Shuru
Apke Nagar Ki App…
గాయపడిన లారీ డ్రైవర్ కి సపర్యలు - 108లో హాస్పిటల్ కు తరలింపు* కొండపల్లి మున్సిపాలిటీ HPCL గ్యాస్ ప్లాంట్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో డ్యూటీ దిగి బైక్ పై వెళ్తున్న జి కొండూరు కి చెందిన లారీ డ్రైవర్ పేరు సుధీర్. బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగివున్న IOC సిలెండర్ లారీని ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండడం చూసి. అదే సమయంలో కారులో కొండపల్లి నుండి కొండూరు వెళ్తున్నా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొళియశెట్టి శ్రీకాంత్ గమనించి కారును నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ను సపర్యలు చేసి , 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చిన తరువాత అతని స్థానికుల డ్రైవర్ సాయంతో హాస్పిటల్ కు పంపారు. శ్రీకాంత్ వెంట శ్రీనివాస్ మరియు తోటి డ్రైవర్లు ఉన్నారు
వేముల నాగరాజు
గాయపడిన లారీ డ్రైవర్ కి సపర్యలు - 108లో హాస్పిటల్ కు తరలింపు* కొండపల్లి మున్సిపాలిటీ HPCL గ్యాస్ ప్లాంట్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో డ్యూటీ దిగి బైక్ పై వెళ్తున్న జి కొండూరు కి చెందిన లారీ డ్రైవర్ పేరు సుధీర్. బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగివున్న IOC సిలెండర్ లారీని ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి ఉండడం చూసి. అదే సమయంలో కారులో కొండపల్లి నుండి కొండూరు వెళ్తున్నా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బొళియశెట్టి శ్రీకాంత్ గమనించి కారును నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ ను సపర్యలు చేసి , 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చిన తరువాత అతని స్థానికుల డ్రైవర్ సాయంతో హాస్పిటల్ కు పంపారు. శ్రీకాంత్ వెంట శ్రీనివాస్ మరియు తోటి డ్రైవర్లు ఉన్నారు
More news from తెలంగాణ and nearby areas
- Post by Sampathkumar neerudu1
- ప్రజాప్రాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ SPF యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్,డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, SPF అడిషనల్ కమాండెంట్, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ 41 వ డివిజన్ లోని రాతి చెరువు సమీప ప్రాంతాలలో నెలకొన్న చెత్తాచెదారం తో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ... పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలిపారు. అనంతరం శానిటేషన్, వాటర్ సప్లై, మురికి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.4
- Post by Mannem anilkumar2
- దిండి1
- NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తన మాతృమూర్తి *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు... కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న రుగ్మతతో వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి... ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...2
- NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, కొత్తగా వచ్చే వాహనదారులు, ప్రయాణికులు ఏ గ్రామం ఎంత దూరంలో ఉందో, ఏ వైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులను ఆపి దారి తెలుసుకుంటున్నారు. అధికారులు స్పందించి, గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద సూచికలు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- Post by SS NEWS1
- మండపేట న్యూస్... మండపేట మండలం కేశవరం నుండి అనపర్తి వరకు కెనాల్ రోడ్ లో ఓ వైపు తుప్పలు, పిచ్చి మొక్కలతో నిండి పోతుంది. ఇవి కొన్ని ప్రధాన మలులుపులు వద్ద ఉండటం తో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఈ సమస్యను గుర్తించిన రూరల్ సి ఐ దొరరాజు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిష్కరించారు. ప్రాక్లైన్ తో ఆయా చోట్ల తుప్పలు పిచ్చి మొక్కలు మంగళ వారం తొలగించారు. ఈ సందర్భంగా సి ఐ దొరరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్ల ను గుర్తించి నట్లు తెలిపారు.అక్కడ పెరిగిన పొదలను తొలగించే ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.ఈ క్రమంలో ఆర్ అండ్ బి డీఈ సూర్యనారాయణ మండపేట రూరల్ ఎస్.ఐ వి. కిశోర్ లతో సమన్వయంతో సంబంధిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. వెంటనే బుష్ క్లియరెన్స్ చేశామని చెప్పారు. దీని వల్ల వల్ల రహదారులపై క్లియరెన్స్ మెరుగుపడి, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సహకరించాలని కోరారు.2