Shuru
Apke Nagar Ki App…
పగిడిమర్రిలో బీభత్సం గాలివాన... చెట్టు కూలి ఆటో ధ్వంసం కనగల్ మండలం, పగిడిమర్రి గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సాన్ని సృష్టించింది. గ్రామంలో చెట్టు కూలి వడ్డెబోయిన చిన్న సైదులు ఆటో (టాటా ఏసీ వాహనం) ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఆటో అద్దంతోపాటు క్యాబిన్ ధ్వంసం అవడమే కాకుండా వాటర్ ట్యాంక్ పగిలిపోయిందని బాధితుడు సైదులు ఆవేదన వ్యక్తం చేశారు.
T Shankar Public News Reporter Nalgonda
పగిడిమర్రిలో బీభత్సం గాలివాన... చెట్టు కూలి ఆటో ధ్వంసం కనగల్ మండలం, పగిడిమర్రి గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సాన్ని సృష్టించింది. గ్రామంలో చెట్టు కూలి వడ్డెబోయిన చిన్న సైదులు ఆటో (టాటా ఏసీ వాహనం) ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఆటో అద్దంతోపాటు క్యాబిన్ ధ్వంసం అవడమే కాకుండా వాటర్ ట్యాంక్ పగిలిపోయిందని బాధితుడు సైదులు ఆవేదన వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Tagore1
- జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఏనుగుల పరశయ్య (ప్రశాంత్) శనివారం స్థానిక రాజన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్థులు మోటర్ల సహాయంతో బావిలోని నీటిని తోడి 16 గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం చివరకు యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.1
- హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు కారుతో ఢీకొట్టడమే కాకుండా తనతో గొడవ పడుతున్నాడనే కోపంతో ఉన్మాదంగా మారిన టాక్సీ కారు డ్రైవర్ తన కారుకి అడ్డంగా నిలబడి పోనివ్వకుండా చేస్తున్నాడనే కోపంతో అలాగే అతడిని ఢీకొట్టుకుంటూ వెళ్ళాలని చూశాడు.. అయితే బాధితుడు కారు బోనెట్ పట్టుకుని అలాగే ఉండిపోయాడు. దీంతో అతన్ని అలాగే రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు మిగతా వాహనదారులు ఈ దుర్ఘటనను వీడియో తీయడంతో ఈ దారుణం భయటపడింది మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన.. ఈ ఘటనలో తండ్రీకొడుకులను కారుతో ఢీకొట్టి వారిపై దాడి ఎస్.కె. జిలానీ, అతని కుమారుడు ఫైసల్ ఇద్దరు గాయత్రీ నగర్ నుండి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా, ఒక కారు వారిని వెనుక నుండి ఢీకొట్టింది. ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగి గొడవకు దారితీసింది.. దీంతో కారులో ఉన్న వ్యక్తి దాడికి పాల్పడ్డాడు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ దాదాపు వాహనాన్ని ఆపకుండా దాదాపు రెండు కిలోమీటర్ల పాటు కారు బోనెట్‌పై ఉన్న అతడిని ఈడ్చుకుపోయాడు. అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించాడు ఆ కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, చివరకు మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డగించడంతో పట్టుబడినట్లు సమాచారం ఘటనలో బాధితుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగిపోయి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు1
- బిజినెపల్లి: అల్లిపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. రైతు డొక్కా శ్రీనివాసులు రెండెకరాల 10 గుంటల పొలంలో వేసిన మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పడిన నిప్పురవ్వల వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి పంటంతా కాలిపోయింది. చేతికి వచ్చిన పంట కళ్లెదుటే కాలిపోవడంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.1
- సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి చౌరస్తా వద్ద ఈ రోజు నిర్వహించిన రైతుల ధర్నాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో అమలు చేస్తున్న గ్రేడ్‌ల విధానం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎన్నో ఆశలతో, అప్పులు చేసి, ఎండను వానను లెక్కచేయకుండా పంట పండిస్తారని, కానీ ధాన్యం అమ్ముకునే సమయంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు నాయకులు తెలిపారు. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, మిల్లర్ల నిర్లక్ష్యం, గ్రేడ్‌ల పేరుతో కోతలు విధించడం రైతులను మరింత ఆర్థికంగా దెబ్బతీస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి నిలిపివేయడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయని, రైతులు రాత్రింబవళ్లు ధాన్యం దగ్గరే కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాగునీరు, టెంట్లు, హమాలీల సౌకర్యాలు కూడా సరైన విధంగా లేవని విమర్శించారు. తేమ, రంగు, గ్రేడ్ పేర్లతో ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అదే ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు తీసుకుంటున్న పరిస్థితి రైతుల్లో అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, గ్రేడ్‌ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే మంగళవారం భారీ సంఖ్యలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.1
- గుంటూరు: ప్రత్తిపాడు మండలం గోట్టిపాడు గ్రామంలో బారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు వరిగడ్డివాములు ఓక లారీ దగ్థం దగ్ధమైంది.వరిగడ్డివాములు గరికపాటి లక్షమయ్య GLR Buolls.. సబందించినవి.షుమారు 25లక్షలు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.1
- కనగల్ మండలం, పగిడిమర్రి గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సాన్ని సృష్టించింది. గ్రామంలో చెట్టు కూలి వడ్డెబోయిన చిన్న సైదులు ఆటో (టాటా ఏసీ వాహనం) ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఆటో అద్దంతోపాటు క్యాబిన్ ధ్వంసం అవడమే కాకుండా వాటర్ ట్యాంక్ పగిలిపోయిందని బాధితుడు సైదులు ఆవేదన వ్యక్తం చేశారు.1
- Post by Tagore1
- మహబూబాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విమర్శించారు. మరిపెడ మండల కేంద్రంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, కాంటాలు పెట్టి మూడు వారాలు గడిచినా ధాన్యం కొనుగోలు చేయక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.1