడవరం, ఏప్రిల్ 18: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ బొజ్జి రెడ్డి సూచించారు. ఇటీవల నియమితులైన డీఎస్పీ అశ్రాప్ అలీ మర్యాదపూర్వకంగా చైర్మన్‌ను కలిసిన సందర్భంగా ఈ సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రంపచోడవరం గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పోలీసు శాఖతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. గిరిజనుల సమస్యలను అర్థం చేసుకుని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించడం ముఖ్యమని, పోలీసు అధికారులు ప్రజలకు చేరువగా ఉండాలని చెప్పారు. వివాదాలను శాంతి పద్ధతుల్లో పరిష్కరించే దిశగా కృషి చేయాలని డీఎస్పీకి సూచనలు అందించారు. డీఎస్పీ అశ్రాప్ అలీ మాట్లాడుతూ, చైర్మన్ ఇచ్చిన సూచనలను పాటిస్తూ గిరిజన ప్రాంత అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

- డుంబ్రిగూడ మండలంలోని కించుమండలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణం యజమాని సాకేరి అర్జున్ ఇంటికి వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పాడేరు నుంచి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.1
- అచ్చంపేట మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది. ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.1
- MATTUPALLI APPLIANCES nanu1
- నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, వినయ్ భాస్కర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాటికొండ రాజయ్య, శంకర్ నాయక్, పుట్ట మధు తదితరులు బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరమ్మతులు చేపట్టకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు కూడా అమలు కావడం లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి నీటి భరోసా లభించిందని, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు, అధికారులు నమ్మకం కోల్పోయారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.1
- వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.1
- పెదకూరపాడు : వేసవి తాపానికి ప్రధాన వీధులు రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం కి 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వాహనదారులు ప్రయాణాలు కొనసాగించలేకపోయారు. వ్యవసాయ కూలీలు 12 గంటలకి తమ పనుల ముగించుకొని ఇంటి బాట పట్టారు.1
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Yekula lakshmanarao Yekula1