Shuru
Apke Nagar Ki App…
Kandhukuri Ravi
More news from తెలంగాణ and nearby areas
- గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.1
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు1
- ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩 ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.1
- *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.1
- బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.1
- యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.1
- సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి1
- రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1