Shuru
Apke Nagar Ki App…
Born from softness. Made for everyday comfort. Premium MGM Vests — where comfort takes shape. #MGMVests #PremiumComfort #CottonVest #MensInnerwear #EverydayComfort #CGIReel #VestBrand #SoftnessYouFeel
M G M Hosiery Works.
Born from softness. Made for everyday comfort. Premium MGM Vests — where comfort takes shape. #MGMVests #PremiumComfort #CottonVest #MensInnerwear #EverydayComfort #CGIReel #VestBrand #SoftnessYouFeel
More news from Vizianagaram and nearby areas
- #MGMVests #PremiumComfort #CottonVest #MensInnerwear #EverydayComfort #CGIReel #VestBrand #SoftnessYouFeel1
- రాజస్థాన్ లోని ఒక గ్రామంలో....*పితృపక్షంలో కాకులు రాకపోతే!...* ఈమెను పిలిపించుకుంటారట...! ఈమె ధ్వన్వనుకరణం(మిమిక్రీ) చేయడం ద్వారా కాకులను పిలుస్తారట!!!1
- పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యం తీవ్ర వివాదానికి దారితీసింది. 52 ఏళ్లుగా భక్తుల పూజలు అందుకుంటూ స్వయంభూగా వెలిసిన అత్యంత శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి పాత విగ్రహాన్ని తొలగించి, రోడ్డు పక్కన షెడ్‌లో పడేయడంపై భక్తులు, బీజేపీ నాయకులు రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాత విగ్రహం తో పాటు కొత్త విగ్రహాన్ని పెడతామన్న అధికారులు.. నూతన ఆలయ నిర్మాణం చేపట్టకుండానే, పాత విగ్రహాన్ని పక్కన పెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించడం వెనుక అధికారుల ఉద్దేశాలేమిటని ప్రశ్నించారు. పాత విగ్రహాన్ని నమూనాగా తీసుకుని ఆలయ నిర్మాణానికి డిజైన్ రూపొందించిన ఎండోమెంట్ అధికారులు, అదే విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించకుండా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఏ లబ్ది ఉందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి పాత విగ్రహాన్ని రోడ్డుపక్కన షెడ్‌లో ఉంచడం అధికారుల ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ చర్యలతో ఆలయ సంప్రదాయాలు, భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. పాత విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. అధికారుల వైఖరి మారకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని, స్వామి వారి ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు.2
- శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం సిద్ధాంతం రోడ్డు నుంచి సుమంతాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేది ఎప్పుడని స్థానికులు ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షల ఖర్చుతో కిలోమీటర్ దూరం తారు రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో రోడ్డుపై రాకపోకలకు ఆ ప్రాంతవాసులకు అవస్థలు తప్పడం లేదు1
- శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు. స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.1
- అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.1
- Post by Shyam1
- గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు1