Shuru
Apke Nagar Ki App…
సరి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ట్రేక్కింగ్ శ్రీ సత్యసాయి జిల్లా,బత్తలపల్లి మండలం డీ. చర్లపల్లి సమీపంలోని కొండల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదివారం అనుచరులతో కలిసి ట్రెక్కింగ్ చేశారు. ప్రకృతి ఒడిలో సాగే ఈ యాత్ర శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. అనంతరం కొండపైన అక్కమ్మ గార్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Saddala Adi
సరి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ట్రేక్కింగ్ శ్రీ సత్యసాయి జిల్లా,బత్తలపల్లి మండలం డీ. చర్లపల్లి సమీపంలోని కొండల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదివారం అనుచరులతో కలిసి ట్రెక్కింగ్ చేశారు. ప్రకృతి ఒడిలో సాగే ఈ యాత్ర శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. అనంతరం కొండపైన అక్కమ్మ గార్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.1
- యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు కీలక బాధ్యతలు యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు సముచిత స్థానం లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు బంగి ఉమాశంకర్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల మనోహర్, జిల్లా కార్యదర్శిగా మేకల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా పరమేశ్వరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయదుర్గం వాసులకు కీలక జిల్లా బాధ్యతలు అప్పగించడంపై సంఘం సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. యాదవ సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి గొర్రెల మేకలు, పశువుల పెంపకానికి లోన్ లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.1
- రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.1
- సరి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ట్రేక్కింగ్ శ్రీ సత్యసాయి జిల్లా,బత్తలపల్లి మండలం డీ. చర్లపల్లి సమీపంలోని కొండల్లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదివారం అనుచరులతో కలిసి ట్రెక్కింగ్ చేశారు. ప్రకృతి ఒడిలో సాగే ఈ యాత్ర శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. అనంతరం కొండపైన అక్కమ్మ గార్ల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.1